మీకీ విషయం తెలుసా? గాంధీజీ ఫిట్ నెస్ ఫ్రీక్…

గాంధీజీ జీవితంలో రెండు విషయాలకు చాలా ప్రాముఖ్యం ఇచ్చే వాడు. అవి ఫిజికల్ ఫిట్ నెస్ ఫ్రీక్, సమతౌల్యాహరం
ఫిజికల్ ఫిట్ నెస్ కోసమే ఆయన  రోజూ 18 కిమీ దాకా నడిచేవాడు. ఇలా తన జీవితంలో నలభై సంవత్సరాలు నడిచాడు. 1913నుంచి 1948 దాకా ఆయన నడిచిదూరమెంతో తెలుసా? 79,000 కిమీ. ఇది భూమి చుట్టు రెండు సార్లు నడిచినంత దూరం.
ఆని ఆయనకు జబ్బులేవీ రాలేదనుకోవడానికి వీల్లేదు. జబ్బున బారిపడ్డారు. చికిత్స చేయించుకున్నారు. మళ్లీ మామూలు మనిషయిన తన నడక కొనసాగించేవారు.1914లో ఛాతీలోపల కండరాలు వాపు నొప్పి (Pleurisy)తో బాధపడ్డారు. 1925,1936,1944లో మలేరియా బారిన పడ్డారు.(అందుకే మలేరియా నిర్మూలన మీద ఆయన చాలా శ్రద్ధ చూపే వారు), గ్యాస్ట్రిక్ ఫ్లూ (1939), ఇన్ ఫ్లుయెంజా (1945)లతో బాధపడ్డారు. 1919లో పైల్స్ కి ఆరేషన్ జరిగింది. 1924లో అపెండిసైటిస్ తో బాధపడ్డారు. ఇలా పెద్ద సమస్యలెన్ని వచ్చినా ఆయన చాలా తొందరగా వేగంగా కోలుకునేవారు. దీనికి కారణం ఆయనకు జీవన శైలి విషయంలో క్రమశిక్షణ పాటించడేమనని నిపుణులు చెబుతున్నారు.
గాంధీజీ న్యాచురోపతి (ప్రకృతి వైద్యం) అనుసరించే వారు.అయితే, ఆయనెపుడు ఆల్లోపతిని తిరస్కరించలేదు. తాను గా మాత్రం ప్రకృతి వైద్యం నమ్మేవారు,ప్రాక్టీస్ చేసే వారు. ఆది తన హామీ అని చెప్పేవారు.
దీని వెనక మనిషి ఆరోగ్యమ్ గురించిన ఆయన ఉన్న అవగాహనే కారణం. మనిషి సహన ప్రాకృతిక సూత్రాల ప్రకామే జీవించాలి. ఈ నియమాలను ఉల్లఘించినపుడే, దీనిని సరిచేసుకునేందుకు ప్రకతి ప్రయత్నస్తుంది.దాదాపు 50 సంవత్సరాలు ఆయన న్యాచురోపతి మీద ఆధారపడి జీవించారు.
 శాస్త్రవేత్త డాక్టర్ భార్గవ మాటల్లో చెప్పాలంటే, ‘గాంధీ ఏ ఆరోగ్యచికిత్స వ్యవస్థకు వ్యతిరేకంగా కాదు. ఆయన సిద్ధాంతమంతా రోగాలు రాకుండా జాగ్రత్త పడం, అందరికి వైద్యం అందుబాటులో ఉండటం.

(Feature Photo : Mahatma Gandhi visiting drug manufacturer CIPLA, Bombay, July 4, 1939)

Source: India Science Wire