టీ, చాయ్ అనే మాటలెలా వచ్చాయో తెలుసా?

మన ఊర్లలో తేనీటి ని రెండు పేర్లతో  పిలుస్తారు, ఒకటి ‘చాయ్’ (chai, chay), రెండోది ‘టీ’ (tea).
మన వూరి సంగతే కాదు, ఎవో బర్మా లాంటి ఒకటి రెండు దేశాల్లో తప్ప ప్రపంచమంతా కూడా టీ ని ఈ రెండు పేర్లతోనే పిలుస్తారు. ఇక్కడ టీ ని స్థానికంగా పండిస్తారు కాబట్టి వాళ్లకు స్థానిక భాష పదాలున్నాయి. ఉదాహరణకు బర్మాలో lasphak అని పిలుస్తారు. అందువల్ల తేనీటికి మూడో పేరు చాలా అరుదు. అదెక్కడయినా ఉన్నా ఆదేశ సరిహద్దులు దాటిపోలేదు.
టీ , చాయ్ అనే మాటలెలా వచ్చాయనేది ఆసక్తికరమయిన చర్చ . టీ అనేది ఇంగ్లీష్ మాట అయితే, చాయ్ అనేది హిందీ పదమని మనకు తెలుసు.
అయితే, కొంత వరకు ఇది నిజమే అనిపించినా, టీ,చాయ్  రెండు మాటల వ్యవహారం ఇంత సులభంగా లేదు. ఈ పేర్లు రావడం వెనక చాలా చరిత్ర ఉంది.
టీ , చాయ్ లకు మాతృక చైనా భాష . ప్రపచంచంలో ఈ రెండు మాటలను వేర్వేరు భూభాగాల్లో వేర్వేరుగా వాడినా, రెండింటికి మూలం ఒకటే చైనా అక్షరం లేదా ఒకటే పదం.

 

