చాయ్ ఈ మధ్య ఒక గ్రేట్ సక్సెస్ స్టోరీ అయింది. చాయ్ అనేది రాజకీయ వేదిక. ఇంట్లో టీ తాగేటపుడు, లేదా బజార్లో టీ తాగేటపుడు లేదా, యూనివర్శిటీ క్యాంటీన్ లో టీ సేవిస్తున్నపుడు హైదరాబాద్ ఇరానీ హోటల్లో తీరుబడిగా కారా బిస్కెట్ ముంచుకుని టీ చప్పరిస్తున్నపుడు… ఎపుడూ కూడా టీ మనల్ని నిశబ్దంగా ఉంచదు. టీ సేవించడం ఎపుడూ ఏదో ఒక చర్చతో మొదలవుతుంది. ముగుస్తుంది.
నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక టీ హోదా పెరిగింది. ఎక్కడెక్కడ ఉన్న టీ సక్సెస్ స్టోరీలు ఇపుడు బయటకు వస్తున్నాయి. కటక్ లో ప్రకాశ్ రావు అనే ఒక తెలుగు వాడి టీషాపు అంతర్జాతీయ కీర్తి నార్జించింది. టీ కొట్టునడుపుతూ వచ్చిన రాబడిలో సగం డబ్బును పేదపిల్లల కోసం స్కూల్ నడుపుతూ రావు సామాన్యుడి టీహోదాను ఆకాశానికి ఎత్తేశాడు.
తర్వాత మరొక అద్భుతమయిన టీ స్టోరీని మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ బయటపెట్టాడు.
ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ లో మహబూబ్ మాలిక్ తన టీకొట్టు ఆదాయంతో పేద పిల్లలకోసం ఒక పాఠ శాల తెరిచి ఒక చిన్న విప్లవం తీసకువచ్చాడు.
ఇపుడు తాజాగా ఒరిస్సానుంచి ఒక టీ సక్సెస్ స్టోరీ బయటకు వచ్చింది. ఇది సూపర్ 30 నుంచి ఇన్ స్పైర్ అయిన స్టోరీ. ఈ టీ సక్సెస్ స్టోరీలో కథానాయకుడు అజయ్ బహదూర్ సింగ్.
తనుజీవితంతో ఉన్నత చదువుకోలేకపోయాడు, డాక్టర్ కావాలన్న లక్ష్యాన్ని పేదరికం, అనుకోకుండా కుటుంబంలో వచ్చిన ఆర్థిక సంక్షోభం ఛిద్రం చేశాయి. ఈ పేదరికం తనను డాక్టర్ కాకుండా అపింది. ఇపుడు దీనికి ప్రతీకారంగా వందలాది మంది పేదపిల్లలను డాక్లర్లను చేస్తా అని శపథం చేశాడు. పేద పిల్లలకు నీట్ (NEET) ఉచితంగా కోచింగ్ ఇవ్వాలనుకున్నాడు. మొదలుపెట్టాడు. అన్నీ ఉచితమే. భోజనంతో సహా. దీనికోసం జిందగీ అనే ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. కృషి మొదలుపెట్టాడు. విజయవంతంగా ముందుకు సాగుతున్నాడు. ఆయనకు ఇపుడు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.బీహార్ లో ఆనంద్ కుమార్ సోదరులు నడుపుతున్న సూపర్ 30 ని ఆదర్శంగా తీసుకుని చేసిన ప్రయోగం ఇది. తన సూపర్ 30 తో ఉత్తేజం పొంది ఒదిషా భవనేశ్వర్ లో మొదలయిన ATOM-50 ప్రయోగాన్ని చూసేందుకు ఆనంద్ కుమార్ స్వయంగా భువనేశ్వర్ వచ్చాడు. తన ప్రతిబింబాన్ని చూసుకుని ధ్రిల్ అయ్యాడు.
అజయ్ బహదూర్ సింగ్ 1972, జూన్ 5 తేదీన బీహార్ (ఝార్ఖండ్ లోనిదేవ్ గడ్ జిల్లాలో) పుట్టాడు. ఇంటర్ చదివి మెడికల్ ఎంట్రెన్స్ కు ప్రిపేరయ్యేందుకు సిద్ధమయ్యే దాకా అజయ్ జీవితంలో ఒడిదుడుకుల్లేవు. 1990 లో మెడికల్ ఎంట్రెన్స్ కు పాట్నాలో ప్రిపేర్ అవుతున్నాడు. అపుడే తొలిసారి ఆయన జీవితం తలకిందులయ్యే పరిస్థితి ఎదురయ్యింది. తండ్రికి మూత్ర పిండం సమస్య వచ్చింది. ఆయన బతకాలంటే వెంటనే ఒకటైనా కిడ్ని కావాలి. ఇది ఆయన కుటుంబంలో భూకంపం సృష్టించింది. సాఫీగా, సజావుగా, సాగుతున్న బతుకున్న ఉన్నట్లుండి తుఫాన్ లో చిక్కకుంది. ఆయన మెడికల్ ఎంట్రెన్స్ ప్రిపేరేషన్ మానేయాల్సి వచ్చింది. ఆస్తి అమ్మి కిడ్ని ట్రాన్స్ ప్లాంట్ కోసం చెన్నై వెళ్లారు. ఈ పని పూర్తయింది గాని, కటుంబ నడవడం కష్టమయింది. పెద్ద కొడుకుగా తనే ముందుకు దూకి కుటుంబాన్ని పోషించాలి. ఇక చదువు సాగదనుకున్నాడు.
