తెలంగాణ సెక్రెటేరియట్ భవనాలను కూల్చివేసే నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని హైదరాబాద్ హైకోర్టు స్పష్టమయిన ఆదేశాలు జారీ చేసింది.
కూల్చి వేయాలన్న టిఆర్ ఎస్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలు కోర్టు ముందు విచారణకు వచ్చిన విషయం ఉటంకిస్తూ ఈ దశలో భవనాల కూల్చివేతలు చేపట్టకూడదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డిల ధర్మాసనం ఆజ్ఞాపించింది.
తమ ఉత్తర్వులను ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లాలని, ప్రభుత్వదానిని గౌరవించేలాచూడాలని కోర్టు కొంచెం కటువుగానే అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌కు స్పష్టం చేసింది.
పిటిషన్ లు కోర్టు పరిశీలనలోఉన్నపుడు భవనాలను కూల్చివేస్తు న్యాయ ప్రక్రియ (జ్యుడీషియల్ ప్రాసె్‌స)ను అడ్డుకున్నట్లు అవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాదు, కోర్టు దసరాసెలవుల్లో ఉంటుందని, కోర్టు లేదనే పేరుతో కూల్చే ప్రమాదం ఉందని కోర్టుకు అనుమానం వచ్చినట్లు ఉంది. అందుకే కోర్టు చాలా స్పష్టమయిన భాషలో తమ ఆదేశాలను తెలియ చేసింది.
టైమ్సాఫ్ ఇండియా రిపోర్టు ప్రకారం కోర్టు చాలా నిర్ద్వంద్వంగా తమ ఆదేశాలను జారీచేసింది.
” Do not do anything while we are on vacation.If you demolish it then that would scuttle the entre judicial process.The hearing into all the pleas pending before us would then become academic. Your proposed demolition under legal scanner. Better stay away from the idea of demolition for now.” అని ధర్మాసనం చెప్పింది.
ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం కూల్చేయాలనుకుంటున్న సెక్రెటేరియట్ భవనాలు చాలా బలంగా ఉన్నాయని, వాటిని కొన్ని దశాబ్దాల పాటు వాడుకోవచ్చని, ఇలాంటి బలమయిన భవనాలను కూల్చికొత్తవి కట్టాలనుకోవడం ప్రజాధనాన్ని వృధాచేయడమే అవుతందుని, భవాలను కూల్చివేయకుండా చూడాలని ఉస్మానియా మాజీ ప్రొఫెసర్ విశ్వేశ్వరావు, మరికొందరు సామాజిక కార్యకర్తలు హైకోర్టులో పిటిషన్లు వేశారు.
అయితే, ప్రభుత్వమేమో సెక్యూరిటీ, భవనాలలో ఉన్న లోపాలు, అగ్ని ప్రమాద ముప్పు వంటిని పేర్కొని కొత్త సెక్రెటెరియట్ ను నిర్మించాలనుకుంటున్నది.
కొత్త సచివాలయ నిర్మాణం చేపట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం పాత సెక్రెటేరియట్ నుంచి కార్యాలయాలను మరొక చోటికి కూడా తరలించిందని అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తెచ్చినపుడు,‘మీ షిప్టింగ్ బిజినెస్ మీరు చేసుకోండి, అయితే, తొందర్లోనే … చాలా తొందర్లోనే మీ కూల్చివేతమీద నిర్ణయం ప్రకటిస్తామ్,’ అని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు.
అనంతర విచారణపే దసరా సెలవుల తర్వాత చేపడతామని, కేసును ధర్మాసనం ఈనెల 14కి వాయిదా వేసింది.