ఎన్నికలను ఎంతగా సంస్కరించినా, ఎన్నికల్లో గెలవడం శేషన్ చేత కాలేదు…

ఎన్నికల కమిషనర్ అంటే టిఎన్ శేషన్. టిన్ శేషన్ అంటే ఎన్నికల సంస్కరణలు.
అంతవరకు ఎన్నికల కమిషన్ గురించి ఎవరికీ పెద్ద గా తెలియదు. శేషన్ ఎన్నికల కమిషన్ బాధ్యతలు స్వీకరించాక నిర్వాచన్ సదన్ ( ఎలెక్షన్ కమిషన్ కార్యాలయం న్యూఢిల్లీ) పార్లమెంటులాగా పాపులర్ అయింది.
సింపుల్ ఎన్నికల్ కోడ్ ని ఒక వజ్రాయుధంలాగా రాజకీయనాయకుల మీద ప్రయోగించాడు. బూత్ క్యాప్చరింగ్, దొంగవోట్లు, డబ్బులు పంచడం, విచ్చల విడిగా ఖర్చేచేయడం, ఎన్నికల దౌర్జన్యాలను అన్నింటిని కోడ్ అనే మంత్ర దండంతో కనిపించకుండా చేసిన చీఫ్ ఎన్నికల కమిషనర్ ఆయన.
ఈ కోడ్ ను తీసుకుని అరేళ్ల పాటు రాజకీయ నాయకుల గుండెల్లో నిద్రపోయాడు. అంతేకాదు,ఎన్నికలను పర్యవేక్సించే ఐఎఎస్ అధికారులకూ ఆయన సింహస్వప్నం మయ్యారు. శేషన్ పేరు చెబితే రాజకీయ నాయకులకు చెమటలు పట్టే పరిస్థితి వచ్చింది.
1990 నుంచి 1996 దాకా శేషన్ కూర్చుంటే నిర్వాచన్ సదన్ సెగలు దేశమంతా వ్యాపించేవి.
ఆరోజుల్లో మోస్ట్ పాపులర్ పేరు టిఎన్ శేషన్ అయింది. చదువుకున్న వాళ్లకే కాదు, చదువురాని వోటరు కూడ శేషన్ పేరు ప్రస్తావించే పరిస్థితి తీసుకువచ్చారు. భారత దేశ చరిత్ర లో  ఒక అధికారి ఇలా అఖిల భారతస్థాయిలో మెగా స్టార్ కావడమనేది గతంలో ఎపుడూ జరగలేదు.
ఇంతగా భారత దేశ ఎన్నికలను, ఎన్నికల విధానాలను ప్రభావితం చేసిన వ్యక్తి మరొక లేరు.
అయితే, ఇవే ఎన్నికల్లో ఆయన బోల్తాపడ్డారు. తనని కీర్తించి ఆకాశానికెత్తిన  వోటర్లే  ఆయనను చిత్తు చిత్తుగా వోడించారు. రాజకీయనాయకుడిగా నువ్వు పనికిరావని చెప్పారు.
అది 1999 లోక్ సభ ఎన్నికల్లో గుజరాత్ లోని గాంధీనగర్ నియోజకవర్గంలో జరిగింది. అక్కడ ఆయన నాటి హోం మంత్రి ఎల్ కె అద్వానీ మీద కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఓడిపోయారు. అద్వానీకి 453,299 ఓట్లు పోలయ్యాయి . శేషన్ కు 264,285 ఓట్లే పడ్డాయి.
ఒక్కసారి ఉన్నతాధికారి గా ఉన్న శేషన్ కాంగ్రెస్ నాయకుడయిపోయి, కుర్తాపైజామా వేసుకుని మూడు రంగుల టోపీ పెట్టుకుని ఎన్నికల కమిషన్ రూల్ ప్రకారం క్యాంపెయిన్ చేస్తూ ఓటడగటం జనానికి వింతగా కనిపించేంది. ఆయనొక అబాసిడర్ కారు, ఆయన తో పాటు క్యాంపెయిన్ చేసిన స్థానిక కాంగ్రెస్ నేతలకు మరొక అంబాసిడర్ కారు తప్ప ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ప్రచారం చేసే వారు. మొబైల్ స్పీకర్ తో మాట్లాడే వారు.
