కాఫీ డే సంస్థాపకకుడు విజి సిద్ధార్థ బ్యాంకులను ముంచలేదు,నీరవ్ మోదీలా దేశం విడిచిపారిపోలేదు, మాల్యాలాగా విలాసవంతమయిన అలవాట్లు లేని వాడు.
రాజకీయ పగసాధింపు కోసం ఒక విజయవంతమయిన ఒక వ్యాపారాన్ని వూడల మర్రిని నిలువునా నరికేశారు.
అయినా సరే నష్టాల్లో ఉన్న ఆయనను టాక్స్ అధికారులు బాగా వేధించారని దానిని తట్టుకోలేకే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలుస్తున్నది. అయితే టాక్స్ అధికారుల వేధింపులో రాజకీయాలున్నాయని ఇపుడిపుడే వెల్లడయవుతున్నాయి. అందువల్ల సిద్ధార్థ నేత్రావతి నదిలో దూకి చనిపోయేందుకు ఈ వేధింపులే కారణమనే అనుమానాలు వస్తున్నాయి.
ఒక వైపు Make In India నినాదం ఇస్తూ, మరొక వైపు 100 శాతం దేశీయ వ్యాపార వేత్తకు కాపాడుకోలేకపోయిందీ దేశం.
కష్టపడి పైకొచ్చిన వ్యక్తి కష్టాల్లో ఉన్నపుడు చేయూతనీయాల్సిన అధికారులు రాజకీయంగా వేధించడం మొదలు పెట్టారు. ఇది తీవ్రమయిన విషయం.
ఎవరో బ్యాంకులను ముంచేసినా, బ్యాంకు అధికారుల పాత్ర అందులో ఉన్నా అవే బ్యాంకులకు మళ్లీ మళ్లీ క్యాపిటల్ అందించి ఆదుకుంటున్న ఈ రోజుల్లో ఆస్తులండి, నిజాయితీ నిండుగా ఉండి, ఎవరినీ మోసం చేయకుండా, ఉద్యోగుల సంక్షేమాన్ని జాగ్రత్త చూసుకుంటున్న సిద్ధార్థను ఆత్మహత్య కు వుసి కొల్పిన పరిస్థితుల మీద దర్యాప్తు జరగాలి.
సిద్ధార్థ ఎదుగుదల మొత్తం ట్రాన్సపరెంటుగా ఉంది. కర్నాటకకే చెందిన మాల్యాతో ఆయన జీవితాన్ని పోల్చండి. పోలికే లేదు. సిద్ధార్థ ఆత్మగౌరవంతో బతికాడు.
నిజానికి అతను కూడా హాయిగా విదేశాలకు పారిపోయి ఉండవచ్చు. ఆయన విదేశీ పర్యటలను మీద కోర్టు గాని మరొకరు గాని ఆంక్షలు విధించినట్లు వార్తలు రాలేదు.
కంపెనీ దవాళా తీసినట్లు ప్రకటించి, అందరిని ముంచేసిన ఉండవచ్చు.అయినా సరే అలా చేయలేదు. చాలా హుందా మైండ్ ట్రీలో ఉన్న తన వాటలను అమ్మి మూడు వేల కోట్ల అప్పులు తీర్చాడు. దీనికి టాక్స్ వాళ్లు అడ్డంకులు కల్పించారు. అపుడు మరొక కంపెనీలో ఉన్న షేర్లను టాక్స్ వాళ్లకు అటాచ్ చేసి మైండ్ ట్రీ షేర్లను విడిపించుకుని విక్రయించి అప్పులు తీర్చాడు. ఇది ఆయన నిజాయితీని, ఆత్మ గౌరవాన్ని చూపిస్తుంది. ఆయన కనిపించలేదని వార్త వచ్చిన రాత్రే ఇన్ కమ్ టాక్స్ శాఖ భారీ వివరణ ను విడుదల చేసింది.ఎందుకంత తొందర? డిపార్టమెంటు మీద ఇంకా విమర్శలు రాక ముందే ఆయన ఆత్మహత్యలో మా ప్రమేయం (వేధింపులు) లేదనే అర్థం వచ్చేలా వివరణ ఇచ్చారు.
మరొక ఇన్వెస్టర్ ద్వారా కేంద్ర సంస్థలు ఆయన్ని వేధించారని చెబుతున్నారు.
