రేపు నంద్యాలలో రాష్ట్రావతరణ దినోత్సవం…ఇదే ఆహ్వానం

ఉమ్మడి మద్రాస్ రాష్ట్రము నుండి విడిపోయి తెలుగు ప్రజలు ఆంధ్ర రాష్ట్రాన్ని అక్టోబర్ 1,1953 సాధించుకున్న విషయం విదితమే.
భారతదేశంలో ప్రప్రధమంగా భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఇది నాంది.తెలుగు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం కర్నూలు రాజధానిగా 3 సంవత్సరాలు కొనసాగింది.అనంతరం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం నుండి 2014 లో విడిపోవడంతో 1953 లో సాధించుకున్న భూభాగంతో ఆంధ్రప్రదేశ్ నేడు కొనసాగుతున్నది.
ఈ నేపద్యంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అక్టోబర్ 1 న జరుపుకోవాల్సిన ప్రాధాన్యత ఏర్పడింది.శ్రీబాగ్ ఒడంబడిక నేపద్యంలో మరియు పొట్టి శ్రీరాముల ఆత్మ త్యాగ ఫలితం తో ఏర్పడిన మొట్టమొదటి భాషా ప్రయుక్త తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం.
రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆద్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం అక్టోబరు 1 న నంద్యాల రామకృష్ణా డిగ్రీ కాలేజి ఆడిటోరియం నుండి ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై , 10:00 గంటలకు సంజీవనగర్ గేట్ కూడలి నందలి శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్దకు చేరును.
కావున ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు రేపు అనగా మంగళవారం ఉదయం (01-10-2019) 9:30 గంటలకు శ్రీ రామకృష్ణా డిగ్రీ కళాశాల ఆడిటోరియం దగ్గరకు రావలసినదిగా కోరుచున్నాము.
నమస్కారములతో,
రాయలసీమ సాగునీటి సాధన సమితి.