గోకరాజు గంగరాజు విద్యార్థికి మైక్రోసాఫ్ట్ భారీ ప్యాకేజీ

హైదరాబాద్ లోని  గోకరాజు గంగరాజు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికి చెందిన కంప్యూటర్ సైన్స్ నాలుగో సంవత్సరం విద్యార్థి అంకరిగారి బి. రోహన్  భారీ ప్యాకేజితో మైక్రోసాఫ్ట్ సంస్థ ఉద్యోగానికి ఎంపిక చేసింది.
రూ.41.6 లక్షల వార్షిక వేతనంతో క్యాంపస్ సెలెక్షన్ లో రోహన్ సెలక్ట్ అయ్యాడు.
గోకరాజు కళాశాల విద్యార్థికి మైక్రోసాఫ్ట్ సంస్థ ఇంత భారీ ప్యాకేజి మొదటి సారి ఆఫర్ చేసింది.
ఈ ఉద్యోగాన్ని సాధించడం ద్వారా రోహన్ తమ కళాశాల ప్రతిష్ఠను ఇనుమడింపజేశారని ప్రిన్సిపల్ జె.ప్రవీణ్ అభినందించారు. రోహన్ స్వగ్రామం నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్.