భారతదేశంలో రూల్స్ రెండు రకాలు.ప్రజలకొక రూల్, పవర్లో ఉన్న వాళ్లకొక రూల్. ఒకే తప్పు ప్రజలు చేస్తే చట్టం ఒక విధంగా తన పనితాను శుభ్రంగా చేసుకుపోతుంది. పవర్ లో ఉన్నవాళ్లు చేస్తే తన పని తాను చేసుకుపోయేందుకు భయపడుతుంద, సంశయిస్తుంది చట్టం. రోడ్ల ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే సామాన్యుడి చెవి పిండి ట్రాఫిక్ ఛలాన్ వసూలు చేస్తారు. అదే పవర్ లో ఉన్నవాళ్లు చేస్తే పిండేందుకు చెవులందవు.
వీళ్ల కార్లు కూడా ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తూ పోలీసు కెమెరాల కంటబడ్డాయి. ఛలాన్ వెళ్లింది. ఇంకా చెల్లించాల్సి ఉంది. అయితే, ఆ సమయంలో తాము కార్లో లేమని ఏలిన వారు బుకాయించవచ్చు. అది వేరే విషయం.