ఇండియాను ఒక మెట్టు కిందికి లాగిన ఫ్రాన్స్

భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఒక మెట్టు అడుక్కుపడిపోయింది.అంతర్జాతీయంగా ఇంతవరకు భారత దేశానికి ఆరోపెద్ద ఆర్థిక వ్యవస్థ అనే పేరుండింది. 2018లో భారత్ ను కిందికి లాగే సి ఆ ప్లేస్ లోకి ఫ్రాన్ వచ్చి చేరింది. 205 దేశాల ఆర్థికపరిస్థితుల(Gross Domestic Product-GDP) మీద సర్వే చేసి ప్రపంచ బ్యాంకు దేశాల ఆర్థిక వ్యవస్థలకుర్యాంకు ఇచ్చింది. ఇందులో భారత్ విషయం ప్రకటిచింది. దీనితో భారత్ కు ఏడో ర్యాంకు వచ్చింది.
2018 భారత జిడిపి 2.72 ట్రిలియన్ డాలర్లని ప్రపంచ బ్యాంకు లెక్కించింది. ఇది ఫ్రాన్స్ కంటే తక్కువ. ఫ్రాన్స్ జిడిపి 2.77 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు.
అమెరికా మాత్రం ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి అవుతున్న ఆర్థిక వ్యవస్థగా వచ్చింది. అమెరికా జిడిపి 20.5 ట్రిలియన్ డాలర్లు. అమెరికా తర్వాతి స్థానం 13.9 ట్రిలియన్ డాలర్లతో చైనాది. తర్వాత 4.9 ట్రిలియన్ డాలర్లతో జపాన్ మూడో స్థానంలో నిలబడింది. 3.9 ట్రిలియన్ డాలర్లతో జర్మనీది నాలుగో స్థానం. ఇక యుకె 2.82 ట్రిలియన్ డాలర్లతో అయిదోస్థానంలో ఉంది. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనుకున్న జపాన్ జర్మనీల కల నెరవేరడం లేదు.
2017లో ఇండియా ఫ్రాన్స్ ను అధిగమించి ఆరోపెద్ద ఆర్థిక వ్యవస్థగా జాబితా కెక్కింది. అపుడు జిడిపి 2.65 ట్రిలియన్ డాలర్లు.
అయితే, ఇపుడు ఫ్రాన్స్ తన స్ఠానాన్ని తిరిగి కైవసం చేసుకుంది.
భారతదేశం 2024-24 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గా మారాలని లక్ష్యం పెట్టుకున్నట్లు మొన్న టి బడ్జెట్ ఆర్థిక మంత్రినిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలాంటపుడు ఒక మెట్టు కిందికి పడిపోవడం అంత మంచి సూచిక కాదు.
2018-19 లో 6.8 శాతం జిడిపి వృద్ధి రేటులో ప్రపంచంలో వేగంగా డెవలప్ అవుతున్న దేశంగా చైనా కంటే ముందున్నా, అది 7.2 శాతం నుంచి పడిపోయింది.
ఇపుడు ప్రపంచవ్యాపితంగా అన్న అననుకూలవాతావరణంలో 2020 లో భారతదేశాభివృద్ధి 7 శాతం దాటదని ఐఎంఎఫ్ ,ప్రపంచబ్యాంకు చెబుతున్నాయి.రిజర్వు బ్యాంకు కూడా దీనిని 7 శాతానికిసవరించింది.
2024-25 లో భారత దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా అవతరించాలంటే వార్షిక పెరుగుదల 8 శాతం వుండాలి. ఇది ఇలా ఉన్నపుపుడు 2020లో 8 శాతానికి జిడిపి గ్రోత్ రేట్ చేరడం సాధ్యమా అనేది ప్రశ్న.