కొంత మంది అమ్మాయిలు షాపింగ్ మొదలుపెడితే ఆపరెందుకు? (రీసెర్చ్)

మగవాళ్లు  మద్యపానానికి సులభంగా  అలవాటు (వ్యవసనం) పడ్తారు. అలవాటు పడ్డాక ఇక అన్ని అబద్దాలాడతారు. తాగినా తాగలేదని, ఈ మధ్య మానేశానని చెప్పడం మొదలుపడతారు. మందు మీద ఎంత ఖర్చయిందెపుడు ఇంట్లో చెప్పరు. మందు పార్టీకి వెళ్తున్నాని భార్యకెపుడూ  చెప్పరు. అంతేకాదు, ఫ్రెండ్సొస్తున్నారు, అలా బయటకెళ్లొస్తానని బార్ కెళ్తారు….మందును ఈ మధ్య  మహిళలు కూడా పుచ్చుకుంటున్నా, ఇంత కథ నడిపేది మగవాళ్లే.
అయితే, మహిళల షాపింగ్ కూడా మగ వాళ్ల మందులాగా ఒక వ్యసనమయి పొయిందని సైకాలజిస్టులు చెబుతున్నారు. బయటకెళ్తే షాపింగ్ చేయాలనిపిస్తుంది, షాపింగ్ చేయడం  మొదలుపెడితే ఆపరు, షాపింగ్ లో కిక్ ఎంజాయ్ చేస్తారు, ఏ పనిమీద బయటకు వెళ్లిన , ఆ మిషన్ మాత్రం షాపింగ్ ముగస్తుంది. అంతేకాదు, షాపింగ్ కు ఎంత ఖర్చుచేస్తున్నది చస్తే వెల్లడించరు. ఇది షాపింగ్ మహిలలో కనిపిస్తుందని ప్రఖ్యాత సైకాలజిస్టు రుథ్ ఇంగ్స్ క్లిఫార్డ్ చెబుతున్నారు. ఆమె ఎజుకేషన్ లో డాక్టరేట్ (EdD) చేశారు.ఆమె విద్యార్థినులలో ఆల్కహాల్ వ్యవసనం మీద, వ్యసన ప్రవర్తన (Addictive behaviors) చాలా పరిశోధన చేశారు. ముఖ్యంగా కంపల్సివ్ ఫాపింగ్, ఈ మధ్య  సమాజంలో బాగా ముదురుతన్న వ్యవసనం మీద  ఆమె పరిశోథనలు చాలా ఆసక్తి కరంగా ఉంటాయి.
ఈ వ్యాసంలో  ఇచ్చిన వివరాలేవీ సోషల్ మీడియాలో  వైరలయిన వాట్సాప్ మెసేజీలు కాదు సుమా. నిజం, దీనికి సైంటిఫిక్ బైస్ ఉందంటున్నారు.
మందుకు గాని, డ్రగ్స్ కు, షాపింగ్ ,గ్యాంబ్లింగ్ ఎలా బానిసలవుతారో స్పష్టంగా తెలియదని ఇండియాన యూనివర్శిటీ అప్లైడ్ హెల్త్ సైన్సెస్ ఫ్రొఫెసర్ గా పనిచేస్తున్న రుథ్ ఇంగ్స్  అంటున్నారు. అయితే, ఒక 10-15 శాతం మందిలో మాత్రం జన్యు వుల కారణంగా, పరిసరాల ప్రభావం వల్ల   కొన్నింటికి అలవాటు పడే పునాది ఉంటుందని ఆమె చెబుతున్నారు.
ఇలా షాపింగ్ కు అలవాటు పడటం అనే వ్యవసనాన్ని షాపొహాలిజం (shopoholism) అంటారు. ఇంగ్స్ మాటల్లో చెబితే మందుతాగే వాళ్లు బాటిల్స్ దాచినట్లు షాపొహాలికులు బిల్స్ ఎవరికీ కనపడకుండా దాస్తారు. షాపింగ్ వ్యవసనంగా మారింది కనిపెట్టడం సులభం. ఈ కంపల్సివ్ షాపింగ్ ఆర్థిక ఇబ్బందుల్లో పడేస్తుంది. మానవ సంబంధాలను దెబ్బతీస్తుంది. అందుకే జాగత్త అవసరమని రుథ్ చెబుతున్నారు.
