సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ప్రెస్ మీట్ జరిగింది. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు మాట్లాడారు. ఆయన మాటల్లో…
ఆర్టీసీ సమ్మె ప్రారంభించి 11 రోజులు అవుతుంది.ప్రభుత్వం ఇంతవరకు చర్చలకు కూడా నిర్వహించకుండా అణిచివేస్తుంది. ప్రజాస్వామ్య దేశం లో ఇది చట్ట విరుద్ధం.
ఆర్టీసీ ని సీఎం కెనడా మెడల్ లో విచ్చిన్నం చేయాలని చూస్తే కెనడాలో ఏర్పడిన పరిస్థితి ఇక్కడ కూడా ఏర్పడుతుంది.
ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికుల ను చర్చలకు పిలవాలి.
సమ్మె విరమించి రండి చర్చలు జరుపుతాం అనడం భావ్యం కాదు. సమ్మె అనేది కార్మికుల హక్కు అది రాజ్యాంగo లో ఉంది.
ఆర్టీసీ సంస్థను ప్రవేటికరిద్దమని ,ఆస్తులను వేరేవారికి ధారాదత్తం చేద్దామని ప్రభుత్వం భావిస్తే మీ పతనం తప్పదు.
అలాంటి చర్యలు ఉపసంహరించుకోవాలి.
ఆర్టీసీ కార్మికుల కు మా సంపూర్ణ మద్దతు.
సీఎం భావిస్తున్నట్లు ఆర్టీసీ మీద ప్రజల మద్దతు లేదనడం లో వాస్తవం లేదు. ఆర్టీసీ అన్న ఎర్ర బస్సు అన్న ప్రజలకు ఎంతో ప్రేమ.
ఉద్యోగులు ఎవరు ఆత్మహత్య లకు పాల్పడవద్దు. వారి కుటుంబాలకు మేము అండగా ఉంటాం.
రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి.
రేపు వామ పక్షాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నాం.
కేంద్రప్రభుత్వం ఆర్థికమాంద్యం ఉన్నా పెట్టుబడి దారులకు లక్షల కోట్లు ధారాదత్తం చేస్తున్నది.
డబ్బులు ఇవ్వవల్సింది పెట్టుబడిదారులకు కాదు పేదవారికి.
ఉద్యోగుల ,కార్మికులకు కనీస వేతనం 21,000 లు చేయాలి.
ఆర్థికవ్యవస్థ పూర్తిగా సంక్షోభంలో పడిపోయింది.
ఇవాళ నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ గుప్తా కూడా భారత ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉందన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ…
ఆర్టీసీ సమ్మె ఉదృతంగా కొనసాగుతుంది. చరిత్రలోనే లేని విధంగా అత్యధిక సంఖ్యలో సూపరవైజర్లు కూడా సమ్మె లో పాల్గొంటున్నారు.
సెల్ఫ్ డిస్మిస్ పేరుతో 48 వేల మందిని తొలగిపోయారు అనే ప్రకటనల వల్లే ఇద్దరు కార్మికులు ఆత్మహత్య లు చేసుకున్నారు.
చనిపోయిన ఇద్దరు మరణ వాంగ్మూలం కూడా ఇచ్చారు ప్రభుత్వం వల్లే మేము బలిదానం చేసుకున్నాం..ఆర్టీసీ డిమాండ్ లు నెరవేర్చాలని ఆ పీఎఫ్ సొమ్ము తిరిగి జమ చేయాలని వాళ్ళు చనిపోతూ అన్న మాటలు ఇవి.
ప్రభుత్వ ఉద్యోగుల తో సమానంగా ఉద్యోగ భద్రత ,రిటైర్ అయిన తర్వాత పెన్షన్ కావాలని కోరుతున్నరు.
వామపక్ష ప్రభుత్వాలు ఇవన్నీ అమలు చేశాయి.
19 బంద్ కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం.
వామపక్ష పార్టీ లు ఒకరోజు నిరాహారదీక్ష లు చేయాలని చూస్తున్నాం.
రేపు దేశవ్యాప్తంగా ఆందోళనలో వామపక్ష పార్టీ లు పాల్గొనాలి.