నేనేందుకు దీక్ష చేస్తున్నానంటే… కొల్లు రవీంద్ర కామెంట్స్ .

ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన ఇసుక కొరత వల్ల ప్రజలు తీవ్రనష్టాలు ఎదుర్కొంటున్నారని చెబుతూ దీనికి నిరసన తెలుపుతు  టిడిపి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఈ రోజు మచిలీ పట్నంలో దీక్ష తలపెట్టారు.  అయితే, పోలీసులు దీక్ష సాగకుండా ఉండేందుకు కొందరు టిడిపినేతలను గృహనిర్బంధంలో ఉంచారు. రవీంద్రను దీక్షా స్థలంలో నుంచి తొలగించి ఇంటికి తీసుకువచ్చారు.ఇంటినుంచే ఆయన తన 36గంటల దీక్ష కొనసాగిస్తున్నారు. అక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలివి:

ఇసుక కొరతపై గాంధీ అహింసా మార్గంలో దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాము.

పోలీసులు మమల్ని రాత్రి నుంచి వేధిస్తూ మా దీక్షను అడ్డుకుంటున్నారు. పొద్దున దీక్షాస్థలంనుంచి అదుపులోకి తీసుకుని

రెండు పోలీస్ స్టేషన్లు తిప్పి ఇంటికి‌ తీసుకొచ్చారు

జగన్ నియంతలా మారి ప్రజావ్యతిరేక విధానాలతో రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు

ఇవాళ రాష్ట్రంలో ఇసుక లేక అసంఘటిత కార్మికులు చేసేందుకు పనులు లేక పస్తులుంటున్నారు.

కొత్త ఇసుక పాలసీ వచ్చి నెల రోజులు గడుస్తున్నా..సామాన్యులకు ఇసుక దొరకడం లేదు

వైసిపి నాయకులకే ఇసుక కేంద్రాల నుంచి ఇసుక తరలిపోతోంది.

ప్రభుత్వానికి ఈ విషయం మా నిరసన ద్వారా చెప్పాలని చూస్తే పోలీసుల ద్వారా అడ్డుకుంటున్నారు

ప్రభుత్వ, పోలీసుల బెదిరింపులకు బయపడేది లేదు

36 గంటల దీక్షతో ఆపేది లేదు దఫదఫాలుగా సామాన్యులకు ఇసుక చేరే వరకు మా నిరసన కొనసాగిస్తాం