ఆగస్టు 15, 1947: స్వాతంత్య్రం అర్థరాత్రే ఎందుకు వచ్చింది?

భారతదేశానికి స్వాతంత్య్రం అర్థరాత్రి వచ్చిందని అందుకే చీకటి కొనసాగుతూ ఉందని కొందరు ఎద్దేవా చేస్తూంటారు. భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వాలని బ్రిటిష్ పాలకులు నిర్ణయించారు. ఇవ్వకపోతే  తరమేసేందుకు సిద్ధంగా ఉన్నారు. స్వాతంత్య్రం ఇవ్వాలని బ్రిటిష్ పార్లమెంటు చట్టం చేసింది.  ఆపని పూర్తి చేయమని బ్రిటిష్ ప్రభుత్వం లార్డ్ లూయస్ మౌంట్ బాటెన్ ను వైస్రాయ్ ని పంపించింది. అలాంటపుడు ఆగస్టు 15న తెల్లవారాకా చక్కగా సుప్రభాత సమయంలో స్వాతంత్య్రం అందుకుని ఉండవచ్చు కదా?
నిజమే. కాని ముహూర్తం అడ్డొచ్చింది. ఇప్పటి పాలకుల్లాగే అప్పటి జాతీయోద్యమ నాయకులకు కూడా ముహూర్తాల,దుర్మూహూర్తాల పట్టింపు చాలా ఎక్కువగా ఉండింది.
ఇది కూడా చదవండి 
అభినందన్ వర్థమాన్ పాక్ సైన్యానికి ఎలా చిక్కారు? వెలుగులోకి వచ్చిన అసలు కారణం?

 

వైస్రాయోమో ఇండియన్లను సంప్రదించకుడా తనకిష్టమయిన తేదీ ఆగస్టు 15ను అధికార మార్పిడికి ఖరారుచేశారు.
ఆతేదీ బయటకొస్తూనే ఎవరో జాతకాలు చూశారు. అది మంచిరోజు కాదన్నారు. ఆ  విషయం వైస్రాయ్ కి చెప్పారు. ఆయన చివరిక్షణంలో తన అధికారం ప్రదర్శించాలనుకున్నారు. తేదీ మార్చడం కుదరదని చేప్పేశారు.
ఎలా ముహూర్తం బాగ లేనపుడు అధికారం స్వీకరిండం ఎలా?
ఒక మధ్యే మార్గం ఎంచుకున్నారు. బ్రిటిష్ క్యాలండర్ ప్రకారం దినం అర్థ రాత్రి 12గంటలకు మొదలవుతుంది.అప్పటి నుంచి ఎపుడైనా భారతీయులకు అధికారం బదలాయించవచ్చు.
ఆర్థరాత్రి పన్నెండు నుంచి  ఆగస్టు 15 కిందే లెక్క. భారతీయ క్యాలెండర్ ప్రకారం దినం మొదలయ్యేది సూర్యోదయం తర్వాత. కాబట్టి సూర్యోదయం తర్వాత మంచి రోజు కాదు కాబట్టి స్వాతంత్య్రం స్వీకరించడానికి వీల్లేదు.అంతకుముందు అర్థరాత్రి రాత్రయినా అభ్యంతరం లేదు. అర్థరాత్రి అధికార మార్పిడి జరిగితే ఆగస్టు 15నే మౌంట్ బాటెన్ కోరిక ప్రకారం స్వాతంత్య్రం ఇచ్చినట్లుంటుంది. అది ఆయన చివరి కోరిక. ఒక భారతీయులకు ఆగస్టున 15న  అనకుండా ఆగస్టు 14 అర్థరాత్రి స్వాతంత్య్రం పొందినట్లుంటుంది. అందువల్ల అధికార మార్పిడి అర్థరాత్రికి మార్చారు.
జ్యోతిషుల నుంచి ఇలాంటి వ్యతిరేకత వచ్చినందునే కాన్ స్టిట్యుయెంట్ అసెంబ్లీ కూడా ఎందుకయినా మంచిదని ఆగస్టు 14 రాత్రి 11గంటలకు సమావేశమయింది.
ఇలా భారతదేశానికి ముహూర్తాల మీద నమ్మకాల వల్ల సుప్రభాతానా కాకుండా అర్ధరాత్రి చీకట్లో స్వాతంత్య్రం వచ్చింది.
అర్థరాత్రి స్వాతంత్య్రం దినోత్సవం ఎలా జరిగిందో ప్రత్యక్షంగా వీక్షించిన చికాగో డెయిలీ  సౌత్ ఏషియా కరెస్పాండెంట్ ఫిలిప్స్ టాల్ బాట్  ఒక మిత్రుడికి రాసిన లేఖలో వివరంగా వర్ణించారు. ఆయన కూడా ఈ ఆగస్టు 15, 1947 దుర్ముహూర్తం గురించి ప్రస్తావించారు.