అన్నీ తప్పులేనా, ఆర్టీసి లెక్కల మీద హైకోర్టు అసమ్మతి

ఆర్టీసీ యజమాన్యం సంస్థ ఆర్థిక స్థితిగతుల మీద దఖలు చేసిన రిపోర్ట్ ఫై హై కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రోజు ఆర్టీ సి ఎండి  కోర్టు సంస్థ నష్టాలు అని చెబుతూ ఒక నివేదిక సమర్పించారు. దీని మీద కోర్టు బాగా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ లెక్కలన్నీ తప్పని, చాలా విషయాలు దాచారని, కొన్ని సగం సగం మాత్రమే చూపారని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలా తెలంగాణప్రభుత్వం మీద కోర్టు అసహనం వ్యక్తం చేయడం ప్రతి వాయిదాలో మామూలయింది.
ఆర్టీసీ అధికారులు ఇలా తప్పుడు సమాచారం ఎందుకు ఇస్తున్నారని హై కోర్ట్ అసహనం వ్యక్తం చేసింది.
బస్సుల కొనుగోలు కోసం కేటాయించిన రుణాన్ని రాయితీల బకాయిల చెల్లింపు గా నివేదికలో ఎలా పేర్కొంటారని హైకోర్టు ప్రశ్నించింది.
జిహెచ్ఎంసీ ఆర్టీసీకి డబ్బులు చెల్లించాలా లేదా తేల్చాలని హై కోర్ట్ ఆర్టీసి ఎండికి సూచించింది.
‘2017 లో జిహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి బాగోకపోవచ్చు.. ఇప్పుడు బాగానే ఉందన్న హై కోర్టు. 2016 -17 సంత్సరానికి జిహెచ్ఎంసి ఆర్టీసీ కి 246 కోట్లు చెల్లించాల్సి ఉంది …కానీ అప్పుడు తన దగ్గర నిధులు లేవని ప్రభుత్వానికి తెలిపింది. ఇప్పుడు కూడా జిహెచ్ ఎంసి దగ్గిర నిధులు లేవా.?;’అని హై కోర్టు ప్రశ్నించింది.
కోర్ట్ లకు నివేదిక సమర్పించే సమయంలో పూర్తి వివరాలు కాకుండా సగం సగం వివరాలు పొందపర్చడం పై సునీల్ శర్మ పై హై కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆర్టీసి  ఎండి  అఫిడవిట్ వివరాలు
2018-19 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం నుంచి రాయితీల సొమ్ము రూ.644.51 కోట్లు రావాల్సి ఉండగా, మొత్తం సొమ్మును ప్రభుత్వం విడుదల చేసింది.
హైదరాబాద్‌లో బస్సులు నడుపుతున్నందుకు రూ.1786.06 కోట్లు చెల్లించాలని జీహెచ్‌ఎంసీకి ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది.
2015-16, 2016-17లో కలిపి రెండేళ్లలో జీహెచ్‌ఎంసీ 336.40 కోట్లు విడుదల చేసింది.
మిగతా సొమ్ము చెల్లించే స్థోమత లేదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది
జీహెచ్‌ఎంసీ చట్ట నిబంధనల ప్రకారం సెక్షన్‌ 112(30) ప్రకారం నగరంలో బస్సులు నడిపినందుకు వచ్చే నష్టాలను భర్తీ చేయడానికి జీహెచ్‌ఎంసీ అంగీకరించలేదు.
అందువల్ల జీహెచ్‌ఎంసీ నుంచి రావాల్సినవి బకాయిలుగా పరిగణించరాదు.
ఆర్టీసీలో నిర్వహణ, డీజిల్‌ భారం ఎక్కువగా ఉంటోంది.
నిర్వహణ వ్యయం వల్లే నష్టం వాటిల్లుతోంది.
ప్రభుత్వ సాయం అందుతున్నప్పటికీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది.
సమ్మె ప్రారంభమైన అక్టోబరు 5 నుంచి 30వ తేదీ వరకు బస్సుల ద్వారా సంస్థ రూ.78 కోట్లు ఆర్జించగా, ఇదే కాలానికి రూ.160 కోట్లు వ్యయమైంది. రూ.82 కోట్ల నష్టం వాటిల్లింది.