ప్రపంచంలో ఖరీదయిన ద్రాక్ష పళ్లివే…ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్

ఇవి రూబీ రోమన్ ద్రాక్ష పళ్లు. టేబుల్ టెన్నిస్ బాల్ సైజులో ఉండే ఈ పళ్లు ప్రపంచంలోనే  అత్యంత ఖరీదయిన వెరైటీ. తక్కువ ఎసిడిటితో ఉంటాయి.
వీటిలో రసం బాగా ఉంటుంది. చాలా చాలా తీయగా ఉంటాయి. ఒక్కొక్క పండు బరువు 20 గ్రా.నుంచి 30 గ్రా దాకా ఉంటాయి. 30 గ్రా.లున్నవాటిని ప్రీమియం వెరైటీ అంటారు.వీటికి మీరీ డిమాండ్. ఈపళ్లు కేవలం జపాన్ లోనే పండిస్తారు. ప్రపంచంలో మరెక్కడా పండవు. దొరకవు.
ఎర్రగా ప్రకాశవంతంగా ఉన్నందున వీటిని రూబీ గ్రేప్స్ అని పిలిచారు. రూబీ రోమన్ క్లబ్ మాత్రం దీనిని డ్రీమ్ గ్రేప్స్ అని పిలుస్తున్నది.
గత మంగళవారం నాడు జపాన్ లోని కనజవా నగరంలో 40 గుత్తుల పళ్లను వేలం వేశారు.
ఒక హోటెల్ చెయిన్ యజమాని వీటిని అత్యధిక ధర పెట్టి కొనేశాడు. వేలంలో ఒక్కొక్క ద్రాక్ష పండు 458 డాలర్లు (రు.31,400.62) పలికింది. ఆయన 24 పళ్లున్న గుత్తిని 11 వేల డాలర్ల (రు.7,541,63.30) కు కొన్నారు. తన హోటల్ లో అతిధులకు ఆయన ఈ పళ్లను పంచాలనుకుంటున్నారు. ఏరూపంలో అందిస్తారో తెలియదు.
ఈ ద్రాక్ష పళ్లని 2008లో సృష్టించారు. వీటిని జపాన్ లోకి ఇషికావా జిల్లాలోని  కోఆపరేటివ్ ఫామింగ్ లోనే మాత్రమే పండిస్తారు.
అప్పటినుంచి ఇప్పటిదాకా పలికిన అత్యధిక ధర ఇదే నని నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటి నుంచి సెప్టెంబర్ లోపు మరొక 26 వేల ద్రాక్ష గుత్తులను వేలం వేయాలనుకుంటున్నారు.
మొదటి సారి 2008లో వేలానికి వెళ్లినపుడు 700 గ్రామలు రూబీ గ్రేప్స్ 916 డాలర్లు పలికాయి. అపుడు ఒక పండు విలువ 26 డాలర్లు పలికింది. అదే 2016కల్లా 26 పళ్లున్న గుత్తి ధర 8400 డాలర్లు పలికింది. ఇలా ప్రతియేటా దీని ధర పెరిగిపోతూ ఉంది.