ఇదెలా జరిగిందేంటే…
నిజానికి పైకి ఏమాత్రం పోలిక లేనివిగా టీ,చాయ్ లు కనిపిస్తాయి. ఈ రెండు మాటలకు మూలం (茶)  అనే చైనా అక్షరం. ఈ అక్షరాన్ని చైనా లోపలి ప్రాంతాల మాండలికాలలో ఒక రకంగా పలుకుతారు. కోస్తా ప్రాంతంలో మరొక రకంగా పలుకుతారు. మీరు తాగే టీ ఎటువైపు నుంచి వచ్చిందనే దానిని బట్టి మీరు టీ అనో  లేదా చాయ్ అనో ప్రాచర్యంలోకి వచ్చింది.
చైనా టీ వ్యాపారం గ్లోబలైజేషన్ అయిన మార్గాలు ఈ పలకడాన్ని విడదీసి ప్రపంచమంతా తీసుకెళ్లాయి.
గ్లోబలైజేషన్ అనేది ఈ మధ్య సాఫ్ట్ వేర్ తో, కమ్యూనికేషన్స్ టెక్నాలజీ అభివృద్ధి కావడంతో జరిగింది మాత్రమే కాదు. కనీసం రెండువేళ ఏళ్లుగా గ్లోబలైజేషన్ సాగుతూనే ఉందని ఈ మధ్య సిల్క్ రోడ్లు బయటపడటంతో వెల్లడయింది.
ప్రపంచ వాణిజ్యంలో చైనా ఎపుడూ కీలకపాత్ర పోషిస్తూనే ఉంది. చైనా నుంచి పట్టు వస్త్రాలు, ఆ తర్వాత టీ ప్రపంచమంతా ఎగుమతయ్యాయి. టీ ఎగుమతులకు రెండు వేల సంవత్సరాల చరిత్ర దాకా ఉందని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి.
చైనా వ్యాపారం గ్లోబలైజ్ కావడం రెండు పద్ధతుల్లో జరిగింది. ఒకటి భూమార్గంలో , రెండు సముద్ర మార్గంలో.
భూమార్గంలో సిల్క్ రోడ్ల వెంబడి టీ వ్యాప్తి చెందిన చోటల్లా అది చాయ్ గా ప్రచారమయింది. సముద్ర మార్గంలో వ్యాప్తి చెందిన దేశాలల్లో అది టీ అయింది. చైనా నుంచి డచ్ వ్యాపారులు సముద్ర మార్గంలో తెయాకును యూరోప్ కు తీసుకెళ్లి వ్యాపారం చేశారు.
చైనా లో  茶 అనే మాట చాయ్ అని పలుకుతారు.
茶 అనే మాటను రెండు రకాలుగా పలుకవచ్చు. మాండరిన్ చైనా లో  茶 ని చా (chá) అని పలుకుతారు. ఇదే మాట 茶  ని మిన్ నాన్ మాండలికాలలో, కోస్తా ప్రాంతాలలో ముఖ్యంగా ఫూజియన్ ప్రాంతంలో దీని టీ ( te) అని పలుకుతారు. అంటే టీ అనే మాట కోస్తాకు సంబంధించింది.
కోస్తా ప్రాంతాల రేవుల కేంద్రం గా డచ్ వారు వ్యాపారం చేసేశారు. 17 వ శతాబ్దంలో యూరోప్, ఏసియాల దేశాల మధ్య సముద్ర మార్గంలో పెద్ద ఎత్తున టీ వ్యాపారం చేసింది డచ్ వ్యాపారస్థులే.  ఫుజియన్, తైవాన్ రేవులు వీళ్ళకి కేంద్రాలు. ఇక్కడి ప్రజలను చాయ్ ని 茶 ని te (టీ) అని పలికుతారు కాబట్టి డచ్ వ్యాపారస్థులు ఆదే పలుకును స్వీకరించారు. అలాగే యూరోప్ కు తీసుకువెళ్లారు. అదే ఫ్రెంచ్ లో thé అయింది. జర్మనీలో Tee, ఇంగ్లీష్ లో tea అయి కూర్చుంది. ఈ మ్యాప్ లో బ్లూ చుక్కలు సముద్ర మార్గం గుండా తేయాకు టీ గా పరిచమయింది. పింక్ చుక్కలు భూమార్గం ద్వారా చాయ్ గా ప్రచారమయ్యాయి. మ్యాప్ సోర్స్ క్వార్జ్.కామ్)
ఏసియాతో వ్యాపారం చేసిన వాళ్లలో డచ్ వాళ్లే మొదటి వారు కాదు. అంతకు ముందు పోర్చుగీసు వారు కూడా వ్యాపారం చేశారు. తైవాన్ కి ఫార్మోజా అనే పేరు పెట్టింది కూడా పోర్చుగీసు వారే. పోర్చు గీసు వారు కూడా టీ వ్యాపారం చేశారు. వాళ్లు ఫుజియన్ రేవు నుంచి కాకుండా మకావ్ (Macao) నుంచి చేశారు. అక్కడ టీ ని  చా అని పిలిచేవారు. సముద్రమార్గం గుండానే పోర్చుగీసు వారు చా అని తీసుకువెళ్లినా, అది ప్రాచర్యం పొందలేదు. డచ్ వారి టీ యే పాపులర్ అయింది.
ఇక చాయ్ విషయానికి వద్దాం. రెండో గ్లోబలైజేషన్ మార్గం భూమర్గం. అంటే ఇది సిల్క్ రోడ్ల వెంబడి జరిగింది. చైనా నుంచి భూభాగంలోని వ్యాపార కేంద్రాల ద్వారా టిబెట్ మీదరు  సెంట్రల్ ఏసియాకు,దక్షిణాసియాకు, పర్షియాకు తేయాకు  వెళ్లింది.ఈ భూమార్గ ఎగుమతులు జరిగిన పట్టణాలలో తేయాకుని  చా అని పలికే వారు. అందుకే భమార్గాన టీ వ్యాపారం చేసిన వాళ్లు చా అనే మాటను  తీసుకువెళ్లారు. అందుకే  ఇది పర్సియాలో చాయ్ (chay) అయింది. పర్షియా నుంచి అది అన్ని వైపులా వ్యాప్తి చెందింది. ఉర్దులో చాయ్ అయింది. షేయ్ అని అరబిక్ లో ప్రవేశించింది. చేయ్ రష్యాకి వెళ్లింది. హిందీలో కూడా చాయ్ గానే కనిపించింది. చివరకు సబ్ సహారా ప్రాంత్రాల్లోకి కూడా చాయ్ గానే వెళ్లింది. స్వాహిలి భాషలో కూడా చా అనే పిలుస్తారు.
ఇండియాకు భూమార్గంనుంచి, సముద్ర మార్గంనుంచి కూడా వచ్చివుండవచ్చే. అందుకే ఇక్కడ ప్రజలు ముఖ్యంగా ఉత్తరాది వాళ్ల చాయ్ ఇష్టపడతారు. దక్షిణాది వాళ్లు టీ అనే పిలుస్తారు.
ఇది టీ, చాయ్ ల వెనక కథ.
(ఈ స్టోరీ మీకు నచ్చితే, నలుగురికి షేర్ చేయండి. trendingtelugunews.com ను ఫాలో కండి)