బిన్ లాడెన్ కొడుకు హమ్జా చనిపోయాడు…

అంతర్జాతీయ ఉగ్రవాది అల్ ఖేదా నాయకుడు ఉసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ చనిపోయాడు.
ఈ సమాచారాన్ని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలకు ఈ సమాచారం అందిందని అమెరికా కు చెందిన ఎన్ బిసి న్యూస్ మొదట ప్రసారం చేసింది.
అమెరికా మీడియా సంస్థలు ఈ వార్తను ప్రసారం చేసినా, ఇంటెలిజెన్స్ వర్గాలు మాత్రం ధృవీకరించలేదు. ఆయన చావులో అమెరికాపాత్రేమయిన ఉందా అనే విషయం కూడా తేలడం లేదు.
గత ఏడాదిలో హమ్జా ఒక ప్రకటన చేస్తూ అమెరికా, సౌదీ అరేబియాకు వ్యతిరేకంగా ఎదురుతిరగాలని పిలుపునిచ్చాడు.
దానితో సౌదీ ఈ మార్చిలో ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసింది. తర్వాత,హమ్జా ఎక్కడున్నాడన్న సమాచారం అందిస్తే ఒక మిలియన్ డాలర్ల బహుమానం ఇస్తామని అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ కూడా ప్రకటించింది.
తండ్రి స్థాపించిన అల్ ఖేదా కు ఇపుడతను నాయకుడని అమెరికా ప్రకటించింది.
హమ్జా వయసు 30 సంవత్సరాలు ఉండవచ్చని చెబుతున్నారు. 9/11దాడులకు ముందు బిన్ లాడెన్ ఆఫ్గన్ లో దాక్కుని ఉన్నపుడు ఇతగాడు తండ్రికి సలహాదారుగా ఉన్నాడు.
అల్ ఖేదాను తుదముట్టించేందుకు అమెరికా ఆఫ్గన్ మీదదాడి చేసినపుడు హమ్జా పాకిస్తాన్ లో తలదాచుకున్నాడు.
అల్ ఖేదా కొత్త నాయకుడు అయ్ మాన్ ఎల్ జవహరి పరిచయంతో హమ్జాది ఆడియో మెసేజ్ విడుదయింది. అల్ ఖేదా లో యువతరం ప్రతినిధిగా హమ్జాను వాళ్లు చూస్తూ వచ్చారు.
అమెరికా నగరాలలో తీవ్రవాద దాడులకు పూనుకోవాలని, తన తండ్రిని చంపినందుకు అమెరికా మీద ప్రతీకారం తీర్చుకోవాలని హమ్జా ఈ ఆడియో టేపులో పిలుపునిచ్చాడు.
పాకిస్తాన్ లో తలదాచుకున్న ఉసామా బిన్ లాడెన్ ను అమెరికా సైనికులు 2011 లో చంపిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో ఇరాన్ లో గృహనిర్బంధంలో ఉండేవాడు. ఆయన్ని తండ్రి దగ్గిరకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బిన్ లాడెన్ చంపినపుడు దొరికిన డాక్యుమెంట్లోలో ఉండింది.