ఒక అలవాటు వ్యవసంగా ఎలా మారుతుందో ఇంకా అంతుబట్టడం లేదు గాని,  అలవాటు వ్యసనంగా మారాక అది ఎలా విధ్వంసం సృష్టిస్తుందో రుథ్  శాస్త్రవేత్తలు బాగా అధ్యయనం చేశారు. షాపింగ్ వంటి వ్యవసానాల వల్ల  వాళ్లకి మంచి కిక్ వస్తున్నమాట నిజమని ఇంగ్స్ అంగీకరిస్తున్నారు. ఈ కిక్ మొదలైనపుడు ఇంక వారని అపడం కష్టం. సైన్స్ పరంగా చెప్పాలంటే, మనిషి శరీరంలో కూడా కొన్ని మత్తు రసాయనాలు తయారవుతాయి. వాటినే ఎండార్ఫిన్స్,  డోపమైన్స్ అంటారు. శరీరంలో నొప్పితగ్గించే గుణం వీటికి ఉంది. అంతేకాదు, కొద్దిగా కిక కూడా ఇస్తాయి. ఇవి మనలో ఫీల్ గుడ్ భావనను కలిగిస్తాయి. కొంత వరకు నొప్పిని, బాధను, ఆవేదను మర్చిపోయిేందుకు ప్రకృతి మనిషలో ఈ ఎంజైమ్ లను పరిణామంలో సృష్టించింది. ఈ రసాయనాలు స్రవించడం, మెదుడులో నాచురల్ ఓపియేట్ రిసెప్టర్స్ ఉత్తేజం కావడం వల్ల మనిషి అపుడుపుడు ఉల్లాసంగా ఉంటాడు. ఎందుకంత ఉల్లాసంగా ఉన్నావ్ అని అపుడపుడు మనం అంటూంటాం. దీనికి కారణం ఈ రసాయనాల మోతాదు రక్తంలో పెరగడమే కారణం.
మద్యపానంలాగే కొన్ని ఇతర రకాల  పనులు కూడా శరీరంలో ఎండార్పిన్, డోపమైన్ తో పాటు , మెదడులో ఉన్న ఒపియేట్ రిసెప్టర్స్ ఉత్తేజమవుతాయి. అపుడు మనిషిలో ఏదో తెలియని అనుభూతి, ఆనందకల్గిస్తాయి. దీనికోసం మనిషి ఆపనిని మళ్లీ మళ్లీ చేసేందుకు వెనకాడదు. అల్కహాల్ చేసే పని ఇదే.  ఆల్కహాల్ ని మనం లోనికి తీసుకుంటాం. శరీరంలో ప్రవేశించాక ఈ ద్రవం మార్పుతీసకురావచ్చు. మరి కంపల్సివ్  షాపింగ్ లో తాగడేమీ లేదు,  కేవలం ఒక యాక్టవిటీ కదా, శరీరంలో మార్పు ఎలా సాధ్యం అనే ప్రశ్న రావచ్చు.
దీనికి సమాధానం రన్నర్స్ హై (runner’s high)లో ఉంది. బాగా ఎక్సర్ సైజ్ చేసినపుడు మనిషిలో ఒక అనుభూతి కలుగుతుంది. మానసిక వత్తడి తగ్గుతుంది. నొప్పి ఎక్కడున్నా తగ్గిపోతుంది. కొద్ది కికింగ్ గా ఉంది. ఈ తెలిపోయే భావమే రన్నర్స్ హై . దీనికి కారణం ఎక్సర్ సైజ్ వల్ల శరీరంలో ఎండార్పిన్స్ , ఒపియాయిడ్ పెప్టైడ్స్ పెరిగి ఈ అనుభూతిని కల్లించాయని శాస్త్రవేత్తలు గమనించారు.
ఇష్టమయిన పనులు చేస్తున్నపుడు ఎదురయ్యే అనుభవమిది. ఇదే షాపింగ్ చేస్తున్నపుడు మహిళలలో కూడా కలుగుతున్నదని రుథ్ ఇంగ్స్ చెబుతున్నారు. షాపొహాలిజం, ఆల్కహాలిజం  ఉన్నవారిల్లోదాదాపు ఒకే లక్షణాలను శాస్త్రవేత్తలు గమనించారు. తమతో ఈ వ్యవసనం లేదని చెప్పేందుకు ఇద్దరు ఒకలాగే ప్రవర్తిస్తారు.
షాపొహాలిజం ఉంటే ఏమవుతుంది
  1. బడ్జెట్ మించి షాపింగ్ చేయడం చాలా సాధారణం. ఫలితంతా డబ్బు కొరత ఎదుర్కొంటుంటారు.మామూలు వ్యక్తి, ఇది చాలా కాస్ట్లీ గురూ, అనుకుని ఖరీదయిన వాటిని, ఇష్టమున్నా కొనకుండా మానేస్తారు. షాపొహాలిజం ఉన్నవాళ్లు తమ ఖర్చు పరిమితులను తరచు మర్చిపోతారు. దానిని పట్టించుకోరు, కొనేందుకు ప్రాముఖ్యం ఇస్తారు.
  2. మామూలు వ్యక్తి షాపింగ్ వెళ్లినపుడు ఏదవసరమో అదే కొంటాడరు.  షాపింగ్ వ్యవసనం ఉన్నవాళ్లు ఒకటి కొనేందుకు వెళ్లి పది కొనుక్కుని వస్తారు.
  3. షాపింగ్ అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. పండగలు పబ్బాలు, పెళ్లిళ్లు రాగానే షాపింగ్ లో పడిపోతారు. వాళ్ల దగ్గిర షాపింగ్ కు అవసరమయిన ఏర్పాట్లుంటాయి. క్రెడిట్ కార్డులను గోప్యంగా దాచుకోవడం, అపుడపుడు డబ్బును పోగేసుకుంటూ ఉండటం చేస్తారు.
  4. షాపింగ్ వ్యసనం మహిళల్లోనే కనిపిస్తుంది. ఇలా ఆల్కహాలిజం పురుషుల్లో ప్రధానంగా ఉంటుంది.