అభినందన్ వర్థమాన్ పాక్ సైనికులకు ఎలా చిక్కాడో తెలుసా?

వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పాక్ సైన్యం చేతికి బందీగా దొరికిన విషయం తెలిసిందే. ఆయన ఎలా చిక్కాడో తెలిస్తే ఆశ్చర్యపోవలసి ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వంలో ఫైళ్లు నత్త నడక నడుస్తుంటాయి. మన వూర్లో రోడ్డేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తే దానికి సంబంధించిన ఫైల్ కు మోక్షం రావాలంటే , ఎవరి పలుకుబడి లేకపోతే, దశాబ్దాలు పడుతుంది.  రెడ్ టేపిజం అంటే ఇదే. అక్షరాలే సైన్యంలో కూడా ఇదే జరిగింది. ఒక 2005లో చేసిన ఒక రిక్వెస్ట్ ను ప్రభుత్వం అమలులో చేయడంతో జరిగిన జాప్యం వల్లే ఆయన పాక్ సైన్యానికి దొరికాడు. ఇవిగో వివరాలు.
పాక్ కు బందీగా చిక్కిన తర్వాత అభినందన్ ని విడుదలచేయాలని భారత్ వత్తిడిపెంచడంతో పాటు  అంతర్జాతీయ వత్తిడి పెరగడంతో వర్థమాన్ ని పాకిస్తాన్ ఎలాంటి హాని తలపెట్టకుండా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/lord-mountbatten-fixed-august-15-1947-for-independence-day-because-of-his-world-war-2-conections/

భారత్ పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తల మధ్య రెండుదేశాలు వైమానిక దాడులకు తలపడ్డాయి.అపుడు ఫిబ్రవరి 27వ తేదీన అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన F-16 యుద్దవిమానాన్ని కూల్చేశారు.
తర్వాత ఏంచేయాలనే దాని మీద ఆయన తన సీనియర్ అధికారులనుంచి ఇన్ స్ట్రక్షన్స్ కోసం ఎదరుచూస్తున్నారు. ఎలాంటి ఇన్ స్ట్రక్షన్ ఆయనకు అందలేదు.
కారణం, పాకిస్తాన్ సైన్యం ఆయన క్యమూనికేషన్ సిస్టమ్ ను జామ్ చేయడమే.
ఇది కూడా చదవండి
* గూగుల్ సెర్చ్ వెనక ఉన్న ఇండియన్ కంప్యూటర్ మాంత్రికుడు ఈయనే
అభినందన్ ప్రయాణిస్తున్న యుద్ధవిమానంలో యాంటి జామింగ్ టెక్నాలజీ లేదు. అందవల్ల తన సీనియర్ అధికారులనుంచి సంబంధం తెగపోయింది. కారణం  పాకిస్తాన్ ఆయన కమ్యూనికేషన్ వ్యవస్థని పూర్తిగా జామ్ చేసేసింది. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయని హిందూస్తాన్ టైమ్స్ రాసింది.
అభినందన్ ఎట్టకేలకు సురక్షితంగా రావడంతో ఇపుు తాజాగా యాంటిజామింగ్ టెక్నాలజీని అందుబాటులోకి తేవాలనే డిమాండ్ ఎయిర్ ఫోర్స్ లో మొదలయింది.
అభినందన్ మిగ్ 21 బైసన్ విమానంలో పాక్తిస్తాన్ గస్తీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన విమానంలో యాంటి జామింగ్ టెక్నాలజీ ఉండిఉంటే అధికారులనుంచి సూచనలందగానే వెనక్కి వచ్చి ఉండేవాడు. దీనితో పాకిస్తాన్ ఆయన విమానాన్ని కూల్చే అవకాశం లభించేది కాదు. ఆయన వాళ్లకి దొరికేవాడు కాదు.
ఇది కూడా చదవండి 
ఆగస్టు 15, 1947 ఆర్థరాత్రి స్వాతంత్య్రం, పగలు ముహూర్తం బాలేదా?
బాలాకోట్ లోని జెయిష్ ఇ మొహమ్మద్ శిక్షణా శిబిరాలమీద భారత ఎయిర్ ఫోర్స్ దాడులు జరిపాక, ప్రతీకారంగా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఫిబ్రవరి 27న భారత మీద దాడులు జరిపేందుకు యుద్దవిమానాలను పంపించింది. భారతీయ యుద్ధ విమానాలు వాటిని తరిమేశాయి.
అయితే, తర్వాత వెంటనే వెనక్కి రావాలి. ఇలాంటి సమయాలలో ఒక పాయంట్ వద్ద అధికారులు పైలట్లకి “Turn Cold”అనే సంకేతం పంపిస్తారు. ఎయిర్ ఫోర్స్ పరిభాషలో దీనర్థం ‘తరిమేయడం మానేసి వెనుదిరగండి’ అని.
ఈ సంకేతం పంపినా వింగ్ కమాండర్ వర్థమాన్ అలాగే పాకిస్తాన్ యుద్ధవిమానాలను వెంబడిస్తూనే ఉన్నారు.
ఈ సమయంలోనే పాకిస్తాన్ అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న F-16 యుద్ధ విమానాన్ని అభినందన్ విజయయవంతంగా కూల్చేశారు.
ఆ తర్వతే ఆయన విమానాన్నిపాకిస్తానీయులు కూల్చేశారు. అభినందన్ ని బందీగా తీసుకున్నారు.
యాంటిజామింగ్ టెక్నాలజీ వంటి యోగ్యమయిన కమ్యూనికేషన్ వ్యవస్థ కావాలని ఎయిర్ ఫోర్స్ వారు 2005లోనే కోరారు. 14 సంవత్సరాలు గడిచినా  ప్రభుత్వం వాటిని ఎయిర్ ఫోర్స్ కు అందించలేకపోయిందనేది బాధాకరమయిన వావస్తం.
ఇలాంటి వ్యవస్థ అందుబాటులో ఉంటే, యుద్ధ సమయాలలో ఏ పైలట్ ఎంతవరకు శుత్రువిమానాలను వెంబడించాలి, ఎపుడు వెనక్కురావాలనేది కచ్చితంగా తెలుస్తుంది. అంతే, భారత యుద్ధవిమానాలలోని కమ్యూనికేషన్ వ్యవస్థను పాకిస్తాన్ జామ్ చేయలేదు.