అమెరికా నెహ్రూకు ఇచ్చిన గౌరవం చాలా అరుదైంది, అదెలాగో చూడండి…

అమెరికాకు వచ్చే విదేశీ ప్రముఖులకు ఎలా స్వాగతం పలకాలనేదానిమీద అమెరికా ప్రభుత్వానికి చాలా నియమాలున్నాయి.
అమెరికా వచ్చే విదేశీ ప్రముఖల సందర్శనకు అమెరికా ప్రభుత్వం ఒక హోదా ఇస్తుంది. ఆహోదా ప్రకారమే ప్రొటొకోల్ మర్యాదలుంటాయి.
ఒక్కొక్క సారి ప్రొటోకోల్ ప్రకారం కాకుండా ఆమెరికా అధ్యక్షుడు నియమాలను పక్కన బెట్టి విదేశీ ప్రముఖులకు ప్రత్యేక హోదా ఇస్తారు. అపుడు దేశాధ్యక్షుడే స్వయంగా విమానాశ్రయానికి వచ్చిన విదేశీ ప్రముఖుడికి స్వాగతం పలుకుతారు.
ఇది అరుదైన స్వాగతం. ఇలాంటి స్వాగతం భారతదేశానికి సంబంధించి ఒక్క జవహర్ లాల్ నెహ్రూకే లభించింది.
గత వారంలో ప్రధాని మోదీ అమెరికా సందర్శించినపుడు ఆయనకు అక్కడ అఖండ గౌరవమర్యాదలు లభించాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హౌడీ మోడీ హ్యూస్టన్ సభకు స్వయంగా హాజరయ్యారు. మోదీని ఆకాశానికి ఎత్తారు. మోదీని జాతిపిత అన్నారు.ఇది మోదీ గొప్పతనంగా బిజెపి అభిమానులు కీర్తిస్తుంటే… లేద ఇంతకంటే పెద్ద ఎత్తున ఆదరణ నెహ్రూకు లభించిందని కాంగ్రెస్ ఎంపి శశిథారూర్ అనడంతో రచ్చమొదలయింది.
మోదీ విషయంలో ట్రంపు చాలా వోవర్ చేసినట్లుంది.ఎందుకంటే ఏ దేశాధినేతను, మరొక దేశాధినేత ఇలా హద్దులు మీరి ప్రశంసించారు. ప్రశంసలు చాలా గౌరవంగా, దౌత్యపరిభాషకు లోబడే ఉంటాయి. దౌత్యనీతిని విస్మరించి బయటి దేశ పౌరుడిలాగా, పార్టీ కార్యకర్తలాగానో మారిపోయి ప్రశంసిస్తే కరతాళ ధ్వనులొస్తాయేమో గాని, అది సరైందికాదు అనే మచ్చపడిపోతుంది.
అమెరికా ఎవరిని ఎలా గౌరవించాలనే దానికి ఒక కొలబద్ద ఉంది. బహుశా అన్ని దేశాలకు ఇది ఉంటుంది. అమెరికా ఎవరినైనా తనవైపు తిప్పుకోవాలనుకున్నా, ఆయననుంచి ప్రయోజనం పొందాలనుకున్నా, స్వాగతం విషయంలో ఆ  ప్రేమని ప్రదర్శిస్తుంది. ఇది మర్చిపోతే, ఇలాంటి వివాదాలొస్తాయి. అపుడు అమెరికా నెహ్రూను ఆకాశానికెత్తినా, ఇపుడు మోదీని ఆకాశానికెత్తినా, దానికి అమెరికా ప్రయోజనాలే కారణం.అనాటి అంతర్జాతీయ రాజకీయాలే అమెరికాను నడిపిస్తుంటాయి. దీనిని విస్మరించరాదు.
సరే, అమెరికాకు సంబంధించి భారత తొలి ప్రధాని మూడుసార్లు అమెరికా సందర్శించారు. అప్పటికి భారత్ చాలా కొత్త దేశం. స్వాతంత్ర్యం వచ్చి ఎక్కువ కాలం కాలేదు. అమెరిరా రెండో ప్రపంచయుద్ధ గెలిచి విజయ గర్వంతో ఉంది. ప్రపంచంలో ఎవరినీ ఖాతరు చేసే పరిస్థితి లేదు. అలాంటపుడు నెహ్రూ అమెరికా పర్యటనలు చేశారు.

