కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఎన్ తులసి రెడ్డి ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు.
ఆంధ్రప్రదేశ్ లో తుగ్లక్ పాలన నడుస్తూ ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
జగన్ పాలనా తీరు మీద ఇంత తీవ్రమయన వ్యాఖ్య ఎవరూ చేయలేదు.
ఈ రోజు ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ కాసులకోసమే రాష్ట్ర పభుత్వాలు అంటే గత టిడిపి ప్రభుత్వం, ఇప్పటి వైసిపి ప్రభుత్వం పోలవరం ప్రాజక్టును వాడుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.
తులసి రెడ్డి ఇంకా ఏమన్నారంటే…
*పోలవరం ప్రాజెక్టు ప్రకృతి ఆంధ్రప్రదేశ్ కి ప్రసాదించిన ఒక వరం
* ఈ ప్రాజక్టు వల్ల పరోక్షంగా గోదావరి జలాలను కృష్ణాకు తరలించడం జరుగుతుంది
*పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుందని అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారు
*దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు మారడం కారణంగా ప్రాజెక్టు వెనుకబడి పోయింది
*బిజెపి ప్రభుత్వం చట్టప్రకారం పోలవరం పూర్తి చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పై నెట్టేసింది
*రాష్ట్ర ప్రభుత్వాలు కాసుల కోసం కక్కుర్తితో పోలవరం బాధ్యతలు తమ నెత్తిపై వేసుకున్నాయి
*జగన్ పాలన తుగ్లక్ పాలనగా ఉంది
*రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన పోలవరం పూర్తి కాకుండా జగన్ అడ్డుపడుతున్నాడు
*ఏపి పునవ్యవస్థీకరన ప్రకారం చట్టం సెక్షన్ 90 ద్వారా కేంద్ర ప్రభుత్వమే పోలవరం ఆధీనంలోకి తీసుకోవాలి
*నిర్వాసితులందరికి న్యాయం చేయాలి
*4554 కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రియర్బ్రెస్ చేయాలి
*55,549 కోట్ల రూపాయల సవరించిన అంచనాలను కేంద్ర మంత్రిత్వశాఖ ఆమోదించాలి
https://trendingtelugunews.com/tirumala-laddus-demand-on-the-rise/