లంచాలు మానుకోవడం కాదు, మహిళా ఎమ్మార్వోలకు ఇకనుంచి ఇలా భద్రత

తెలంగాణలో పట్టాపాస్ పుస్తకాల కోసమో మరొక దాని కోసం మండలాఫీసులకు వచ్చే ఆగ్రహ బాధిత రైతులనుంచి రక్షణ కోసం తాహశీల్లార్లు అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించారు.
మొన్న అబ్దుల్లాపూర్ మెట్ తాహశీల్దార్ విజయారెడ్డిని ఒక బాధితుడు సజీవ దహనం చేసిన దుర్ఘటన  తర్వాత రెవిన్యూఅధికారులు భద్రత గురించి ఆలోచించడం మొదలుపెట్టారు.
ఇకనుంచి మండల కార్యాలయాలకు వచ్చే వారి మీద నిఘా వేస్తూనే ఇతర భద్రత చర్యలు తీసుకోవాలనుకున్నారు.
 ముఖ్యంగా  మహిళా తాహశీల్దార్లు మిరియాల పొడి స్ప్రే (pepper spray) భద్రత కోసం  వెంటతీసుకువెళ్లాలని సలహా ఇచ్చినట్లు డిప్యూటి కలెక్టర్ అసోసియేషన్అధ్యక్షుడు వి లచ్చిరెడ్డి చెప్పారు.
‘విజయారెడ్డి మీద జరిగిన చాలా అకస్మాత్తుగా జరిగింది. ఇకనుంచి మహిళా తాహశీల్దార్లు అప్రమత్తగా ఉండాలి, జాగ్రత్త తీసుకోవాలి. ఇక నుంచి చాలా అప్రమత్తంగా ఉండాలని తాహశీల్దార్లు సలహా ఇచ్చాం. మిరియాల స్ప్రే వెంట తీసుకువెళ్లాలని చెప్పాం,’అని లచ్చిరెడ్డి టైమ్సాఫ్ ఇండియాకు చెప్పారు.
తెలంగాణలో వేయిమంది దాకా తాహశీల్దార్లు న్నారు. ఇందులో 400 మంది మహిళలున్నారు.
నవంబర్ నాలుగో తేదీకుర్రా సురేష్ వ్యక్తి అబ్దుల్లాపూర్ మెట్ మండలాఫీసులోకి పెట్రోల్ సీసాతో వెళ్లి, తన పని చేయడం లేదన్న అక్కసుతో ఆమె పెట్రోలు పోసితగుల బెట్టాడు.
ఈ సంఘటన రెండు విషయాలను చర్చనీయాంశం చేసింది. ఇందులో ఒకటి మండాలఫీసుల్లో ఉన్న అవినీతి రెండోది, రెవిన్యూ అధికారులకు భద్రత.
ఈ రెండు విడదీయరాని విషయాలు. ఒకదానితో ఒకటి ముడివడి ఉన్నాయి. విజయారెడ్డి సజీవదహనం తర్వాత చాలా ఎమ్వార్వో కార్యాలయాల్లోకి రైతులు, ఇతర వర్గాల ప్రజలు పెట్రోలు సీసాలతో వెళ్లి, తమ పనులు ఎంతకాలంగా పెండింగులో ఉంటున్నాయి, మండలకార్యాలయాల్లో ఎంతెంత లంచంగుంజారో ప్రజలు బయటపెడుతున్నారు.
ఎమ్మార్వో ల చేతిలో ఎంత తీవ్రమయిన మానసిక క్షోభ అనుభవిస్తున్నారో వారంతా వెల్లడించారు.
విజయారెడ్ది దారుణ హత్య దగ్గిర నుంచి ఈ సంఘటనల దాకా ఒక విషయం అర్థమవుతుంది. రెవిన్యూఅధికారులకుఅభద్ర వస్తున్నది సంఘ వ్యతిరేక శక్తుల వల్ల కాదు, అవినీతి వల్ల అని.
వాళ్లకు అవినీతి నుంచి అభద్రత వస్తున్నందున ,భద్రత కోసం అవినీతి ని అంతమొందించాలనుకోవాలి గాని, మిరియాల పొడి, కారప్పొడి తీసుకెళ్లి భద్రంగా ఉండగలరా?
మహిళా ఎమ్మార్వోలు బ్యాగులోనుంచి లేదా టేబుల్ సొరుగులోనుంచి  మిరియాల స్ప్రే తీసి చల్లేలోపు ఏఅఘాయిత్యమయినా జరగవచ్చు.
ఆశ్చర్య మేమిటంటే రెవిన్యూఅధికారుల సంఘాలు గాని, రెవిన్యూ ఉద్యోగుల సంఘాలు గాని, తమకు అభద్రత ఏర్పేడేందుకు కారణమయిన అవినీతి గురించి విజయారెడ్డి మరణించినప్పటినుంచి ఇప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
తీవ్రమయిన అవినీతి వల్ల మన బతుకులకు ముప్పువస్తున్నదని, కాబట్టి అవినీతి మానుకోండని ఒక్క అసోసియేషన్ తమ సభ్యులకు సలహా ఇవ్వలేదు.
రెవిన్యూ శాఖ మీద ప్రజల్లో ఉన్న ఏహ్య భావాన్ని పొగొట్టి ప్రజల అభిమానం చూరగొనడమనేది అసలై భద్రతా చర్య. రెవిన్యూ శాఖ వాళ్లు లంచం మానడం గురించి మాట్లాడకుండా మిగతా అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. ఒక్క నాయకుడు జనంలో రెవిన్యూశాఖ అవినీతి మయం అని అపకీర్తి ఉంది,దానిని పొగొట్టేందుకు కృషిచేద్దామని ఒక్క రెవిన్యూ సంఘం పిలుపునీయలేదు.
తెలంగాణ తాహశీల్దార్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ రాములు మాట్లాడుతూ మర్రివిజయారెడ్డి దుర్ఘటన తర్వాత ఇలాంటి సంఘటనలు ఇంకా జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
బాగానే ఉంది. మరికి వాటిని నివారించేందుకు ఏమి చేయాలి?
‘ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఇకనుంచి తాహశీల్దార్లను కలుసుకునేందుకు వచ్చే వారిని సంచులతో అనుమతించేదిలేదు.’ అని ఆయన పరిష్కారమార్గం చూపారు. విజిటర్లను సోదా చేసి కేవలం పిటిషన్లను మాత్రమే అనుమిస్తారట.
ఇక నుంచి తాలూకా ఫీసుల్లో సెక్యూరిటీ పెంచాలని ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు, పోలీసు సూపరింటెండెంట్లకు ఉత్తర్వులు జారీచేస్తున్నది.
ఈ మేరకు ప్రభుత్వం నుంచి హామీ రావడంతో ఈ రోజు సమ్మెను విరమించి విధుల్లో చేరాలని రెవిన్యూఅధికారుల సంఘం నిర్ణయించింది.