1949లో ఆయన అమెరికా పర్యటనకు వచ్చినపుడు అసాధారంగా ప్రెశిడెంట్ హ్యరీ ఎస్ ట్రూమన్ స్వయంగా ఎయిర్ పోర్టకు వచ్చి స్వాగతం పలికారు.

1956లో మళ్లీ నెహ్రూ ఇందిరా గాంధీతో కలసి అమెరికా సందర్శించారు. అపుడు అమెరికా ఉపాధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ కూడా ఎయిర్ పోర్ట్ కు వచ్చి నెహ్రూకు స్వాగతం పలికారు. తర్వాత వైట్ హౌస్ దగ్గిర అధ్యక్షుడు డ్వైట్ డి ఐసెన్ హోవర్ ఘన స్వాగతం పలికారు.

ఇక మూడో సారి 1961లో ప్రధాని నెహ్రూ అమెరికా సందర్శించారు. అపుడు దేశాధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ.అపుడు కూడా నెహ్రూకు అఖండ స్వాగతం లభించింది.
ఈ విషయం ఎందుకు చర్చకు వచ్చిందంటే…
మొన్నామధ్య మోదీకి అమెరికాలో లభించిన ఆదరణ మీద విపరీతంగా వార్తలు వెల్లువలొచ్చాయి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ నెహ్రూ ఇందిరాగాంధీతో కలసి అమెరికా పర్యటిన కు వచ్చినపుడు ఇంతకంటే పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారని చెబూతూ 1954 నాటి ఫోటో అంటూ ఒక ఫోటో ట్వీట్ చేశారు.

అక్కడే పప్పులో కాలేశారు థరూర్. ఆ ఫోటో 1956లో మాస్కో సందర్శన నాటిదని సోషల్ మీడియా ఫాక్ట్ చెకర్స్ థరూర్ మీద విరుచుకుపడ్డారు. దీనితో థరూర్ నాలిక్కరుచుకుని తప్పొప్పుకున్నారు.

అయితే, ఆయన నెహ్రూకు అమెరికాలో లభించిన అఖండ స్వాగతం, అరుదైన ఆదరణ గురించి వీడియోలను ట్వీట్ చేశారు.
ఇంతకీ అమెరికా ప్రొటోకోల్ ఏమిటి?
అమెరికా విదేశీ ప్రముఖలు సందర్శనలకు ఒక వర్గీకరణ ఉంది. దీని ప్రకారం విదేశీ ప్రముఖుల సందర్శనలను అయిదు రకాలుంటాయి. అవి స్టేట్ విజిట్,అఫిషియల్ విజిట్, అఫిషియల్ వర్కింగ్ విజిట్, వర్కింగ్ విజిట్, ప్రైవేట్ విజిట్. ఇందులో స్టేట్ విజిట్ అనేది హై ర్యాంకింగ్ విజిట్, ఇది దేశాధ్యక్షులకు, బ్రిటన్ రాణి ఎలిజబెత్ వంటి రాజవంశీకులకు మాత్రమే ఈ హోదా ఇస్తారు. అంతకంటేముఖ్యంగా అమెరికా అధ్యక్షుడి ఆహ్వానం మీద వెళ్లినపుడే
ఈ హోదా వస్తుంది.
స్టేట్ విజిట్ అమెరికా అధ్యక్షుడి అఫిషియల్ గెస్ట్ హైస్ బ్లెయిర్ హౌస్ లో నాలుగు రోజులు మూడు రాత్రులకు గది ఇస్తారు.ఇది వైట్ హౌస్ సమీపానే ఉంటుంది. స్టేట్ విజిట్ లో అమెరికా అధ్యక్షుడితో సమావేశంతో పాటు డిన్నర్, అమెరికాకు వచ్చినపుడు,పోయినపుడు 21 గన్ శల్యూట్ ఉంటాయి.
‘అఫిషియల్ విజిట్’ హోదా ప్రధాన మంత్రులకు వస్తుంది. అన్ని వసతులు పైలాగానే ఉంటాయి. కాకపోతే, గన్ శల్యూట్ 19కు తగ్గుతుంది.

ఫీచర్ ఫోటో thecitizen.in నుంచి