గాంధీజీ ఆరోగ్య నియమాలలో చాలా స్ట్రిక్ట్

(డా. రజని కాంత్, డా. బలరామ భార్గవ, జె.పి.నడ్డ*)
మోహన్ దాస కరమ్ చంద్ గాంధీ 2, ఒక్టోబర్, 1869 న గుజరాత్ లొని, పోర్ బందర్ లొ, జన్మించారు. ఆయన జీవనమంతా పేద బిక్క, అణగారిన ప్రజల జివితాన్ని మెరుగు పరచాడినికే శ్రమిస్తూ గడిపారు.
ఆయన సమాజములోని సమస్యలను వరిష్కరించాడానికి పరితపించారు. సత్య అహింసల ద్వారా దేశ స్వాతంత్రొద్యమాన్ని నడిపించారు. ఆయన వ్యక్తిత్వం మరియు దైవదత్తమైన శక్తి, కేవలం భారత దేశములోనే గాక, ప్రపంచమంతటా కోట్ళాది ప్రజల మనస్సులొ చొచ్చుకుపోయి, వారిని ప్రభావితం చేసింది.
తన దృష్టికి వచ్చిన ప్రతియొక్క అంశాన్ని గురించి తీవ్రముగా అలోచించడమే కాకుండా, ఆ సమస్యల పరిష్కారములొ గాందీజీ, తనకు తాను విలీనమైపోయారు. ప్రాంత, కుల, మతాలకు అతీతముగా, ప్రజల కష్ట కార్పణ్యాలను తొలగించడానికి పోరాడిన ఒక యోధుడిగా ఆయనను చరిత్ర గుర్తిస్తుంది.
ఆయన అసమాన గుణగణాలు గల్గిన ఒక సామాన్య వ్యక్తి. ఒక సంపన్న కుటుంబములో, జన్మించి, విదేశాలలొ విద్యనభిసించినప్పిటికి, సాధారణ జీవితాన్ని గడిపారాయన. “మీరు మూడవ తరగతిలొ ఎందుకు ప్రయాణిస్తారు’ అన్న ప్రశ్నకు: ” నాల్గవ తరగతి లేదు కాబట్టి;”, అని చమత్కారంగా సమాధానమిచ్చారు. ఇది ఆయన సరళతను క్రోడీ కరిస్తుంది.
ఆరోగ్యం, పౌష్టిక ఆహారం, స్వచ్ఛతను ఆయన విశదీకరిస్తూ, వాటి అవసరాన్ని నొక్కి చెప్పారు. “ఆరోగ్యమే మహా భాగ్యము; వెండి, బంగారాలు కావ్” అని ఆయన చెప్పారు.
మన పరిసరాన్ని, శుభ్రముగా, స్వచ్ఛంగా ఉంచుకొంటె, స్థిమితమైన జీవితాన్ని గడుపుతూ ఉంటె, కాలానికి, హితమైన, మితంగా ఆహారాన్ని సేవిస్తె మనము ఎన్నో రోగాలను అరిగట్టవచ్చన్నది ఆయన దృడ నమ్మకం. తన ఆహారముతో తన మీదే ఆయన ప్రయోగాల చేసుకొన్నారు. దైహిక కార్యాచరణ  ప్రాముఖ్యాన్ని విశదీకరించారు. సస్యాహారాన్ని ప్రచారం చెయ్యడముతొ పాటు, ఆయన పోగాకు మధ్య నిషేధం అవసరాన్ని వివరించారు. సమస్యలకు ఆయన పరిష్కారాలు ఎప్పుడూ, సాధారణామైనవి మరియు కార్యశక్తమైనవి.
భారతీయ వైద్యశాస్త్రాల పరిశోధనా సంస్థ(ICMR) 1911 భారతీయ పరిశోధనా ద్రవ్య సంఘం (Indian Research Fund Association (IRFA) గా స్థాపించబడినది.
శతమానంకంటె ఎక్కువకాలం సుదీర్ఘమైన ఈ ప్రయాణములొ ఈ సంస్థ రోగ నివారణా కార్యక్రమాలలొ ఎన్నెన్నోరోగాల నియంత్రణం చెయ్యడములొ యశస్సు సాధించినది. మహాత్ముడు చూపించిన బాటలను ప్రయత్నిస్తూ, అట్టడుగునవున్న వారి జీవితానికి ఉపశమన గల్గించడములొ మంచి కృషి చెయ్యగలిగాము.
ICMR యొక్క మొదటి సంస్థ పోష్టిక ఆహార ప్రయోగ శాల (Nutrition Research Laboratory,) 1918 లొ తమిళునాడులొని, నీలగిరి జిల్లా కూనూరులొ, స్థాపించడమైనది. ప్రస్తుతం అది హైదరాబాద్ లొని జాతీయ పౌష్టిక ఆహార సంస్థ. (National Institute of Nutrition, – N.I.N – Hyderabad). ఈ సంస్థ కూడా తన శతమానోత్సవాన్ని జరుపు కొంటున్నది.
ఈ సంస్థయొక్క మొట్టమొదటి నిర్దేశకులు, రొబర్ట్ మక్ కార్రిసన్ (Robert McCarrison), ఆహారానికి, ఆహార విధానానికి సంబందించిన విషయాలతొ గాందీజీతొ సుదీర్ఘ సమావెశాలు జరిపేవారు. గాంధీజీ పాలు తాగనని శపథం పట్టినందున, వారిద్దరి మధ్య పాలుగురించి సుదీర్ఘమైన సంభాషణలు జరిగేవి.
ఈ బాంధవ్యం పౌష్టిక ఆహార క్షేత్రములొ మంచి నిర్ణయాలకి, దారితీయడమే కాకుండా వివిధ పరిశోధనలకు కారణ భూతమైనది. దోమల పెరిగే ప్రదేశాలను తొలగించండం, నీటి మూలాలను తరచుగా పరీక్షిస్తూ దోమల మరియు మలేరియా బెడద తప్పడ డం గురించి గాంధీజీ నొక్కి చెప్పెవారు. క్వినైన్ మాత్రలకంటె, ఈ పద్దతి సజావుగా ఉన్న ట్లు గాందీజీ అభిప్రాయ పడ్డారు. ఈ మూలాన్ని చేధించే మార్గం సుగమమైనది. ఈ మార్గాన్నే
అసుసరించి, గాంధీజీ ప్రతిపాదించిన సూత్రాలను అలపరచుకొని దేశంలో వివిధ భాగాలలొ వాతావరణ ఆధారిత మార్గాల ద్వారా, మలేరియాను నియంత్రించడములొ, I.C.M.R.’s National Institute of Malaria Research, సఫలమయింది.
అలాగే, నిర్లక్షానికి గురియైన, అణగారిన వర్గాలలొ, అవమానకరమైన, అస్ప్రశ్యతతొ ముడిపడిన రోగాల నియంత్రణలొ గాంధీజీ సిద్దాంతాలను I.C.M.R. అనుసరిస్తున్నది.
I.C.M.R. కుష్టు, క్షయ రోగాలలొ విస్తృతమైన పరిశోధనలు జరుపుతూ, ఉత్తమ చికిత్సా విధానాన్ని పాటిస్తూ, భయ భ్రాంతులను తొలగిస్తూ, వాటిని అదుపులొ పెట్టడములొ సఫలీకృతమైనది; ప్రస్తుత ధ్యేయం, ఈ రెండు రోగాల నిర్మూలన. గాంధీజీకి ప్రియాతిప్రియమైన పర్యావరణ, జీవనశైలి విధానాలవల్ల, మనస్తత్వంవల్ల ఉత్పన్నమయ్యే రోగాల నివారణావైపు I.C.M.R. శ్రద్ధ చూపుతూ ఉన్నది.
“జనవరి, 30, 1948. మన జీవితమునుండి దీపం వెళ్లిపోయింది. ఎక్కడ చూసినా ఛీకటి” అని మన మొట్టమొదటి ప్రధాన మంత్రి వక్కాణించాఅరు. అది స్వతంత్ర భారత దేశ చరిత్రలొ ఒక సంధి సమయము. ఎప్రిల్ 1948 సంచికలొ గాంధీజీకి I.C.M.R. నివాళులర్పించింది.
వైధ్యరంగం గాంధీజి వృత్తి కాదు; ఆయన శిక్షణ పోందిన న్యాయవాది. ఐతె, అణగారిన, దీన దళితుల, పేద బిక్క ప్రజల కష్టాలవిముక్తి మీద ఆయన అకుంఠిత చిత్తశుద్ది అమోఘమైనది. సత్ఫ లితాలనిచ్చె, సుసాద్యమైన, స్వయం పోశితమైన, అధునాతన విధానాలాతొ కూడిన మానవ విలువలను నిర్దేశించారు. దేశం, పతి ఒకరికి లాభదాయకమైన, సామూహిక ఆరోగ్య పథకం ( Universal Health Coverage – U.H.C.) అమలు పరుచడానికి సన్నద్ధమైన తరుణములొ ప్రస్తుతం భారత దేశానికి గాంధీజి అవసరమున్నది.
ఈ మధ్య ప్రభుత్వం మొదలు పెట్టిన ఆయుష్మాన్ భారత్ లేక ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజనా (PMJAY), జాతీయ పోషణ్ అభియాన్ (National Nutrition Mission), మరియు మిషన్ ఇంద్రధనుశ్ (Immunization Programme), భారత దేశ స్వరూపాన్నే మార్చె ప్రణాళికలు. ఇక్కడ ప్రపంచవ్యాప్తమైన, సుసాధ్యమైన అత్యవసరమైన ఆరోగ్య సూత్రాల పై ఆధార పడిన (based on Global, Affordable, Need-Driven Health Innovation (GANDHI) గాంధీసిద్దాంతాలు మనకు ముందుకు పోవడానికి ఒక నిర్దిష్టమైన దశ, దిశము సూచించవచ్చు. అవి మనం ఆశించిన ఫలితాలు సఫలీకృతం కావచ్చు.
సర్వకాలికమైన ఒక మహోన్నత నాయకుడుకి, స్మృతి చిహ్నగా, నయ వినయ, నమ్రతతొ ఇది ఒక చిరు ప్రయత్నం. సమర్థనీయముగా ఐన్ స్టిన్ అన్నట్లు: “మాంస ఖండాలు మరియు రక్తముతొ ఇలాంటి ఒక వ్యక్తి ఈ భూమండలం పై నడెయాడాడంటే వచ్చె తరమువారికి నమ్మ శఖ్యము కాక పోవచ్చు.”
భారతీయ వైద్యకీయ పరిశోధనా సంస్థ ఈ విశేష సంధర్భములొ జాతి పిత మహ్యాత్మా గాంధికి తలవొంచి సమస్కరిస్తున్నది. భారతాద్యంత మరియు ప్రపంచం ఆయన సమాజానికి చేసిన సేవలను గుర్తించి, కోట్ళాది జనుల హృదయాములొ నిలిచి ఉంటాడు.

(*డా. రజని కాంత్, డా. బలరామ భార్గవ, భారతీయ వైద్యశాస్త్రాల పరిశోధనా సంస్థ, జె.పి.నడ్డ, అరొగ్య శాఖామాత్యులు,  భారత కేంద్ర ప్రభుత్వం)

(ఈ వ్యాసం Gandhiji and Health @ 150 పేరుతో ICMR  2019 జనవరిలో  తీసుకువచ్చిన ప్రత్యేక సంచిక లోని సంపాదకీయానికి క్లుప్తానువాదం. అనువాదం :చంద్రశేఖర కల్కూర

(Feature photo: Doctors showing to Mahatma Gandhi hookworm ova under microscope in Bombay, May 1944 [IJMR] Courtesy : India Science Wire)