జీహెచ్ఎంసీ,రంగారెడ్డి పరిధిలో టెన్త్ పరీక్షలు వాయిదా

జీహెచ్ఎంసీ,రంగారెడ్డి పరిధిలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. అక్కడి పాఠశాలలోని  విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు అనుమతించాలని కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
జూన్ 8 నుండి యధావిధిగా పరీక్షలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించుకోవచ్చని కోర్టు అనుమతినిచ్చింది.
అదే విధంగా సప్లిమెంటరీ ఉత్తీర్ణులను కూడా రెగ్యులర్ గా గుర్తించాలని కోర్టు చెప్పింది.
అయితే,, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు అనుమతినిచ్చింది.
జీహెచ్ ఎంసీ, రంగారెడ్డి జిల్లాల్లో జాగ్రత్తలు తీసుకున్నామని పరీక్షలకు అనుమతివ్వాలని  ప్రభుత్వం చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. కరోనాతో ఎవరైనా విద్యార్థి మరణిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. విద్యార్థి మరణిస్తే ఆ కుటుంబానికి ఎన్ని కోట్లు చేస్తారు? ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నిస్తూ  పరీక్షల కన్నా విద్యార్థుల జీవితాలే ముఖ్యమని కోర్టు స్పష్టం చేసింది.
పరీక్ష కేంద్రాలు ఉన్న ప్రాంతాలు కంటైన్ మెంట్ గా మారితే ఏంచేస్తారని అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్పకపోవడం పట్ల హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.
జీహెచ్గ్ ఎంసీ లో పెరుగుతున్న కేసుల దృష్ట్యా లక్షల విద్యార్థులను ప్రమాదంలోకి నెట్టలేమని అందువల్ల పరీక్షలను వాయిదా వేయడమే మార్గమని హైకోర్టు చెప్పింది.
కరోనాా పరిస్థితి ఎప్పటికప్పుడు మారుతున్నందున రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో పది రోజులకోసారి పరిస్థితి సమీక్షించాలనికూడా కోర్టు ఆదేశించింది.
పరీక్షలు జరుగుతున్న ప్రాంతాల్లో కరోనా కేసులు పెరిగితే అక్కడ వాయిదా వేసేలా నిర్ణయం తీసుకోవాలని కోర్టు చేసింది. తామూ  ప్రతి వారం రివ్యూ చేస్తామని చెబుతూ కేసులను   ఈ నెల 19 కి వాయిదా వేసింది.