కరోనా కేసుల్లో ఇటలీని దాటిపోయిన ఇండియా

కరోనా కేసుల్లో ఇండియా ఇటలీని దాటిపోయింది. గత 24 గంటలలో 9,887 కేసులు నమోదకావడంతో భారత దేశంలో కరోనా కేసుల సంఖ్య2,36,657కు చేరింది.
ఇదే విధంగా దేశంలో కరోనా మృతుల సంఖ్య6,642 కు చేరింది. గత 24 గంటల్లో మరణించి వారు 294 మంది. రోజూ 9 వేల కంటే ఎక్కువగా కొత్త కేసులు నమోదు కావడం ఇండియాలో ఇది వరుసగా మూడో రోజు. దీనితో ఇండియా కరోనా ఉగ్ర రూపంలో ఉన్న దేశాల్లో ఆరోస్థానానికి చేరింది.
అమెరికా, బ్రెజిల్, రష్యా, స్పెయిన్, యుకె ల తర్వాత ఇండియా యే నని జాన్స్ హాప్ కిన్స్ యూనివర్శిటీ తెలిపింది.
ప్రస్తుతం భారతదేశంలో 1,15,942 యాక్టివ్ కేసులున్నాయి. 1,14,072 మంది అంటే 48.20 శాతం కోవిడ్ నుంచి కోలుకుని బయటపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
నిన్న చనిపోయిన 294 మందిలో మహారాష్ట్ర నుంచి 139 మంది ఉన్నారు. మిగతా వారిలో ఢిల్లీ నుంచి 58 మంది, గుజరాత్ నుంచి 35, తమిళనాడు 12 , ఉత్తర ప్రదేశ్ నుంచి 12, పశ్చిమ బెంగాల్ నుంచి 11, తెలంగాణ నుంచి 8, మధ్య ప్రదేశ్ నుంచి 7, రాజస్థాన్ నుంచి 5, ఆ:ధ్ర ప్రదేశ్ లో 2, జమ్ము-కాశ్మీర్, ఒడిశా, పంజాబ్, జార్ఘండ్, ఉత్తరాఖండ్ ల నుంచి ఒక్కొక్కరుఉన్నారు.
చాాలా దేశాలలో లాక్ డౌన్ సడలించిన తర్వాత కరోనా కేసుల సంఖ్య తగ్గడం కనిపించింది. కానీ ఇండిాలో లాక్ డౌన్ కాలంలోనే కాదు,  లాక్ డౌన్ తర్వాత కూడా పెరగడం కనిపిస్తుంది. దీనమీదే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేశారు.స్పెయిన్ జర్మనీ తదితర దేశాలతో ఇండియాను పోలుస్తూ కొన్ని గ్రాఫ్ లు ఇక్కడ ఉన్నాయి. పరిశీలించండి. ఇదే ఆట్వీట్: