’బళ్లారి గాలి‘ కి ఎదురుగాలి, జిల్లా విభజనకు యడ్యూరప్ప ప్లాన్

బళ్లారి బ్రదర్స్ కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప మీద మరొక సారి తిరుగుబాటు జండా ఎగరేస్తున్నారు. ఇనుప తప్పి వేల కోట్లు గడించి కర్నాటక రాష్ట్ర బిజెపిలో మాంచిపట్లున్న బళ్లారి బ్రదర్స్ అంటే  గాలి జనార్దన్ రెడ్డి, గాలి సోమశేఖర్ రెడ్డిల పట్టు సడలినట్లే ఉంది.
అక్రమ మైనింగ్ కేసులలో జైలుకు వెళ్లడం, వాళ్ల గాడ్ ఫాదర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోవడం, కర్నాటకలో బిజెపి పవర్ లోకి రాకపోవడం, కాంగ్రెస్ ప్రభుత్వం కష్టాలు మీద మీద  రావడంతో బళ్లారి బ్రదర్స్ వెనకబడి పోయారు.
దీన్నుంచి  కోలుకునేందుకు చాలా ప్రయత్నాలుచేస్తున్నారు. ఇలాంటపుడే వాళ్లకి అండగా ఉన్న బిజెపి సీనియర్ లీడర్లు అరుణ్ జైట్లీ సుష్మా స్వరాజ్ కూడా చనిపోయారు.
ఇలా వాళ్లకి గడ్డు రోజులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇపుడు ముఖ్యమంత్రి యడ్యూరప్ప వాళ్లకి  పెట్టని ఇనపకోట లాగా ఉన్న బళ్లారి జిల్లాను విభజించి విజయనగర జిల్లా పేరుతో ఒక కొత్త జిల్లా సృష్టించాలనుకుంటున్నారు. ఇది ఏ మాత్రం వాళ్లకి అంగీకారం కాదు.
జిల్లా చీలిపోవడం అంటే వాళ్ల సామ్రాజ్యాన్ని చీల్చి సగభాగాన్ని శత్రువు చేతిలో పెట్టడం లాంటిదే.
నిజానికి ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఇదే చేస్తున్నాడు. వీళ్లకి ఏ  మాత్రం గట్టని  ఆనంద్ సింగ్ అనే ఒక డిస్ క్వాలిఫైడ్ కాంగ్రెస్  ఎమ్మెల్యే కోరిక మేరకు  చేస్తూ ఉండటంతో వాళ్లకి మండింది  ఆనంద్ సింగ్ అనే ఎమ్మెల్యే బళ్లారిని రెండు విభజంచి విజయనగరం జిల్లా ఏర్పాటు చేయాలని ఏకంగా రిజైన్ చేశాడు.
ఆనంద్ సింగ్ విజయనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే. ఆయన ఉప ఎన్నికల్లో బిజెపి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. విజయనగర  కొత్త జిల్లా ప్రతిపాదన తీసుకువచ్చి  ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు. అందుకే ఈ డిమాండు ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఒప్పుకున్నారు. అదింత గొడవకు దారితీస్తుందని ఆయన వూహించి ఉండరు.
విజయనగర ను ప్రత్యేక జిల్లాచేస్తు హంపీ టూరిజం బాగా పెరుగుతుందని ఆనంద్ సింగ్ వాదిస్తున్నారు.
ఆనంద్ సింగ్ డిమాండ్  చేయగానే,బళ్లారి విభజన మీద ఒక నివేదిక తయారుచేయాలని ముఖ్యమంత్రి చీఫ్ సెక్రెటరీని ఆదేశించారు.
గాలి బ్రదర్స్ ముఖ్యమంత్రి చర్యను పూర్తిగా వ్యతిరేకించారు.అయితే, వాళ్లు  ఈ విషయంలో ఒంటరికాదు. కాంగ్రెస్ నేత సిద్దరామయ్య కూడా బళ్లారి విభజనను వ్యతిరేకిస్తున్నారు.
ఆనంద్ సింగ్ రాజీనామా చేసి బెదిరిస్తే జిల్లా ను విభజనచేయాలనుకుంటే తామూ రిజైన్ చేసి ఇంక కొడవ చేయగలమని బిజెపి బళ్లారి ఎమ్మెల్యే  గాలి సోమశేఖర్ రెడ్డి హెచ్చరించారు. ఈ విషయంలో తనకు జిల్లాలోని ఇతర బిజెపి ఎమ్మెల్యేలు కూడా మద్దతు నిస్తున్నారని ఆయన హెచ్చరించారు.
విజయనగర జిల్లా ఏర్పడితే అది రాష్ట్రంలో 31 వ జిల్లా అవుతుంది. వచ్చే క్యాబినెట్ లో ఈ విషయం చర్చకు రానుంది. జిల్లా విభజనను వ్యతిరేకించేందుకు తాము ఎంతవరకైనా వెళ్తామని  గాలి బ్రదర్స్ హెచ్చరిస్తున్నారు.విభజనకు పూనుకుంటే బళ్లారి భగ్గున మండుతుందని, అలాంటి రాకుండా చూడాలని వారు ముఖ్యమంత్రికి సలహా ఇచ్చారు.
ఇది ఇలా ఉంటే గాలిబ్రదర్స్ కు  ముఖ్యమంత్రి యడ్యూరప్పకు ఇలా గొడవ రావడం ఇది మొదటి సారి కాదు. గాలి బ్రదర్స్ ను ఇరుకున పెట్టేందుకు యడ్డి 2009లో కూడా ఒక ప్రయత్నం చేశారు. అపుడు వరద సహాయ చర్య నిధులను సేకరించేందుకు  ముఖ్యమంత్రి యడ్యూరప్ప బళ్లారి జిల్లాలో సాగుతున్న ఇనుప ఖనిజం మైనింగ్ టాక్స్ వేశాడు. దీనిని వాళ్లు తీవ్రంగా వ్యతిరేకించారు. పెద్దగొడవ అయింది. బిజెపిలో  గాలి బ్రదర్స్ అంటే ఇష్టం లేని వాళ్లెవరు? అపుడు పార్టీ నాయకత్వం సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ రాయబారిగా పంపించి  సయోధ్య  కుదిరించింది. ఈ సారి ఏమవుతుందో చూడాలి.
అసలే అక్రమ మైనింగ్ కేసులతో అభాసు పాలయి ఉంటే ఇపుడు మళ్లీ జిల్లాను కూడా విభజిస్తే  రెడ్డి బ్రదర్స్ రాజకీయాధ్యాయం క్లోజ్ అయినట్లేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అందుకే తాడో పేడో అని గాలి బ్రదర్స్ రంకెలేస్తున్నారు.