Gold Facts : బంగారు గురించి మీకు ఈ 17 వాస్తవాలు తెలుసా?

ప్రపంచంలో అత్యంత ఆసక్తి, ఉద్వేగం రేకెత్తించే లోహమేదయినా ఉందంటే అది బంగారమే.
అంతకంటే విలువయిన, శక్తివంతమయిన లోహాలుండవచ్చేమో గాని, వాటి గురించి సాధారణ ప్రజలకు తెలిసింది చాలా తక్కువ. ప్రపంచంలో బంగారు చూడని వాళ్లు చాలా అరుదు. బంగారం గురించి విననివాళ్లసలూ ఉండరేమో.
ఇంతగా అభిమానించినా, బంగారం గురించి చాలా అబ్బుర పరిచే విషయాలు చాలా మందికి తెలియవు. అవేమిటోఇపుడు చూద్దాం:
ప్రపంచంలో సహజమయిన పసుపుపచ్చని ‘బంగారు వన్నె’ ఉన్న లోహం గోల్డ్ ఒక్కటే. దీని రంగు సహజంగా మారదు.
భూమ్మీద ఉన్న బంగారమంతా ఆకాశం నుంచి వూడిపడిందే.
200 మిలియన్ సంవత్సరాల కిందట ఉల్కల తీసుకొచ్చి వదిలిందే. భారీగా ఉల్కలు భూమిని ఢీకొన్నపుడు రాలిందే.
బంగారు గాలి, తడి, ఎండలలో ఎలాంటి మార్పునకు లోను కాదు. ఏ యాసిడ్ లో కూడా కరగదు. యాక్వారీజియా అనే మిశ్రమంలో మాత్రమే కరుగుతుంది. బంగారానికి మరొక అద్భతమయిన గుణం సాగేగుణం,దీన్నుంచే బంగారం హోదా మారిపోయింది.
1.మనిషికి బంగారానికి అనుబంధం ఏర్పడేందుకు కారణం మనిషి శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్. బంగారు ఉత్తమ ఉష్ణవాహకం. అంటే క్షణాల్లో అది మనిషి శరీర ఉష్ణోగ్రత స్థాయికి వస్తుంది. ధరించినవాళ్లతోకలసిపోతుంది.
2 బంగారు 1064 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గిర మాత్రమే కరుగుతుంది.
3. మానవ నాగరికత మొదలయినప్పటి నుంచి ఇప్పటి వరకు 187,200 టన్నుల బంగారాన్ని మాత్రమే తవ్వి సేకరించారు.
4. సౌతాఫ్రికా గోల్డ్ రష్ 1888లో మొదలయింది. జార్జి హారిసన్ ఆస్ట్రేలియన్ గని కార్మికుడు ఇల్లు కట్టుకునేందుకురాళ్లను తవ్వుతున్నపుడు బంగారు ఖనిజం దొరికింది.అంతే, బంగారు వెదుక్కుంటూ అన్ని ప్రాంతాలనుంచి ప్రజలక్కడికి పరుగు పెట్టారు.ఇదే గోల్డ్ రష్.
5. ఇంతవరకు తవ్వి తీసిన గోల్డ్ నంతా 21 ఘనపు మీటర్లు బాక్స్ లో దాచేయవచ్చు.
6. ఇపుడు ప్రపంచంలో తవ్వితీస్తున్న గోల్డ్ లో 49 శాతం నగల తీయారీకే వెళ్తుంది.
7. కాలిఫోర్నియా గోల్డ్ రష్ (1845) నుంచి ఇప్పటి దాకా భూమ్మీద ఉన్న బంగారంలో 90 శాతం తవ్వి తీసేశారు.
8 . అతిపెద్ద గోల్డ్ కాయిన్ 2012లో తయారుచేశారు. ఆస్ట్రేలియా లోని పెర్త్ మింట్ లో తయారయిన ఈ బంగారు నాణేం వ్యాసార్ధమ్ 80 సెం.మీ. బరువు ఒక టన్ను.
9. బంగారుకు బాగా సాగే గుణం ఉందని చెప్పుకున్నాం కదా. ఒక ఔన్స్ గోల్డ్ ని 5 మైక్రాన్ల లావుండేలా సన్నగా సాగదీస్తే 50 మైళ్ల పొడవు వస్తుంది.
(మీకీ స్టోరీ నచ్చితే, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి)
10. ఒక బంగారు గని నుంచి బంగారు ముతక లోహాన్ని(Ore) తీసి  రిఫైన్ చేసే స్థాయికి రావాలంటే 10 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది.
11. గోల్డ్ బార్ అనే మాట విన్నారు కదా. ఈ బార్ ప్రమాణికంగా ఉండాలంటే ‘లండన్ గూడ్ డెలివరీ బార్’ (London Good Delivery Bar) సైజులో ఉండాలి. అంటే పోడవు 250 నుంచి 350 మి.మీ. వెడల్పు110 నుంచి 150 మి.మీ. ఎత్తు 60 నుంచి 100 మి.మీ ఉండాలి. హాంకాంగ్, న్యూయార్క్, సిడ్నీ, జ్యూరిక్, టోక్యో వంటి అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో
గోల్డ్ బిజినెస్ లండన్ గూడ్ డెలివరీ బార్స్ లోనే సాగుతుంది. సాధారణంగా ఒక్కొక్క బార్ 400 ట్రాయ్ ఔన్స్ లుంటుంది.
ఇది కూడా చదవండి
*రష్యా పిచ్చి పిచ్చిగా బంగారు కొంటాంది, ఎందుకో తెలుసా?
* గోల్డ్ కొనాలనుకుంటున్నా, ఇది గుర్తుంచుకోండి
12. ట్రాయ్ ఔన్స్ అంటే 31.1035 గ్రాములు
13. భూమ్మీద ఉన్న సముద్రాలలో 15,000 టన్నుల గోల్డ్ ఉందని అంచనా
14. ఒక ఔన్స్ ప్యూర్ గోల్డ్ ను 9 చదరపు మీటర్ల రేకుగా సాగగొట్ట వచ్చు.
15. ఒక ఔన్స్ బంగారాన్ని0.000018 సెం.మీ మందంగా సాగదీస్తే అది 80 మైళ్ల పొడవు వస్తుంది.
16. ప్రపంచంలో ఉన్న బంగారాన్నంతా కరగబోసి 5 మైక్రాన్ల తీగెలా సాగదీస్తే భూమి చుట్టూ 11.2 మిలియన్ రౌండ్లు చుట్ట వచ్చు.
17. ప్రపంచంలో బంగారు వ్యాపారాన్ని మానిటర్ చేసే సంస్థ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (World Gold Council). బంగారు డిమాండ్ చెక్కుచెదరకుండా ఉండేలాచూడటం,గోల్డ్ డిమాండ్ సృష్టించడంతో పాటు గోల్డ్ ఇండస్ట్రీకి ఒక విధంగా నాయకత్వం వహిస్తుందీ సంస్థ. ఒక్క మాటలో చెబితే గోల్డ్ మార్కెట్ కు గ్లోబల్ అధారిటీ ఈ సంస్థయే. దీని హెడ్డాఫీస్ లండన్ లో ఉంది.

(ఫోటో world gold council సౌజన్యం)