బిజెపి 105 ఆల్ అవుట్, శివసేన బ్యాటింగ్ కు వస్తా ఉంది: మహారాష్ట్ర మ్యాచ్

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా విముఖత వ్యక్తంచేసింది.సింగిల్ లార్జెస్టుపార్టీగా వచ్చినా బిజెపి చేతులెత్తయడం ఆశ్చర్యం. ఎందుకంటే,  మోదీ హవా దేశమంతా వీస్తున్నపుడు బిజెపి అన్ని యుక్తులు ప్రయోగించి ప్రభుత్వం ఏర్పాటుచేయాలి. గోవాలో అలాగే చేసింది. ఈశాన్య భారతంలో ఇలాగే చేసింది. చతురంగబలాలను దించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పరుగున పరుగున వచ్చి అధికార పక్షంలో చేరేలా చేయడం బిజెపి ప్రయోగిస్తున్న వశీకరణ విద్య. మహారాష్ట్రలో ఎందుకో  ఈ ప్రయోగం చేసేందుకు భారతీయ జనతా పార్టీ జంకుతూ ఉంది. మొత్తం మేనేజమెంటునంతా రాష్ట్ర పార్టీకి వదిలేసింది. ఒక్క ఎమ్మెల్యేను కూడా కాంగ్రెస్ నుంచి గాని, ఎన్ సిపి నుంచి గాని లాక్కోలేకపోయింది.సైద్ధాంతిక కవలసోదరుడయిన శివసేన నుంచి కూడా ఎవరీని లాగేసుకోలేక పోయింది. చివరకు మరొక 14 మంది ఎమ్మెల్యేలను గూడగట్టి ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కష్టం మని భావించినట్లుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుు విముఖత చూపింది.
దీనితో గవర్నర్ కోషియారి  రెండో పెద్ద పార్టీగా నిలిచిన శివసేనను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖతను, బలాన్ని తెలియజేయాలని ఆ పార్టీ సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ షిండేకు సమాచారమిచ్చారు. సోమవారం రాత్రి 7.30 గంటల్లోగా నిర్ణయం తెలపాలని గవర్నర్‌ సూచించారు. దీని మీద రేపు ఆసక్తికర పరిణామాలు ఎదురుగానున్నాయి. శరద్  పవార్ నాయకత్వంలోని ఎన్ సిపి మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. ఇదే విధంగా కాంగ్రెస్ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా శివసేనకు సహకరించవచ్చు.
దీని మీద కాంగ్రెస్ నాయకుడు ఆసక్తికరమయిన ట్వీట్ చేశారు. మహారాష్ట్ర మ్యాచ్ లో లాస్ట్ బాల్ ఇంకా పడాల్సి ఉందని అన్నారు.

 

बीजेपी 105 पर आउट ।
शिवसेना 56 पर खेल रही है।
ओवर की आख़िरी गेंद बाक़ी है।#MaharashtraPoliticalCrisis

— Sanjay Nirupam (@sanjaynirupam) November 10, 2019

మహారాష్ట్ర అసెంబ్లీ బలం 288. ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు 145 మంది ఎమ్మెల్యే మద్దతు కావాలి. ఇపుడుబిజెపికి 105, శివసేనకు56, ఎన్ సిపి 54, కాంగ్రెస్ కు 44 మంది శాసన సభ్యులున్నారు. సభలో 29 మంది స్వతంత్య్ర సభ్యలున్నారు.