GOLD NEWS రష్యా పిచ్చి పిచ్చిగా బంగారు కొంటాంది, ఎందుకో తెలుసా?

రష్యా పిచ్చిగా పిచ్చిగా బంగారు కొనేసి నిల్వ చేస్తూ ఉంది.
ఎంత ఎక్కువగా గోల్డ్ నిల్వలుపెంచుకుంటూ ఉందంటే, గత 39 నెలలుగా  ఆగకుండా టన్నుల కొద్ది బంగారం కొని కొని బంగారు నిల్వలు అత్యధికంగా ఉన్న అయిదు ప్రపంచదేశాల జాబితా నుంచి చైనాను తరిమేసి తాను చేరింది. మొదటి నాలుగు దేశాలు: అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్.
ఇంతకాలం పాటు ఆగకుండా గోల్డ్ షాపింగ్ చేసిన దేశం ప్రపంచంలో రష్యాయే. చైనా, ఫిలిప్పీన్స్, సెర్బియా తదితర దేశాలు కూడా గోల్డ్ ను విపరితంగా కొని నిల్వలు పెంచుకుంటున్నాయి.
అయితే, రష్యా వీటన్నింటిని తలదన్ని గోల్డ్ కొంటూ ఉంది. అంతేకాదు, దేశంలో గోల్డ్ ఉత్పతిని కూడా పెంచుతూ పోతున్నది. ఇపుడు బంగారం ఉత్పత్తిలో ప్రపంచంలో రష్యా మూడో పెద్ద దేశం. వచ్చే ఏడేళ్లలో ప్రొడక్షన్ ను 50 శాతం పెంచాలని, 2030 నాటికి రెట్టింపుచేయాలని రష్యా ప్రణాళిక సిద్ధం చేసుకుంది.
2017లో రష్యా 8.8 మిలియన్ ఔన్సుల బంగారం ఉత్పత్తి చేసింది.(ఒక ఔన్స్ అంటే 28.34952 గ్రాములు). ఇది మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో 8.3 శాతం. 2030 నాటికి మరొక 8 మిలియన్ ఔన్సులు పెంచి ఉత్పత్తిలో చైనా స్పీడుకు ధీటుగా ఉండాలనుకుంటుూ ఉంది. ఇక గత 14 సంవత్సరాలలో తన బంగారు ఉత్పత్తిని రెట్టింపు చేసుకుంది.
2030 లో రష్యాలో లక్ష్యం సాధిస్తే అస్ట్రేలియా తర్వాత రెండో పెద్ద బంగారు ప్రొడ్యూసర్ అవుతుంది.
రష్యా బంగారు నిల్వులు జూలై చివరినాటికి 100 బిలియన్ అమెరికా డాలర్ల స్థాయికి చేరుకున్నాయి. ఒక్క జూన్ నెలలో నే రష్యా 18 టన్నులు గోల్డ్ నిల్వలు పెంచుకుంది. ఇపుడు రష్యా దగ్గిర మొత్తం 2208 టన్నుల బంగారం నిల్వ ఉంది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ రష్యా విడుదల చేసిన తాజా సమాచారం మేరకు లెక్కవేస్తే రష్యా ఒక బంగారు కొండమీద కూర్చున్నట్లే లెక్క. దీని విలువ జూలై 1న 100,277.6 మిలియన్ డాలర్లు.
ఈ ఏడాది చివరినుంచి ఇంతవరకు రష్యా 96.4 టన్నుల గోల్డ్ నిల్వ పెంచుకుంది. మార్చిలో 18 టన్నుల ఏప్రిల్ 16 టన్నుల, మే నెలలో 6 టన్నుల కంటే ఎక్కువగా గోల్డ్ సేకరించింది.
Also Read: బంగారు గురించి 13 ఆసక్తికరమయిన సత్యాలు
గత ఏడాది 275 టన్నుల బంగారు కొనుగోలు చేసింది. ఒకే ఏడాది ఇంత పెద్ద ఎత్తున ప్రపంచంలో ఏ దేశమూ బంగారు కొని నిల్వ చేసుకోలేదని వర్ ల్డ్ గోల్డ్ కౌన్సిల్ వ్యాఖ్యానించింది.
రష్యా గోల్డ్ రష్ (Gold Rush) కు కారణం ఏమిటి?
