హైదరాబాద్ రోడ్లెలా ఉంటాయో వేరే చెప్పాల్సిన పనిలేదు. గుంతలు, గతుకులు లేకుండా జానెడు రోడ్డు కనిపించడం హైదరాబాద్ లో కష్టం.
జలనిపుణులింతవరకు లెక్కించినట్లు లేదు గాని, వర్షకాలం వస్తే హైదరాద్ రోడ్ల మీద ఉండే గుంతల్లో సీజన్ కు ఒక టిఎంసి నీరైనా నిలువ ఉంటుంది. ఒక టిఎంసి నీటితో పదివేల ఎకరాల పంట పండింవచ్చు.
స్వయాన ముఖ్యమంత్రి కుమారుడే మునిసిపల్ మంత్రిగా ఉన్నా హైదరాబాద్ రోడ్లు బాగపడలేదు. కాబట్టి ఇక బాగుపడతాయనుకోవడం భ్రమ అవుతుంది.
ఇలాంటి రోడ్ల మీద ప్రయాణిస్తూ కిందబడి కాలు విరగ్గొట్టుకున్న సిటిజర్నలిస్టొకరు కడపు మండి గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మీద కేసు వేశారు.
నేను బైక్పై వెళ్తుండగా ఓ గుంతలో పడ్డాను, దానితో చెయ్యి విరిగింది. దానికి కారణం జీహెచ్ఎంసీ కాక మరెవరు?’ అంటూ కారణం అంటూ జర్నలిస్టు సయీద్ అజ్మత్ హుస్సేన్ జాఫ్రి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు.
హైదరాబాద్ ఓల్డ్ సిటికి చెందిన సయీద్ అజ్మత్ హుస్సేన్ జాఫ్రి డబీర్ పురా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచశాడు. అక్టోబర్ ఎనిమిదో తేదీ రాత్రి తాను బైకు మీద పోతున్నపుడు రోడ్డుపై ఉన్న గుంతలో దిగబడిందనొ దానితో తాను బైక్పై నుంచి ఎగిరి కింద పడ్డానని ఆయన చెప్పారు. కిందపడటంతోఆయన కుడి కాలు ఎముక ఫ్రాక్చర్ అయింది. ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు
తాను కిందపడేందుకు జిహెచ్ ఎంసి జోనల్ కమిషనరే కారణమని, ఆయన తన బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించడంలో విఫలమయ్యాయడని చెబుతూ ఆయన పోలీసులు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, జిహెెచ్ ఎంసి డిసిప్లినరీ చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే, కేసు మీద ఎఫ్ ఐ ఆర్ కట్టారో లేదో జిహెచ్ ఎంసి వెంటనే సిబ్బంది పంపి ఆ ప్రాంతంలో రోడ్ల గుంతలు పూడ్చడం (కింది ఫోటో) ప్రారంభించిందిన ముంబాయ్ మిర్రర్ రాసింది.