పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ల విలీనం

భారతదేశపు అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లలో ఒకటయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను యునైటెడ్ బ్యాంక్ ఆప్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్  కామర్స్  లతో కలపాలని కేంద్రం నిర్ణయించింది.
ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొద్ది సేపటి కిందట ప్రకటించారు.
దీనితో పంజాబ్ నేషన ల్ బ్యాంక్ రు.17.95 లక్షల కోట్లతో దేశంలో రెండో పెద్ద బ్యాంక్ అవుతుంది. కొత్త బ్యాంక్ కు11437 శాఖలుంటాయి.
ఇదే విధంగా కెనరా బ్యాంక్ , సిండికేట్ బ్యాంకులను విలీనం చేస్తారు.  దీనితో సిండికేట్ బ్యాంక్ నాలుగో పెద్ద బ్యాంక్ అవుతుంది.  కొత్త బ్యాంక్ వ్యాపారం రు. 15.20 లక్షల కోట్లుంటుంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు విలీనమవుతాయి. ఈ కూటమి అయిదో పెద్ద బాంక్ అవుతుంది. బిజినెస్ విలువ 14.59 లక్షల కోట్లు.
ఇండియన్ బ్యాంక్ ను ఆలహాబాద్ బ్యాంక్ తో విలీనం చేస్తున్నారు. ఇది రు. 8.08 లక్షల కోట్ల బిజినెస్ తో ఏడో పెద్ద బ్యాంక్ అవుతుంది.
దీనితో ఇపుడున్న 27 పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు 12 కు తగ్గిపోతాయి.

https://trendingtelugunews.com/gdp-dips-to-five-percent-in-april-june-quarter/