బెల్జియం మ్యూజిక్ ఫెస్టివల్ లో ఆంధ్రా సక్సెస్ స్టోరీ

ఉత్తరాంధ్ర గిరిజనులు యూరోప్ మనుసు దోచుకుంటున్నారు. ఈ రైతులు ఎక్కడో ఉన్నయూరోప్ లో కాలుమోపకుండానే బెల్జియంలో జెండా ఎగరేశారు. వాళ్లు పండించిన అర్గానిక్ కాటన్ నుంచి తయారయిన టిషర్టులు అక్కడి మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టు కున్నాయి.
సుమారు 30 వేల టిషర్టులు బెల్జియంలో జరిగిన ఎలెక్ట్రానిక్ మ్యూజిక్ ఫెస్టివల్  పాల్గొన్నవారు ధరించారు. ఉత్తరాంధ్ర గిరిజన రైతులు పండించిన ఆర్గానిక్ కాటన్ నుంచి తయారయిన ఈ టీషర్టులను ఈ మ్యూజిక్ ఫెస్టివల్ పాల్గొన్న 8 వేల మంది యువకులు ధరించి చిందులేశారు..
ఈ మ్యూజిక్ పండగ జూలై 19 ను మొదలయింది. ఈ నెల 29 దాకా నడుస్తుంది.
ఈ మ్యూజిక్ ఫెస్టివల్ ను tomorrowland టీమ్ నిర్వహిస్తూ ఉంది. ఈ పండగ 15వ వార్షికోత్సవం సందర్భంగా ఈ యువకులంతా ప్రపంచానికి సస్టయినబుల్ టీషర్ట్ మేసేజ్ పంపాలనుకున్నారు.
అందుకే ఈ ఫెస్టివల్ భాగస్వాములంతా ఆర్గానిక్ టీషర్టులు ధరించాలని నియమం పెట్టుకున్నారు. సస్టయినబుల్ టీషర్ట్ క్యాంపెయిన్ నిజం చేసేందుకు ఉత్తరాంధ్రకు చెందిన గ్రామీణవికాస కేంద్రం RESET బెల్జియం లోని అర్బన్ ఫైబర్స్ తో జతకట్టింది.
ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లాలోని పాచిపెంట, కురుపాం, గుమ్మ లక్ష్మీపురం, శ్రీకాకుళానికి చెందినభామినితోపాటు మొత్తం 26 గ్రామాలలో ఈ ఆర్గానిక్ కాటన్ ను పండిస్తున్నారు.
ఈ ప్రాంతంలోని 250 ఎకరాలనుంచి 18 టన్నుల పత్తిని సేకరించారు. గత ఏడాది అక్టోబర్ లో టిట్లీ తుఫాన్ దాడి చేయకపోయిఉంటే ఈ పత్తి ఉత్పత్తి ఇంకా ఎక్కువగా ఉండేది రైతులు చెబుతున్నారు. ఈ ప్రాజక్టును రీజనరేట్ ఎన్విరాన్ మెంట్, సొసైటీ అండ్ ఎకానమీ త్రూ టెక్స్ టైల్స్(RESET)అనే పథకం కింద చేపడుతున్నారు.
ఈ పద్ధతిలో కాటన్ పండించినప్పటినుంచి జిన్నింగ్, స్పిన్నింగ్, నిట్టింగ్, డైయింగ్, గార్మెంట్ మాన్యుఫాక్చరింగ్ మొత్తం దేశీయంగా జరగుతాయి.
ప్రపంచంలోనే అతి పెద్ద యూత్ మ్యూజిక్ ఫెస్టివల్ గా పేరున్న బెల్జియ్ ఫెస్టివల్ కు 30వేల టిషర్ట్ అను సరఫరా చేసే అవకాశం రావడం మాకుగర్వకారణమని, ఈ ఎన్ జివొ ఉపాధ్యక్షుడు శరత్ గిడ్డా ‘ది హిందూ’ కు చెప్పారు.
సమీప భవిష్యత్తులో 15 వేల మందిరైతులను ఆర్గానిక్ వ్యవసాయం పరిధిలోకి తీసుకువచ్చి 62,500 ఎకరాలలో ఆర్గానిక్ పత్తి పండిచాలని ఈ ఎన్జీవొ ధ్యేయంగా పెట్టుకుంది.
అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ లోని కడప,తెలంగాణలోని వరంగల్ జిల్లాలలోకూడా ఆర్గానిక్ పత్తి పండించే పనిలో RESET నిమగ్నమయింది.
ఆర్గానిక్ వ్యవసాయంలో ఖర్చు 50 శాతం దాకా తగ్గింది. దిగుబడి 30 శాతం దాకా పెరిగితే,  రాబడి 5 నుంచి 50 శాతం పెరిగిందని రిసెట్ నిర్వాహకులు చెబుతున్నారు.