అటువైపు భారత్ హోమ్ మంత్రి అద్వానీ క్యాంపెయిన్ పెద్ద కాన్వాయ్ తో సాగేది. ఎక్కడ చూసినా బిజెపి బహిరంగ సభలుండేవి. జనాన్ని బాగా సమీకరించేవారు. వీటికి శేషన్ దూరంగా ఉన్నారు. ఎన్నికల కమిషన్ విధించిన ఖర్చు లోపు క్యాంపెయిన్ చేసేవాడు.
ఒక సారి ఆయన కొంతమంది విలేకరులు కోరితే ప్రచారసమయంలో ఇంటర్వ్యూ ఇస్తానని ఒప్పుకున్నారు. విలేకరులు ఒక జీపులో వస్తున్నారు. శేషన్ తన కారు దిగి విలేకరుల జీపులో కూర్చుని వారితో మాట్లడుతూ తను తదుపరి వూరెళ్లే లోపు ఇంటర్వ్యూ ముగించవచ్చని అనుకున్నారు.
జీపెక్కారు. ఇంతలో ఆయన కార్యదర్శి పరిగెత్తుకుంటూవచ్చి చెవిలో ఏదో చెప్పాడు. అంతే, ఉన్నట్లుండి జీపులోనుంచిదిగిపోయారు. ఎందుకంటే, ప్రచారంలో భాగంగా తాను విలేకరుల జీపెక్కితే, జీపు ప్రయాణం  ఖర్చు ఎన్నికలఖర్చవుతుంది. అది తనకు నష్టం. తాను సంజాయిషీ ఇచ్చుకోవాలి. ఇది శేషన్ క్రమశిక్షణ.
తనుపెట్టిన నియమమే శేషన్ కాళ్లకు చుట్టుకుంది. అంత స్ట్రిక్ట్గ్ గా ఆయన క్యాంపెయిన్ చేశారు. కలర్ ఫుల్ గా ఉండే బిజెపి అభ్యర్థి క్యాంపెయిన్ ముందు శేషన్ ప్రచారం పాలిపోయింది. ఎన్నికల కమిషన్ అధికారిగా ఉన్నపుడు శేషన్ ‘ఈ రాజకీయనాయకులనందరిని రోజూ పొద్దేనే టిఫిన్ లో నంజుకుతింటా’ నని గర్జించగలిగాడు.
ఇపుడు ఎన్నికల సభల్లోఅలాంటి ఉద్రేకపు ప్రసంగాలు చేయడం కష్టం. ఎలాంటి ఆవేశం లేకుండా ఆయన ప్రచారం సాగింది చప్పగా. జనంలోఒక భావం ఏర్పడింది- అద్వానీకి శేషన్ మ్యాచ్ కాదు అని.
1996లో ఇదే గాంధీ నగర్ లో ఇదే అద్వానీ పోటీ చేస్తున్నపుడు శేషన్ ఎన్నికల కమిషన్ అధికారిగా ఎన్నికల కోడ్ ను పొల్లు పోకుండా అమలు చేశాడు. ఆపుడు ఆయన దానిని పొల్లుపోకుండా అనుసరించాల్సి వస్తున్నది.
శేషన్ కు తొలినుంచి కాంగ్రెస్ అభిమానం. ఆయన రాజీవ్ గాంధీకి బాగా సన్నిహితుడు.  రాజీవ్ ప్రధాని గా ఉన్నపుడు ఆయన రక్షణ బాధ్యతలను కూడా పర్యవేక్షించారు. ఈ పరిచయంతోనే ఆయన కాంగ్రెస్ అభ్యర్థి అయ్యారు. గుజరాత్ లో అద్వానీ మీద ఎవరిని నిలబెట్టాలనే ప్రశ్న పార్టీలో మొదలయింది. శంకర సింగ్ వఘేలా సరైన అభ్యర్థి . అయితే, అద్వానీ మీద పోటీ చసేందుకు నిరాకరించారు.ఇక మరొక అభ్యర్థి లేరు. అపుడు వారికి శేషన్ కనిపించాడు. ఆయన్ని సంప్రదించారు.శేషన్ ఒకె అన్నాడు.
