జగన్ ఏడాది పాలన వేడుకలకు కరోనా దెబ్బ, మేధోమథనాలకే పరిమితం

ఈ నెల 30 న  ముఖ్యమంత్రి వైఎస్  జగన్ ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఒక వారం పాటు ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సంక్షేమ పథకాల పండగ జరపాలుకుంటున్నది.అయితే, కరోనా కారణంగా ఈ ఉత్సవాలు బహిరంగా జరుపుకునే వీలు లేకండా పోతున్నది. మే 31 దాకా కూడా కరోనా లాక్ డౌన్  మార్గదర్శక సూత్రాలు పాటించాలి కాబట్టి జగన్  ప్రభుత్వం వార్షికోత్సవం కూడా నాలుగు గోడల మధ్య జరిగే కార్యక్రమంగా కుదించక తప్పడం లేదని తెలిసింది.

https://trendingtelugunews.com/telugu/breaking/what-is-permitted-and-what-is-not-in-andhra-covid-nodal-officer-arja-srikanth/

గత ఏడాది మే 30 వ తేదీన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక వృద్ధాప్య పెన్షన్ ని రు. 1000 నుంచి రు.2250 కి పెంచుతూ వైెఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి సంతకం చేశారు. ఇకనుంచి పెన్షన్ ప్రతి యేటా 250  పెంచాతామని ప్రకటించారు. అప్పటి నుంచి జగన్ ప్రభుత్వం ఒక డజన్ దాకా నేరుగా లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్ల లోకి  నగదు జమ చేసే పథకాల ప్రారంభించింది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఉపాధి మెరుగుపర్చడం రంగాల్లో ఈ పథకాలు ప్రధానంగా అమలయ్యాయి. అయితే, వీటిని ప్రజల మధ్య పండగ వాతావరణం సృష్టించి ఒక వేడుకగానిర్వహించే వీలులేకుండా పోయింది.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం (Pic credits Sakshipost)
ఈ ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాల మీద  వారం రోజుల పాటు వార్షికోత్సవాలు జరుగుతాయి.  ఈ ఉత్సవాలకు సిద్ధంకావాలని అధికార్లందరికి సమాచారం అందించినట్లు తెలిసింది.  జగన్ ప్రభుత్వ వార్షికోత్సవం గురించి పూర్తి సమాచారం మే 19 సాయంకాలనికల్లా సిద్ధమవుతంది. దీనిని ఖరారు చేసేందుకు మంగళవారం మధ్యాహ్నం అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఏడాది కాలంలో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను సమీక్సించి,వాటిని ముందుకు తీసుకుపోయేందుకు ఇంకా ఎలా మెరుగుపర్చాలనే లక్ష్యంతో  ఈ వార్షికోత్సవాలు సాగుతాయి.
నిజానికి ఎన్నో వినూత్న పథకాలు తీసుకువచ్చిన ప్రభుత్వం ఈ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించాలనుకుంది. అయితే, కరోనా కట్టడి వల్ల సభలు సమావేశాలు, బహిరంగా ఉపన్యాసాలు లేవు కాబట్టి, వార్షికోత్సవ  సందేశాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే విషయం గురించి ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది.
మే 25 వ తేదీ నుంచి మే 30 దాకా అన్ని పథకాల మీద మేధోమథన జరపాలనుకుంటున్నారు. ఈ సమావేశాలకు ఎంపిక చేసిన లద్ధిదారులను పిలిపించి, వారి ఎదుటే పథకాలను సమీక్షిస్తారు.
ఈ మేధోమథనంలో లబ్దిదారులతోపాటు ఈ పథకాలు అమలుచేయడంలో కీలక పాత్ర పోషించిన వారు కూడా పాల్గొంటారు. రాష్ట్రస్థాయిలో ఈ సమావేశాలకు ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షత వహిస్తారు. జిల్లాలలో జిల్లా మంత్రులు ఈ మేధోమధనం నిర్వహిస్తారు.