కోస్తా భారత్ కు జలప్రళయం ముప్పు, డేంజ‌ర్ జోన్‌లో ముంబై , కోల్ కత

భూగోళానికి చాలా తొందరలొనే ప్రళయం ఎదరువుతూ ఉందని వాతావారణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూవాతావరణంలోకి వేడి పెంచే వాయువుల విడుదల వల్ల ఉష్ణోగ్రత పెరిగి, మంచుపర్వతాలు కరిగి, సముద్రోపరితల ఉష్ణోగ్రత పెరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇదే ప్రళయానికి బాట వేస్తుంది.

సముద్ర ఉష్ణోగ్రత పెరిగితే, సముద్రం వ్యాకోచించి తీరుప్రాంతాల కంటే ఎత్తుకు సముద్రం మట్టం ఎదిగి , ఆ ప్రాంతాలను ముంచేస్తున్నదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచంలో ఇపుడు  తీర ప్రాంతాలలో 30 కోట్ల మంది జీవిస్తున్నారు. ఇలా సముద్రం దాడి చేస్తే వచ్చే వరదల్లో  తీర ప్రాంతాల‌న్నీ దాదాపు మున‌గ‌నున్నాయి. అపుడు పెద్దఎత్తున  మహా నగరాలు నాశనమమవుతాయి. అక్కడ ఇన్ ఫ్ట్రా స్ట్రక్చర్ కొట్టుకు పోతుంది. తీర ప్రాంతాలలో వ్యవసాయం నాశనమవుతుంది. తీర ప్రాంతాలలో ప్రజలు నివసించ లేని శాశ్వత పరిస్థితులు నెలకొంటాయి.

ఈ మార్పులన్నింటిని అధ్యయనం చేసిన ఒక నివేదికను నేచర్ కమ్యూనికేషన్స్ (Nature Communications)అనే జర్నల్ ప్రచురించింది.

సముద్ర మట్టం పెరిగడమనేది అంతర్జాతీయ పరిణామమేఅయినా ఆసియా దేశాలలో దీని ప్రభుత్వా చాలా ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం చెప్పింది.

ఆరు ఆసియా దేశాలలో సుమారు 200 మిలియన్లకు పైగా ప్రజలు వచ్చే ముప్పై ఏళ్లలో తీర ప్రాంత వరదల బారిన పడబోతున్నారు. చైనా, బంగ్లాదేశ్, ఇండియా, వియత్నామ్,  ఇండోనేషియా, థాయ్ లాండ్ లు ఈదేశాలు.

పైన చెప్పిన 300 మిలియన్ల ప్రజలలో 75 శాతం ఈ దేశాలలోనే ఉన్నారు. భారతదేశానికి సంబంధించి ఇలాంటి వరదల్లో అథమం 36 మిలియన్లు  మంది చిక్కుకోనున్నారు.  కోల్ కత తో పాటు పశ్చిమ బెంగాల్ ఒదిషాలు ఈ వరదల తాకిడి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది.

ఆ డేంజ‌ర్ జోన్‌లో మ‌న ముంబై న‌గ‌రం కూడా ఉన్న‌ది. ముందుగా అంచ‌నా వేసిన దాని క‌న్నా ప‌రిస్థితులు మ‌రింత భ‌యాన‌కంగా ఉండ‌నున్ట‌న్లు ఓ అధ్య‌య‌నం వెల్ల డించింది.. 2100 క‌ల్లా ఈ దేశాలలోని తీర ప్రాంతాలన్నీ నీటిలో మునిగి ఉంటాయని ఈ నివేదిక చెబుతూ ఉంది.

(ఫీచర్ ఫోటో climate central)