రాజధాని ప్రాంత రైతులకు, ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోనని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
జగన్మోహన్ రెడ్డి వైసిపి అధినేత పాలన సాగిస్తున్నారు తప్ప ఒక రాష్ట్ర సీఎం గా భావించడం లేదు. ఈ ప్రాంత రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చారు తప్ప టిడిపి కాదు.ఈ విషయాన్ని జగన్ రెడ్డి గుర్తుంచుకుని రాజధాని ఇక్కడే ఉండేలా ప్రకటన చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు.
‘‘గత ప్రభుత్వం అవినీతికి పాల్పడి ఉంటే విచారించి చర్యలు తీసుకోవాలి.అయితే అక్రమాల పేరు చెప్పి రైతుల పొట్ట కొట్టడం మంచిది కాదు.అవినీతి ఉందని తేలితే చర్యలు తీసుకోవాలి,’’ అని ఆయన అన్నారు.
అభివృద్ధి వికేంద్రీకరణ కు మేం వ్యతిరేకం కాదని చెబుతేూ ఇష్టానుసారంగా చేస్తామంటే ఊరుకునేది లేదని కూడా ఆయన చెప్పారు.