ఈ రోజు ఉన్నట్లుండి దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల ధర 150 రుపాయలు పెరిగి రు. 35,870 లకు పెరిగింది.
దీనికి కారణం, గల్ఫ్ పరిణామాల వల్ల ఇన్వెస్టర్ సురక్షితమయిన బంగారు మీద దృష్టిపెట్టడం, దేశీయంగా ఇండస్ట్రియల్ యూనిట్ల నుంచి కొనుగోళ్లపెరగడం.
ఇక వెండికి సంబంధించి, కెజి ధర రు. 350 పెరిగింది. ఇపుడు వెండి మార్కెట్ లో కేజి ధర రు. 42,300 పలుకుతూ ఉంది.
ఆల్ ఇండియా సరాఫ అసోసియేషన్ అందించిన వివరాల ప్రకారం 99.9 శాతం, రు. 150 పెరిగి రు. 35,870 చేరితే 99.5 శాతం ప్యూర్ గోల్డ్ రు.35,00 కి చేరుకుంది. ఇక సావరిన్ గోల్డ్ ఎనిమిది గ్రాముల ధర నూరు పెరిగి రు. 27,500లకు చేరింది.
మంగళవారం నాడు బంగారు ధర బాగా పడిపోయింది. పది గ్రాముల ధర రు.250 తగ్గి రు. 35,720 దిగింది. వెండి మాత్రం రు. 350 పెరిగి కిలో ధర రు. 42,300 లకు చేరుకుంది. వెండినాణేల డిమాండ్ బాగా పెరిగింది. అందువల్ల నూరు నాణేలు ధర రు.1000 పెరిగి కొనుగోలు రు. 85,000 అమ్మకాలు రు.86,000 పలికాయి.