కాఫీ డే దాదాపు 1500 పైగా కాఫీ షాపులతో 50 వేల ఉద్యోగాలు సృష్టించింది.క్వాలిటీ ని ప్రోత్సహించింది. నగరాలన్నింటాా కాఫీ ఘుమఘుమలు వ్యాప్తించేలా చేసిన వ్యక్తి సిద్ధార్థం. అయితే, అధికారుల వేధింపులతో ఇలా ఒక విజయగాథ అర్థాంతరంగా ముగిసింది.
*GOLD NEWS రష్యా పిచ్చి పిచ్చిగా బంగారు కొంటాంది, ఎందుకో తెలుసా?
ఎందరో దొంగ వ్యాపారులకు చేయూతనిచ్చిన ప్రభుత్వాలు సిన్సియర్ సిద్ధార్థని అదుకోలేకపోయాయి. ఆయన వల్ల ఇంతవరకు ఎవరూ నష్టపోయినట్లు ఆధారాలు లేవు. కాఫీడే దుకాణాలు ఆయన చనిపోయిన రోజు కూడా మూత పడలేదు.
లిక్విడిటీ క్రైసిసే తప్ప కాఫీ డే వ్యాపారంలో మనీలాండరింగ్ ఉందని ఎవరూ ఇంతవరకు ఆరోపించలేదు. అలాంటి స్కామ్ ఉంటే ఈ పాటికి డా. సుబ్రమణియన్ స్వామి వెంటపడేవాడే.
సిద్దార్థ కష్టాలు ఆయన అక్రమాలకు పాల్పడినందున రాలేదు. షేర్ల విలువ పడిపోయింది. అందువల్ల షేర్లను విక్రయించినా వచ్చే డబ్బులు అప్పులకు సరిపోయేలా లేవు. దీనితో ఆయన స్నేహితులు దగ్గరి నుంచి భారీ లోన్స్ తీసుకున్నారు. ఇందులో భాగంగా ఒక ప్రయివేటు ఈక్విటీ పార్ట్ నర్ కూడా చేరాడు.
డెక్కన్ హెరాల్డ్ ఎడిటోరియల్ లో దీనికి సంబంధించిన ఆసక్తికరమయిన విషయాన్నొకటి ప్రచురించింది. బెంగుళూరు నుంచి వెలువడే ఈ పేపర్ ఈ వ్యవహారాన్ని టాక్స్ టెర్రరిజం గా వర్ణించింది.
కేంద్రం ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని మనీ లాండరింగ్ కేసుల్లో ఇరికించాలని చూస్తూన్నట్లు ఆరోపణలున్నాయి. ఆ కాంగ్రె స్ నాయకుడిని మీద మనీ లాండరింగ్ ఆరోపణలు చేయాలని ఈ ప్రయివేటు ఈక్వటీ పార్టనర్ మీద కేంద్ర దర్యాప్తు సంస్థలు వత్తిడి తీసుకువస్తున్నాయి. ఈ కాంగ్రెస్ నాయకుడు సిద్ధార్థ మామ ఎస్ ఎమ్ కృష్ణ అనుచరుడు. జీవితాంతం కాంగ్రెస్ ఉంటూ ఒక సారి ముఖ్యమంత్రి, కేంద్రంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కూడా అయిన ఎస్ ఎం కృష్ణ రెండేళ్ల కిందట బిజెపిలో చేరినపుడు అంతా ఆశ్చర్యపోయారు.
Also Read: బిన్ లాడెన్ కుమారుడు హమ్జా చనిపోయాడు
భారతీయ వ్యాపారస్థులంతా మహానుభావులేం కాదు. నీరవ్ మోదీ,లలిత్ మోదీ, విజయ్ మాల్యాలతో పాటు మరెందరో ఇంకోరకం ‘మహానుభావు’లున్నారు. అనుమానం లేదు. అయితే, సిద్ధార్థ వ్యవహారాలను జాగ్రత్త గమనిస్తే ఆయన ఎక్కడా అనుమానాస్పదమయన కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు కనిపించదు.
అలాంటి దేమయినా ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవలసిందే. అయితే, ఎవరినో రాజకీయంగా వేధించాలని, అధికారులతో ఇన్వెస్టర్ల మీద వత్తడి తీసుకురావడం అనేది క్షమించరాని నేరం.
కష్టాల్లో నష్టాల్లో ఉన్న సిద్ధార్థ ది మామూలు ఆత్మహత్య కాదు. ఆత్మహత్య తప్ప మరొక గత్యంతరం లేని పరిస్థితులు సృష్టించారని స్పష్టమవుతుంది.
దీని మీద దర్యాప్తు జరగాలి.కాని, చేయాల్సిందెవరు?