పాలక్కాడ్ అయ్యర్ కుటుంబం నుంచివచ్చిన శేషన్ బాగా భక్తుడు. నిష్టా గరిష్టుడు. అయినా సరే ఆయన బిజెపి వైపు మళ్ల లేదు. 1998 లోనే తనకు టికెట్ ఇస్తామని బిజెపి,జనతా దళ్, కాంగ్రెస్ పార్టీలు తనకు టికెట్ ఇస్తామని వచ్చారని, అపుడు తనకు ఇష్టంలేదని ఆయన ఒక చోట చెప్పారు. 1999 ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ల మళ్లీ వచ్చారు. నేను అంగీకరించానని చెప్పారు.
ఆయనకు బిజెపి మత రాజకీయాలు నచ్చలేదు. మతాల మధ్య చిచ్చుపెట్టి వాళ్లు వోట్లు దండుకుంటున్నారని, ఎల్ కె అద్వానీ అలాంటి పార్టీకి చెందిన వాడని అనే చెప్పేవారు. అందువల్ల గుజరాత్ ప్రజలు తనకే ఓటేస్తారనరి ఆయన విశ్వసించారు. ప్రజలు వోటేసుందుకు రాజకీయానాయకులుండాలిగాని, ఇలాంటి నియమనిబంధనలను భగవద్గీత లాగా పూజించే వ్యక్తి పనికిరాడని ప్రజలకు తెలిసిపోయింది.
అద్వానీ గాంధీ నగర్ కు వచ్చే వాడే కాదు. వోటర్లకు అందుబాటులో ఉండేవాడు కాదు. శేషన్ ప్రచారం దీనిచుట్టూ సాగింది. ‘నేను గాంధీనగర్ లో మీ మధ్యే ఉంటాను, మీతోనే ఉంటాను. మీసమస్యలన్నీ పరిష్కరించేందుకు కృషిచేస్తాను. కాంగ్రెస్ వాళ్లు మంత్రి పదవి ఇచ్చినా తీసుకోను,’ అని ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే, ప్రజలు నమ్మలేదు. అద్వానీకి ఓటేసి ఎన్నికల సంస్కర్తను ఓడించారు. ఇక అద్వానీ ఎన్నికల ప్రచారానికి వస్తే ఆయన శేషన్ ను ఒక్కమాట కూడా అనేవారు. ఆయన ప్రచారం మంతా కాంగ్రెస్ చుట్టే తిరిగింది.
గాంధీ నగర్ నుంచి పోటీ చేయాలన్నది తన నిర్ణయం కాదని ఆయన చెప్పారు. అంతా చాలా ఫాస్టుగా జరిగిపోయింది. ఆగస్టు 12 మద్రాసు కాంగ్రెస్ ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది.
ఆగస్టు 13 ఢిల్లీ కాంగ్రెస్ ఆఫీసుకురమ్మన్నారు. ఆగస్టు 14నఎన్నికల్లో పోటీ చేస్తావా, మరి గాంధీ నగర్ నుంచి రెడీయా అని అడిగారు,సరే అన్నాను, గాంధీ నగర్ వచ్చి నామినేషన్ వేశాను, అంతే అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
అంతకు ముందు సంవత్సరం 1997లో ఆయన రాష్ట్రపతి ఎన్నికల్లో కెఆర్ నారాయణ్ మీద పోటీ చేసి ఓడిపోయారు. నారాయణన్ కు 956,290 ఓట్లు వస్తే, శేషన్ కు 50,631 వోట్లు వచ్చాయి.
1955 వ బ్యాచ్ తమిళనాడు క్యాడర్ కు చెందిన ఐఎఎస్ ఆఫీసర్ అయిన శేషన్ 36 సంవత్సరాలు అనేక ఉన్నతపదవుల్లోపనిచేసి చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ గా రిటైరయ్యారు. ఆయన నిన్నరాత్రి చనిపోయారు.