గత ఐదేళ్లలో ఇసుకను అందినకాడికి ఇసుకును దోచుకోవడమే కాదు, భవన నిర్మాణ కార్మికులకోసం వసూలు చేసిన కోట్లాది రుపాయల సెస్సును తెలుగు దేశం ప్రభుత్వం దారి మళ్లించిందని ప్రభుత్వం చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. దీని మీద ప్రభుత్వ విచారణ జరిపిస్తుందని ఆయన ప్రకటించారు.
అందిన కాడికి ఇసుకును దోచుకున్నా ఎల్లోమీడియా ఇసుకపై చంద్రబాబుకు అనుకూలంగా ప్రభుత్వంపై అసత్యప్రచారం చేస్తోందని శ్రీకాంత్ వ్యాఖ్యానించారు. ఇసుక కొరత లేకుండా అవినీతికి తావులేకుండా ముఖ్యమంత్రి ఇసుకపాలసీ తీసుకువచ్చారని ఆయన అన్నారు.
ఈ రోజు అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ వరదలవల్ల ఇసుక కొరత కొంత ఉన్నమాట వాస్తవమే నని కూడా ఆయన అంగీకరించారు.
ఇసుక కొరత మీద తెలుగుదేశం చేస్తున్న ప్రచారాన్ని ప్రస్తావిస్తూ టిడిపి యువనాయకుడు లోకేష్ ఇసుక దీక్ష, బరువుతగ్గేందుకు చేస్తున్న డైటింగ్ లాగ ఉందని అన్నారు.
‘గతంలో టిడిపి పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో రాష్ర్ట ప్రయోజనాలు ఏమీలేవు, దీక్షలు వళ్లు తగ్గించుకుంటానికి చేయాల్సిందే అంటూ నవ్వులాటలుగా మాట్లాడినమాటలు ప్రజలు మరిచిపోలేదు.భవననిర్మాణకార్మికులకు మీరు చేసిన మోసం తెలిస్తే కార్మికులు నిన్ను,నీ కుమారుడు లోకేష్ ను తరిమికొడతారు. భవన నిర్మాణకార్మికులకు పదివేల కోట్లు వచ్చే అవకాశం ఉంటే రానీయకుండా కమీషన్లతొ కోసం అడ్డు పడ్డారు.
వేసవిలో హేరిటేజ్ కోసం చలవేంద్రాలు పెట్టి భవననిర్మాణకార్మికుల సెస్ ను 30 కోట్ల మేర దోచుకున్నారు.మేడేరోజు చంద్రబాబు ప్రచారం ఫ్లెక్సీల కోసం 50 కోట్ల రూపాయలకు వాడుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో భవననిర్మాణ కార్మికులు దరఖాస్తులను పక్కనపెట్టి నిధులను పక్కదారి పట్టించారు,’ అని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.