పులివెందులకు మళ్లీ వైభవం

పులివెందుల ఒకపుడు ఒక వెలుగు వెలిగింది.  2004 నుంచి 2009 లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్న రోజులలో పులివెందుల దేశంలోని విఐపి నియోజకవర్గాలలో ఒకటి.అపుడు ఇపుడుల పాయకు ట్రిపుల్ ఐటి వచ్చింది, ఒక లైవ్ స్టార్ రీసెర్చ్ సెంటర్ వచ్చింది. పులివెందుల అభివృద్ధికి ఒక అధారిటీ ఏర్పాటుచేశారు. ప్రత్యేకంగా ఒక స్పెషల్ ఆఫీసర్ను  నియమించి అక్కడి అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ చేయించారు.  ఇలా పులివెందుల ప్రాముఖ్యం పెరుగుతున్న రోజులలో వైఎస్ ఆర్ చనిపోయారు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పులివెందులను పట్టించుకోలేదు.

 2014లో వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అదే విధానం కొనసాగించింది.

ఇపుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పులివెందులకు మళ్లీ మంచిరోజులొస్తున్నాయి. పులివెందులకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ వస్తున్నది. ఇది వస్తే కడప జిల్లాలో  రెండవ కాలేజీ అవుతుంది. ఇప్పటికే కడపలో  రాజీ వ్ గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (  రిమ్స్ ) ఏర్పాటయింది.

ఈ రోజు పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (పాడా) కార్యక్రమాల మీద ఈ రోజు ముఖ్యమంత్రి   వైఎస్‌ జగన్‌ సమీక్ష జరిపారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు.
పులివెందులలో ప్రభుత్వ మెడికల్‌కాలేజీ ఏర్పాటుకు సీఎం ఆదేశం. డిసెంబర్‌లో శంఖుస్ధాపన
వేముల మండలం నల్లచెరువుపల్లిలో 132 కేవి సబ్‌స్టేషన్‌
పులివెందుల నియోజకవర్గంలో 11 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, పులివెందుల ఏరియా ఆసుపత్రికి, వేంపల్లి సిహెచ్‌సీకి 30 కోట్లతో మౌలిక సౌకర్యాల కల్పన
పులివెందుల మున్సిపాలిటీకి అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, ఎస్టీపీకి సుమారు రూ. 50 కోట్లతో డిపిఆర్‌ సిద్దం చేయాలని ఆదేశాలు
పులివెందులలో కొత్త ఫైర్‌ స్టేషన్‌ బిల్డింగ్, వేంపల్లిలో కొత్త ఫైర్‌ స్టేషన్‌ మంజూరు
పులివెందులలో రూ. 17.65 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం కోసం డిపిఆర్‌ సిద్దం చేయాలని ఆదేశాలు
నాడు – నేడు పధకం కింద పులివెందుల నియోజకవర్గంలోని స్కూళ్ళను రూ. 30 కోట్లతో అభివృద్ది చేయాలని ఆదేశాలు
వేంపల్లిలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
జెఎన్‌టీయూ పులివెందులలో కొత్త లెక్చర్‌ కాంప్లెక్స్, నైపుణ్యాభివృద్ది కేంద్రానికి రూ. 10 కోట్ల నిధుల విడుదల
సింహద్రిపురం, వేంపల్లి పాలిటెక్నిక్‌ కాలేజీలకు రూ. 15 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ది
2012 – 13 రబీ పంటకు సంబంధించి ఇన్సూరెన్స్‌ భీమా సొమ్ము సుమారు రూ.112 కోట్లు త్వరితగతిన రైతుల ఖాతాలోకి చేరేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశాలు, రెండు నెలల్లోగా రైతుల ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలి
ఏఐసీ ఇన్సురెన్స్‌ కంపెనీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించి ఆదేశాలు ఆచరణలోకి తీసుకురావాలని ఆదే«శాలు
పులివెందుల మార్కెట్‌యార్డ్‌లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రూ. 5 కోట్లు మంజూరు
పులివెందుల నియోజకవర్గంలో కొత్తగా 7 గోడౌన్స్, 1 కోల్డ్‌ స్టోరేజి ఏర్పాటుకు ఆదేశాలు
ఏపి కార్ల్‌ కు సీఈవో ని నియమించేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసి త్వరితగతిన నియామకానికి ఆదేశాలు
శిల్పారామం
పులివెందుల శిల్పారామానికి సుమారు రూ. 10 కోట్లతో అభివృద్ది ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశాలు
వేంపల్లిలో మిని శిల్పారామం ఏర్పాటకు భూమి గుర్తింపు, నిర్మాణ ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశాలు
ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌ ఘాట్, గండి క్షేత్రం, గండికోట, ఒంటిమిట్ట మరియు జిల్లాలో ఇతర పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ఒక టూరిజం సర్కూట్‌ ఏర్పాటుచేయాలని ఆదేశాలు

వేంపల్లిలో బిసి బాలురు, బాలికల వసతి గృహం, ఎస్సీ బాలికల వసతి గృహం ఏర్పాటుకు అనుమతి మంజూరు చేయాలని ఆదేశాలు

జాతీయ స్ధాయి ప్రమాణాలతో కూడిన విద్యాసంస్ధ ఏర్పాటుచేయాలని ఆదేశం, ఇందుకు గాను పేరుగాంచిన సంస్ధలను సంప్రదించి ఏర్పాటుచేయుటకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశం
పట్టణాభివృద్ది శాఖ ఆ«ధ్వర్యంలో పులివెందులలో మాల్‌ కమ్‌ మల్టిప్లెక్స్‌ ఏర్పాటుకు అవకాశాలు పరిశీలించాల్సిందిగా ఆదేశం