కర్నాటక తెలుగు ఐఎఎస్ అధికారి బదిలీ…అక్రమాలకు నో అన్నందుకు

కర్నాటక క్యాడర్ కుచెందిన తెలుగు ఐఎఎస్ అధికారి రోహిణి సిందూరి దాసరిని బిజెపి ప్రభుత్వం బదిలీ చేసింది.
ఆమెనుభవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు  నుంచి తప్పించారు. ఈ బాధ్యతలను లేబర్ కమిషనర్ కు అప్పగించారు. ఆమెకు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ బోర్డు ముఖ్యమంత్రి యడ్యూరప్ప పర్యవేక్షణలో ఉంటుంది.
బిలింగ్స్ అండ్ అదర్ కన్ట్స్రక్షన్ వర్కర్ వెల్ ఫేర్ బోర్డు నిధులను దుర్వినియోగం చేసేందుకు అంగీకరించకపోవడంతో ఆమె మీద వేటు పడిందని అధికార వర్గాల్లో వినబడుతూ ఉంది. సింధూరిని సప్టెంబర్ 20న బదిలీ చేశారు. వెంటనే లేబర్ కమిషనర్ కెజి శాంతారాం కు ఈ బోర్డు అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఈ బోర్డుకు దగ్గిర సుమారు రు. 8000 కోట్ల నిధులున్నాయి. నిర్మాణాలనుంచి కార్మికుల సంక్షేమం కోసం ఒక శాతం చొప్పు వసూలుచేసిన సొమ్ము ఇది.
ఇది కూడా చదవండి

భారత్ ప్రేమలో పడ్డ ట్రంప్! ఇంతకీ మోదీ వేసిన వశీకరణ మంత్రమేమిటి?

ఇంత డబ్బున్నా కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయలేకపోతూండటం ఆమె గమనించారు. గత ఎనిమిది సంవవ్సాలలో కార్మికుల కోసం ఖర్చు చేసింది కేవలం రు. 800 కోట్లు మాత్రమే. అయితే, ఆమె ఈ నిధులను అర్థం పర్థం లేని పనుల మీద ఖర్చుచేయాలని వత్తిడి తీసుకువస్తున్నారు.
ఇలాంటి ఖర్చలు చేస్తే చాలా పెద్ద మొత్తాలు వృధా అవుతాయి. దీనికి అమె సమ్మతించడం లేదు.అందుకే ఆమెను అక్కడి నుంచి బదిలీ చేసినట్లు సీనియర్ ఐఎఎస్ అధికారి ఒకరు తెలిపారని డెక్కన్ హెరాల్డ్ రాసింది.
దీనికొక ఉదాహరణ బయటకుపొక్కింది. బోర్డు కు సంబంధించిన కొన్ని పనలను కర్నాటక స్టేట్ ఎలెక్ట్రానిక్స్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (KEONICS) ఇవ్వాలని ఆమె వత్తిడి వచ్చింది.
నియమాలను ఉల్లంఘించి అలా ఇవ్వడం కుదరదని, కాంట్రాక్టు పనులను అప్పగించాలంటే టెండర్లు పిలవాలని ఆమె వాదిస్తూ వస్తున్నారు.
అంతేకాదు, కార్మికుల సంక్షేమానికి ఉద్దేశించిన ఈనిధులను వరదనివారణచర్యలు చేపట్టేందుకు ఇవ్వాలని, సుమారు రు. 3000 కోట్ల దాకా విడుదల చేయాలని ఆమె వత్తిడి ఉన్నట్లు చెబుతున్నారు.
బోర్డు నిధులను ఒక్కపైసా కూడా నియమాలకు వ్యతిరేకంగా ఇవ్వడానికి వీల్లేదని, బోర్డు ఖర్చును సుప్రీంకోర్టు పర్యవేఖిస్తున్న విషయాన్ని చెబుతూ ఆమె వత్తిడి తలొగ్గడానికి నిరాకరించారు. నిర్మాణరంగా కూలీల పిల్లలకోసం 100 సెంటర్లలో క్రెష్ సెంటర్లను ప్రారంభించాలనుకుంటున్న సమయంలో ఆమెను బదిలీ చేశారు.
సింధూరి 2009 బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ అధికారి. అంతకు ముందు ఆమె హసన్ జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. నిజాయితీగా పనిచేసేవారు. అపుడామెకు మంత్రులు ఎ మంజు, హెచ్ డి రేవణ్ణలతో కూడా పేచీ వచ్చింది. తన విధుల్లో రాజకీయజోక్యానికి ఆమె ఎక్కడ తలొగ్గడం లేదు. అందుకు బదిలీ అవుతున్నారు.హసన్ జిల్లాలో పనిచేస్తున్నపుడు విద్యాప్రమాణాలు పెంచేందుకు ఆమె బాగా పనిచేశారు.దీనితో ఎస్ ఎస్ ఎల్ సి మంచి ఫలితాలు వచ్చాయి. ఈ విషయంలో  సింధూరికి పేరు రావడం పిడబ్ల్యూడి మంత్రి రేవణ్ణకు ఇష్టమే లేదు. దీనికి కారణం, తన భార్య భవాని (జిల్లా పరిషత్ సభ్యురాలు)యే కారణమని ఆయన వాదించారు. అంతేకాదు, తన భార్య కలెక్టర్ సింధూరి అణగ దొక్కారని కూడా ఆయన ఆరోపించారు.
జగన్ టీమ్ లోకి వస్తారా?
ఇది ఇలా ఉంటే సింధూరి ఆంధ్రప్రదేశ్ డెప్యుటేషన్ వస్తారని అధికార వర్గాల్లో వినబడుతూ ఉంది. ఆమె తన టీమ్ లోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారని చెబుతున్నారు. ఈ వార్త చాలా కాలంగా వినబడుతూ ఉంది. కర్నాటకలో ఇపుడు ఆమెకు రాజకీయ నాయకులతో వివాదం వస్తూ ఉన్నందున కొద్ది రోజులు ఆంధ్ర డిప్యుటేషన్ రావచ్చనే వార్త ఊపందుకుంది. గతంలో జెడిఎస్ ప్రభుత్వంలో కూడా ఆమె ముఖ్యమంత్రి సోదరుడు రేవణ్ణ మాటని ఖాతరు చేయలేదు. ఇపుడు స్వయాన ముఖ్యమంత్రి యడ్యూరప్ప పర్యవేక్షణలో ఉన్న బోర్డు లో రాజకీయ వత్తిడిని వ్యతిరేకించారు.  ఈ కారణాన మార్పు కోసం ఆమె కొద్ది రోజులు ఆంధ్ర రావచ్చని చెబుతున్నారు.
సింధూరికి విపరీతంగా సోషల్ మీడియా అభిమానులున్నారు. ఆమెకు అభిమాన సంఘాలున్నాయి. నిజాయితీతో ఆమె కన్నడిగుల మనసు దోచుకున్నారు.