కరోనా కేసుల్లో రష్యాను మించిన భారత్, ఇంగ్లండులో పబ్ లు ప్రారంభం

కరోనా కేసులలో భార‌త్‌ స్థితి అంతర్జాతీయంగా మరింత దిగజారింది.  నాలుగో స్థానంలో ఉన్న ఇండియా ఇపుడు మూడో స్థానంలోకి చేరింది. రష్యా మూడో స్థానంలో నుంచి నాలుగో స్థానానికి వచ్చింది.  భారత్ పైన ఉన్న దేశాలు అమెరికా, బ్రెజిల్ మాత్రమే.  భారత్ కేసుల సంఖ్య 6,97,413 కు పెరిగితే, రష్యా 6,81,251 వద్ద వుండిపోయింది. అమెరికా కరోనా కేసుల సంఖ్య 29,54,999 కాగా బ్రెజిల్ కేసులు 15,78,376. అయితే, భారతదేశంలో కోలుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 4, 24,432 మంది. ఇపుడు యాక్టివ్ కేసులు2,53,287. భారతదేశంలో రికవరీ రేటు 60.85 శాతం. ఆదివారం నాడు ఇది 60.77శాతమే. అంటేకొద్దిగా మెరుగుపడిందన్నమాట.
అమెరికాలో  37 రాష్ట్రాలలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఫ్లారిడాలో  నిన్న ఒక్క రోజే  రికార్డు సృష్టిస్తూ 11వేల కేసులు నమోదయ్యాయి.  ఇక ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రం లాక్ డౌన్ మళ్లీ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. పొరుగున ఉన్న న్యూసౌత్ వేల్స్ రాష్ట్రంలో సరిహద్దులు మూసేసింది. మెల్ బోర్న్ లో 3000 మంది ఐసోలేషన్ టవర్స్ లో పెట్టారు. పరీక్షలన్ని అయిపోయి ఫలితాలు వచ్చే దాకా వారెటు పోకుండా బంధించేశారు. కాకపోతే, భోజనాలందిస్తున్నారు. వీరిలో  398కి పరీక్షలు నిర్వహిస్తే 53 మంది పాజిటివ్ అని తేలింది. అదివారంనాడు విక్టోరియా రాష్ట్రంలోనే 127 తాజాకేసులు కనిపించాయి.
ఇంగ్లండులో పబ్ లు ప్రారంభం
అయితే, యూరోప్ మాత్రం కరోనానుంచి కోలుకున్న పండగ చేసుకుంటూ ఉంది. స్కూళ్లు తెరచుకుంటున్నాయి. పబ్ లు ప్రారంభమయ్యాయి.

కరోనా లాక్ డౌన్ తో మూతబడిన పబ్ లను ఇంగ్లండ్ 15 వారాల తర్వాత తెరిచేందుకు బ్రటిన్ ప్రభుత్వం అనుమతించింది. బ్రిటన్ లో దాదాపు 60 వేల పబ్ లుంటాయి. హైదరాబాద్ ఇరానీ హోటల్ల లాగా బ్రిటన్ కు పబ్ గుండెకాయ. పబ్ ల మద ఎంతకవిత్వం వచ్చిందో లెక్కేలేదు. శనివారం నుంచి పబ్ లు ప్రారంభం కావడంతో చాలా చోట్ల మీద  రద్దీ మొదలయింది.  అయితే, హైదరాబాద్ లో వైన్ షాపులు ప్రారంభించినపుడెలాంటి సందడి ఉండిందో ఇంగ్లండులో పబ్ లు ప్రారంభమవుతూనే అదే గందరగోళం నెలకొనింది.  సోషల్ డిస్టెన్స్ నియమాలను గాలికొదిలేశారు. తాగాక చాలా చోట్ల ప్రజల ప్రవర్తన సరిగ్గాలేదనే ఫిర్యాదులందుతున్నాయని సిఎన్ ఎన్ రాసింది. చాలా రోజుల తర్వాత పబ్ లు తెరుచుకోవడం ప్రవాహంలాగా లోని దూకుతున్నారు.పబ్ ల దగ్గిర QR కోడ్ స్కాన్   చేశాకే లోపలికి అనుమతిస్తారు.కాంటాక్టు వివరాల కోసం ఈ నియమం పెట్టారు. కేవలం టేబుల్ సర్వీసు మాత్రమే అనుమతిస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించాలనే నియమం ఉన్నా ఎవరూ లెక్క చేయడం లేదు.
బ్రిటన్ చరిత్రలోనే ఇలా పబ్ లను మూకుమ్మడిగా మూసేసని సంఘనలు లేవని చెబుతారు. అందుకే శనివారంనాడు పబ్ లు తెరుచుకోగానే అంధకారంలోని వెలుగులోకి జారిపడిన ఆనందం కేరింతలు పబ్ లలో కనిపించాయి. అదేసయంలో ఇది ఆందోళన కూడా కలిగిస్తున్నదని పోలీసులు చెబుతున్నారు. ప్రభుత్వం శనివారం పబ్ లు తెరవాలని ప్రకటించగానే, శుక్రవారం మధ్యాహ్నానికే టేబుల్స్ అన్నీ బుక్ అయిపోయాయి.