విజయవాడ: కోవిడ్-19 కారణంగా విదేశాలకు వెళ్లాలనుకుని ఆగిపోయిన వారికి, విదేశాల నుంచి తిరిగి వచ్చి మన రాష్ట్రంలోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నవారికి ‘స్థానిక ఉద్యోగ ఆసరా’ పేరుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్ఎస్ డిసి), ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఓమ్ క్యాప్) సంస్థల ఎండి డాక్టర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు.
ఎపిఎస్ఎస్ డిసి, ఓంక్యాప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ నైపుణ్య శిక్షణా కేంద్రం ద్వారా ఇంటి, వంటిపని వారు, డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్, ఏసీ టెక్నీషియన్, మెకానిక్స్, ఫిట్టర్,ఆరోగ్య సిబ్బంది తదితర విభాగాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఉద్యోగాల సమాచారం, కౌన్సిలింగ్, స్కిల్ టెస్ట్, శిక్షణ నైపుణ్యాలు లాంటి సమాచారం కోసం ఎపిఎస్ఎస్ డిసి హెల్ప్ లైన్ నంబర్ 18004252422లో గానీ, 9440056699, 9701811853, 0866-2485348,2484348 నంబర్లలోగానీ, సంప్రదించాలని డాక్టర్ అర్జా శ్రీకాంత్ సూచించారు.