చంద్రుడి మీద 15ని. సస్పెన్స్ ధ్రిల్లర్, ఈ రాత్రి తప్పక చూడండి (వీడియో)

శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత అంటే శనివారం తెల్లవారుజామున 1 గంట నుంచి 2 గంటల నడుమ చంద్రుని మీద వొళ్లు గగుర్పొడిచే సస్పెన్స్ థ్రిల్లర్ ప్రదర్శన జరుగబోతున్నది.
ఈ ధ్రిల్లర్  ని కోట్లాది మంది భారతీయులు ఉత్కంఠతో చూడబోతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ శాస్త్రవేత్తలతో, కొంత మంది విద్యార్థులతో కలసి బెంగుళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ (ISTRAC) నుంచి ఈ థ్రిల్లర్ ను వీక్షించబోతున్నారు.
ఆ సమయంలో ఇస్రో మెల్లి మెల్లిగా చంద్రయాన్2  ల్యాండర్ ను చంద్రుని మీద దింప బోతున్నది. ఏ మాత్రం ఇది తప్పినా మొత్తం ప్రయోగం విఫలమవుతుంది.
 చంద్రుడి భూ మధ్య రేఖకు 70   దక్షిణ వైపున  రెండు చంద్ర బిలాల మధ్య ఎగుడుదిగుళ్లు లేని, సమతులంగా ఉండే స్థలాన్ని ప్రస్తుతానికి ఎంపిక చేశారు.
చంద్రయానం ఒక ఎత్తయితే, దిగడం ఒక ఎత్తు. ఎందుకంటే మన ల్యాండర్ దిగేందుకు చదునైన ప్రదేశం ఉండాలి.
ఎగుడుదిగుడులున్నా అవి 12 డిగ్రీలు మించి ఉండరాదు. అంతకంటే ఎక్కుక  వాలు ఉంటే ల్యాండర్ తలకిందులయిపోయవచ్చు.లేదా దిగాక లోపలనుంచి ప్రజ్ఞాన్ బయటకు దొర్లుకుంటూ రావడం కష్టమవుతుంది. అందుకే ఈ టెన్షన్ .
ఆర్బిటర్‌కు అమర్చిన అర్బిటర్‌ హై రిజల్యూషన్‌ కెమెరా (ఓహెచ్‌ఆర్‌బీ) ద్వారా ఈ స్థలం ల్యాండర్ దిగేందుకు అనుకూలంగా ఉందా లేదా అనేదిపరీక్సిస్తారు.
అది సరగ్గా లేకపో తే, 67.7 డిగ్రీల దక్షిణ, 18.4 డిగ్రీల పడమరగా ఉన్న ప్రాంతంలో ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలిస్తారు.
ఈ స్థలాన్వేషణకు అరగంట పడుతుంది.
తర్వాత 1.30 నుంచి 2.30 గంటల మధ్య విక్రమ్‌ ల్యాండర్‌ను జాబిల్లిపై దించే పని మొదలవుతుంది.
ల్యాండర్‌ వేగాన్ని సెకనుకు 2 మీటర్లకు తగ్గించి నెమ్మదిగా చంద్రుని ఉపరితలాన్ని తాకేలా చేస్తారు.
1.40 నుంచి 1.55 గంటల మధ్య… అంటే 15 నిమిషాలపాటు ల్యాండింగ్‌ సాగుతుంది.
ఇద ఉత్కంఠ భరితమయిన సమయం. దీనినే ఇస్రో
‘15 మినిట్స్‌ ఆఫ్‌ టెర్రర్‌’ అని అంటోంది.
ఈ 48 రోజుల ప్రయాణం ఒక ఎత్తు, చంద్రుడిపై విక్రమ్‌ ల్యాండర్‌ దిగే 15 నిమిషాలు మరొక ఎత్తు.
నిజంగా ఈ 15 నిమిషాలొక సస్పెన్స్ ధ్రిల్లర్.
ల్యాండింగ్ పిఐబి యూట్యూట్ లో  ఇక్కడ వీక్షించవచ్చు.
అదే విధంగా ఇస్టో కూడా ట్వట్టర్ లో అపడేట్స్ ఇస్తూ ఉంటుంది. చూడవచ్చు.
National Geographic, Hotstar లలో కూడా మూన్ ల్యాండింగ్ చూడవచ్చు
దిగాక ఏమవుతుంది
విక్రమ్‌ ల్యాండర్‌ను శనివారం తెల్లవారుజామున 1.55 గంటలకు జాబిల్లిపై కాలుమోపక, మరొక 4 గంటల తర్వాత అసలు కథ మొదలవుతంది.
అంటే శనివారం ఉదయం 5.30 నుంచి 6.30 గంటల మధ్య ల్యాండర్ లో నుంచి 27 కిలోల బరువున్న షట్చక్ర (6 చక్రాల) ప్రజ్ఞాన్‌ రోవర్‌ బయటకు వస్తుంగి.
ప్రజ్ఞ 14 రోజులపాటు పరిశోధనలు చేస్తుంది.
అపుడు విక్రమ్‌ నుంచి 500 మీటర్ల దూరం దాకా అంటే అరకిలోమీటర్ ప్రయాణిస్తుంది.
అక్కడి సమాచారాన్ని విక్రమ్‌కు అందిస్తుంది.
విక్రమ్‌ ద్వారా ఆ సమాచారం బెంగళూరుకు సమీపంలోని బైలాలులో ఉన్న ఇండియన్‌ డీప్‌స్పేస్‌ నెట్‌వర్క్‌కు చేరుతుంది.
చంద్రయాన్ 2 యాత్ర జూలై 22 న  మొదలయిన విషయం మీకు తెలుసుగా. ఈ యాత్ర ఖర్చెంతో తెలుసా? రు.978 కోట్లు
విక్రమ్ ల్యాండర్ గురించి మరింత తెలుసుకోండి