చంద్రయాన్-2 అసలు థ్రిల్లర్ ఇక మొదలవుతుంది…ఇలా

సోమవారం నాడు ఇస్రో శాస్త్రవేత్తలు అంతరిక్ష నౌకను మోసుకుపోయేందుకు ప్రయోగించిన జిఎస్ ఎల్ వి మార్క్ -III ఎం 1 విజయవంతమయి పోయింది. ఇది ముఖ్యమయిన ఘట్టమే అయినా అసలు చంద్రయాన్ థ్రిల్లర్ ఇంకా మొదలు కాలేదు.
 మొన్నటి ప్రయోగం నాటి హర్షధ్వానాలు సద్దుమణగాయి. చంద్రయాన్-2 యాత్ర సజావుగా సాగుతూ ఉంది.
అయితే,ఇస్రో ఇపుడు అంత్యంత కీలకమయిన పని ప్రారంభించబోతున్నది. చంద్రయాన్ 2 మిషన్ లో కీలకమయిన దశ లోకి స్పేస్ క్రాఫ్ట్ ప్రవేశించబోతున్నది. ఇక్కడి నుంచి ప్రతి ప్రయోగం ఉత్కంఠ భరితంగా ఉంటుంది.
చంద్రుని మీద దిగాలంటే ముందు స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి ఆకర్షణ పరిధిలోకి వెళ్లాలి. అపుడు చంద్రయాన్ 2 ని చందమామకు దగ్గరకు వెళ్లి తిరుగుతూ ఉంటుంది.
ఈ పనిపూర్తి చేసేందుకు ఇస్రో ఆగస్టు 13 డెడ్ లైన్ గా పెట్టుకుంది.
ఈ లోపు చంద్రయాన్ అర్బిట్ విశాలం చేసేందుకు ఇస్రో అయిదు సార్లు అర్బిట్ లోకి ఎగిరించే పనులు చేపడుతుంది. దీనికి ప్రత్యేక స్పేస్ క్రాఫ్ట్ లో ప్రత్యేక ఇంజన్లు ఉన్నాయి.
ఇందులో ఫైనల్ ఆర్బిట్ లోకి చేరుకున్నాక చంద్రయాన్ 2 ను చందమామ పరిధిలోకి పంపిస్తారు. ఇది భూమినుంచి 1.05 కిమి ఎత్తుకు చేరుకున్నాక జరుగుతుంది.
ఇపుడు జిఎస్ ఎల్ వి వాహనం ఇంకా భూమ్యాకర్షణ పరిధిలోనే ఉంది. భూమి ఆకర్షణ నుంచి చంద్రుని ఆకర్షణలోకి స్పేస్ క్రాఫ్ట్ దూకేందుకు ట్రాన్స్ ల్యూనార్ (TLI) ప్రయోగం జరుగుతుంది.
ఇది ఆగస్టు 13, 14 తేదీలలో జరగవచ్చనుకుంటున్నారు.
చంద్రుని ఆకర్షణ పరిధిలోకి వెళ్లాక వారం రోజుల తర్వాత చంద్రడి సమీపానికి చేరుకుంటుంది. ఈ వారంలో ల్యూనార్ ట్రాన్స్ ఫర్ ట్రాజక్టరీ లో స్పేస్ క్రాఫ్ట్ భూమి నుంచి  3.84 లక్షల  కిలో మీటర్లు ఎత్తుకు చేరుకుంటుంది.
ఈ దశలో స్పేస్ క్రాఫ్ట్ భూమి ఆకర్షణను ఛేదించుకుని చంద్రుని అకర్షణలోకి దూకుతుంది. ఈ ట్రాజెక్టరీ చివర్లో ఆగస్టు 20, 21 తేదీలలో చంద్రయాన్ 2 చాలా స్పష్టంగా చంద్రుని ఆకర్ణణలో ఉన్న ఒక కక్ష్యంలోకి ప్రవేశిస్తుంది.
ఇక్కడ13 రోజులున్నతర్వాత స్పేస్ క్రాఫ్ట్ ల్యూనార్ బౌండ్ ఫేజ్ ( LBN) కు సిద్ధ మవుతుంది.  ఈ దశలో రోజు రోజుకు చంద్రయాన్ 2 చంద్రుని ఉపరితలం సమీపానికి చేరకుంటూఉంటుంది.
చంద్రుని ఉపరితలానికి 100 కిలో మీటర్లు దూరాన ఉన్నపుడు ల్యాండర్ (విక్రమ్) స్పేస్ క్రాఫ్ట్ నుంచి విడిపోతుంది.
అర్బిటర్ మాత్రం చంద్రుని చట్టు ప్రదక్షిణలు చేస్తూనే ఉంటుంది. ఇలా ఒక ఏడాది పాటు ఇది చంద్రుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది.
నాలుగు అర్బిట్ల తర్వాత సెప్టెంబర్ 7న విక్రమ్ చంద్రుడిమీదకు దిగడం మొదలు పెడుతుంది.
ఇది చంద్రయాన్ 2 యాత్రలో చాలా ఉత్కంఠ పూరితమయిన దశలోకి ప్రవేశిస్తుంది.
చంద్రుని ఉపరితలానికి 30 కిమీ దూరానికి చంద్రయాన్ చేరుకున్నాక చివరి 15 నిమిషాలు మొత్తం యాత్రలో అసలు థ్రిల్లర్ ఇదే అని ఇస్రో ఛెయిర్మన్ డాక్టర్ శివన్ అన్నారు.
ఎందుకంటే, ఎలాంటి సమస్య లేకుండా లాండర్ చంద్రుడి మీద నెమ్మది (soft-landing) దిగాలి. ఇస్రో ఇలాంటి సాఫ్ట్ ల్యాండింగ్ ప్రయోగాలు ఇంతవరకు చేయలేదు.
చంద్రుడి దక్షిణ దృవం మీద ఒక సమతల ప్రదేశంలో ల్యాండర్ దిగుతుంది. రోవర్ సంచారానికి ఇది చాలా అవసరం.
వెయ్యి కోట్ల భారతీయులు ప్రతినిధిగా రోవర్, ప్రజ్ఞాన్, చంద్రుని తిరుగాడడంతో భారత దేశం మరొక చరిత్ర సృష్టిస్తుంది. ఇది సవ్యంగా సాగుతుందని ఆశిద్దాం.

-టిటిఎన్ డెస్క్

(ఫోటోలు ISRO వెబ్ సైట్ నుంచి)