మొన్నమొన్నటి దాకా అమెరికా,సోవియట్ యూనియన్ ల మధ్య కోల్డ్ వార్ ఉండి. ఇపుడు అమెరికా -రష్యాల మధ్య గోల్డ్ వార్ నడుస్తూ ఉంది. డాలర్ తో పెత్తనం చేస్తున్న అమెరికాని రష్యా బంగారు తో కొట్టాలనుకుంటున్నది.
ఇది కూడా చదవండి: ఈ రోజు స్వల్పంగా పెరిగిన బంగారు ధర
రష్యన్ అంతర్జాతీయ వాణిజ్యం నుంచి డాలర్ పెత్తనం తీసేయాలని అధ్యక్షుడు పుతిన్ భావిస్తున్నారు. అందుకే ఆయన డాలర్ రుణాలను కూడా తీర్చేస్తున్నాడు. ప్రపంచవాణిజ్యాన్ని డీడాలర్ (Dedollarization) చేయాలనుకుంటున్నారు.  తన దగ్గిర ఉన్న డాలర్ నిల్వలను రష్యా భారీగా తగ్గించుకుంటున్నది. ఇటీవలే సుమారు 100 బిలియన్ డాలర్లను రష్యా జపాన్ యెన్, చైనా యువాన్, మూరోప్ యూరో ల్లోకి మార్చుకుని డాలర్ నుంచి ఇంకా దూరం జరిగింది.
చైనా, ఇరాన్, టర్కీ, ఫిలిప్పీన్స్,జర్మనీలతో పాటు అనేక యూరోప్ దేశాలు కూడా డాలర్ పెత్తనం నుంచి బయటపడాలనుకుంటున్నాయి. డాలర్ వ్యాపారం మానేస్తే మరొక అంతర్జాతీయ మారక ద్రవ్యం లేదు. అపుడు ట్రాన్సాక్షన్ చేయాల్సింది బంగారంతోనే. అందుకే  భవిష్యత్తు చెల్లింపులు బంగారంతో చేసేందుకు వీలుగా రష్యా, చైనా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు బంగారు నిల్వలు పెంచుకుంటున్నాయి.
Also Read: ఉసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా చనిపోయాడు
దీనితో బంగారం ధరలు ఇంకా భారీగా పెరిగి 2011 నాటిధరను మించిపోవచ్చని బంగారు వ్యాపారస్థులు చెబుతున్నారు. 2011 లో బంగారం ధర ఔన్స్ 1900 అమెరికన్ డాలర్ల దాకా పోయింది. ఈసారి ఇది 2000 అమెరికన్ డాలర్లు దాటుతుందటున్నారు.
డాలర్ పెత్తనం అంటే ఏమిటి?
రష్యా బంగారు పరుగు వెనక ఉన్న డాలర్ లేదా పెట్రోడాలర్ పెత్తనం నుంచి బయటపడాలనేదే   రష్యా పట్టుదలంతా.  ఇపుడు అంతర్జాతీయ చెల్లింపులన్నీ డాలర్లలో జరుగుతున్నాయి. ప్రపంచ విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో 60 శాతం, అంతర్జాతీయ చెల్లింపుల్లో 80 శాతం డాలర్లలోనే ఉన్నాయని ‘కరెన్సీ వార్స్’ రాసిన జేమ్స్ రికార్డ్స్ చెప్పారు.
అంతేకాకుండా అంతర్జాతీయ అప్పిచ్చు వాడయిన ఇంటర్నేషన ల్ మానెటరీ ఫండ్ (IMF)లో వీటో అధికారం ఉండేది ఒక్క అమెరికాకే.
అంతర్జాతీయ పరిస్థితులు తనకు అనుకూలంగా లేనపుడు ఆమెరికా తన డాలర్ పవర్ చూపిస్తూ ఉంటుంది. దీనికి SWIFT (Society for Worldwide Interbank Financial Telecommunication) పేమెంట్ వ్యవస్థను వాడుకుంటూ ఉంటుంది. ఈ నెట్ వర్క్ లో 10 వేల బ్యాంకులున్నాయి. ప్రతి అంతర్జాతీయ మనీ ట్రాన్సాక్షన్ మెసేజెస్ అన్నీ ఈ వ్యవస్థ ద్వారానే వెళ్తుంటాయి.