సులభంగా, తక్షణం డబ్బులు వచ్చేందుకు చేయగలిగిందేమిటి? ఏదైనా షాపులో చేరడం లేదా తనే ఒక షాపు పెట్టడం. ఇలా ఆలోచిస్తున్నపుడు ఆయనకు సులభంగా తాను చేయగలిగింది ఒక టీ దుకాణం పెట్డడమే అనుకున్నాడు. అంతే టీ అంగడి తెరిచాడు. టీ తో పాటు షర్బత్ కూడా పెటాడు. దేవగడ్ లోని శ్రావిణి మేలా జంక్షన్ లో కొట్టు తెరిచాడు.టీ వ్యాపారం సక్సెస్ అయిది.
ఇలా టీ షాప్ తో వచ్చే డబ్బును తండ్రి చికిత్స మీద ఖర్చు చేస్తూ వచ్చాడు. తరచూ చెన్నైకి వెళ్తూ వస్తుండటం వల్ల చదవు కొనసాగించడం కష్టమయింది. తనకిష్టమయిన చదువాగిపోయింది.
ఇదే సమయంలో ట్యూషన్లు కూడా చెప్పేవాడు. తర్వాత సోడా తయారు చేసే మిషన్లు విక్రయించే పనికి పూనుకున్నాడు. టీ మీద ఆధాపడుతూ కొద్ది కాలానకి డిగ్రీ పూర్తి చేశాడు. డిగ్రీ తర్వాత గ్రూప్ ట్యూషన్లు మొదలుపెట్టాడు. దీన్నుంచి ఆయన ఒక కోచింగ్ సెంటర్ పెట్టాలనుకున్నాడు. మొదట బ్యాంకింగ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వేలు, ఎన్ డిఎ,నేవీ ఎయిర్ ఫోర్స్ లకు కోచింగ్ ఇవ్వాలనుకున్నాడు. పాట్నాలోనే ఒక సింగిల్ రూమ్ అద్దెకు తీసుకుని కోచింగ్ మొదలుపెట్టాడు. ఇది బాగా విజయవంతమయింది. డబ్బు ఇక్కట్లు ఒక్కసారిగా తీరిపోయాయి. దీనితో కాంపిటీటివ్ పరీక్షలకు అవసరమయిన పుస్తకాలు ప్రచురించడం మొదలుపెట్టాడు. అది రెండో ఘన విజయమయింది.
ఇపుడు ఆయన జీవితంలో కొత్త దశ మొదలయింది. 2007లో ఆయన ఒదిషాకు మకాం మార్చారు. ఆద్యంత్ ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్టు ప్రారంభించి అద్యంత్ జూనియర్ కాలేజీ (ప్లస్ టు) తెరిచారు.ఇది అన్నీ బెస్టు వసతులో ,బెస్టు కోచింగ్ ప్రాక్టీస్ తో మొదలయింది. ఈ దశలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆయనకు గతం గుర్తుకు వచ్చింది. పేదవాళ్లలో ఎందరో ప్రతిభావంతులయిన విద్యార్థులున్నారు. వాళ్లు పేదరికం వల్ల చదవు కొనసాగించలేక పోతున్నారు, ప్రోత్సాహం లేక కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేర్ కాలేక పోతున్నారు.అపుడు ఆయన సూపర్ 30 ఆనంద్ కుమార్ ను స్ఫూర్తిగా తీసుకుని ATOM-50 ప్రాజక్టు ప్రారంభించాడు. షెడ్యూల్డ్ కలాల, తెగల, సాంఘికంగా, ఆర్థికంగా వెనకబడిన తరగతుల పిల్లలకు ఉచితంగా ఐఐటి/neet కోచింగ్ ఇవ్వడం ప్రారంభించాడు. ఇంటర కాలేజీలో పూర్తి ఉచిత విద్య, తర్వాత ఆటమ్ -50 లో కోచింగ్ …భోజనం, బస , అన్నీ ఉచితమే. ఫీజుల్లేవు. ఇది విజయవంతమయింది. ఇపుడు యాటమ్-50 విద్యార్థులు ఎయిమ్స్, ఐఐటిలతో పాటు అనేక పేరుమోసిన ప్రొఫెషనల్ కాలేజీల్లో కనిపిస్తారు.