ఏదయినా దేశం తన మాట వినకపోతే, అంతర్జాతీయ వాణిజ్యం చెల్లింపులు జరిగే SWIFT పేమెంట్ సిస్టమ్ నుంచి అమెరికా ఆదేశాలను తొలగించేందుకు వత్తడి తీసుకువస్తుంది. SWIFT వ్యవస్థలో ఒక దేశం పేరును తీసేస్తే ఆదేశానికి అంతర్జాతీయ చెల్లింపులు, వసూళ్లు సాగవు.
ఎందుకంటే దేశాల మధ్య మనిట్రాన్స్ ఫర్ జరిగే ది ఈ వ్యవస్థ నుంచే.
SWIFT హెడ్ క్వార్టర్స్ బెల్జియం లో ఉన్నా కంట్రోల్ మాత్రమ్ అమెరికాదే. అమెరికా ఏకపక్షంగా దేశాలమీద ఆంక్షల విధిస్తూ ఉంది. వీటిని ప్రపంచ దేశాలన్నీ పాటించాలని వత్తిడి తెస్తూ ఉంది. ఉదాహరణకు ఇపుడు అమెరికా, ఆటంబాంబుల తయారీ వైపు ఇరాన్ దూసుకుపోతున్నదని చెబుతూ ఆదేశాల మీద ఆంక్షలు విధించింది.
ఇరాన్ నుంచి పెట్రోలియం కొనరాదని చెబుతూ ఉంది.అమెరికా బెదిరింపు వల్ల  ఇప్పటికే టోటల్ అనే ఫ్రెంచ్ అయిల్ కంపెనీ ఇరాన్ తో ఆయిల్ వ్యాపారం మానేసింది. అమెరికా ఆంక్షలు విధించే పెత్తందారి తనానికి   రష్యా, చైనా, జర్మనీతో తో సహా పలు యూరోపియన్ దేశాలు అనుకూలంగా లేవు.
వాళ్లు ఇరాన్ ఆయిల్ వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అలాంటపుడు ఈ దేశాలను కూడా శిక్షించేందుకు అమెరికా వెనకాడదు. వీటి మీద  కసితీర్చుకునేందుకు SWIFT నెట్ వర్క్ నుంచి ఈ దేశాల పేర్లను అమెరికా  తొలగించేప్రమాదం ఉంది.
అపుడు ఈదేశాలకు డబ్బు ట్రాన్స్ ఫర్ ఆగిపోతుంది.
గతంలో ఇరాన్,క్యూబాలను స్విఫ్ట్ నుంచి తొలగించి ఆ దేశాలకు చెల్లింపులు లేకుండా అమెరికా అడ్డుకుంది.
అయితే, యూరోపియన్ దేశాలు ఎడ్ హాక్ పేమెంట్ వ్యవస్థ అనే టెంపొరరీ వ్యవస్థను ఏర్పాటుచేసుకుని ఇరాన్ ను ఆదుకున్నాయి.
ఎందుకీ గొడవంతా?
అసలు ఈ డాలర్ గొడవ వదిలించుకుంటూ పోలా అని చాలా దేశాలు భావిస్తున్నాయి. రష్యా బంగారు నిల్వలు పెంచుకునేందుకు కారణం ఇదే.పేపర్ కరెన్సీ ట్రాన్స్ఫర్ చేయకుండా ఆడ్డుకోవచ్చు దానిని అంతర్జాతీయ రవాణాకు అనుమతించరు. SWIFT నుంచి కొన్ని దేశాలను తొలగించి నిధులు అందకుండా అడ్డుకోవచ్చు.
అయితే, అంతర్జాతీయ వ్యాపారంలో బంగారు చెల్లించరాదనే నిబంధన లేదు. దానికి తోడు కొన్న సరుకుల విలువలకు తగ్గబంగారాన్ని చక్కగా నౌకలో ఎక్కించి పంపవచ్చు. అందుకే రష్యా, చైనా, జర్మనీలు బంగారు నిల్వలు పెంచుకుంటున్నాయి.
భవిష్యత్తులో అమెరికా ఈ దేశాలను డాలర్ పేమెంట్ వ్యవస్థనుంచి తొలగిస్తే వీరంతా రీజినల్ కరెన్సీలో వ్యాపారం చేసుకుంటారు.లేదంటే బంగారు మారకం చేపడతారు.
ఇది రష్యా పిచ్చి పిచ్చిగా బంగారు నిల్వలు పెంచుకునేందుకు కారణం.

https://trendingtelugunews.com/market-experts-say-gold-bull-run-has-begun/