క్రికెట్ స్టార్ కావాలనుకుని ఈ కుర్రాడు ఏంచేశాడంటే…

కృష్ణా జిల్లా కంచికచర్ల పట్టణం వసంత కాలనీలో ఈ నెల 9వ తేదీన జరిగిన రూ. 10 లక్షల నగదు దొంగతనం కేసును కంచికచర్ల పోలీసులు ఛేదించారు..
పోలీసులు తెలిపిన వివరాలప్రకారం..
షేక్ గాని భాష పొలం కొనుగోలు నిమిత్తం బ్యాంకు నుండి తీసుకువచ్చిన పది లక్షల రూపాయల నగదు బీరువాలో భద్రపరచాడు. ఆరాత్రి తన భార్యతో పాటు ఇంటి పైన నిద్రిస్తున్నాడు.
ఈ సమయంలో కుమార్తె కొడుకు షేక్ మహబూబ్ విషయం తెలుసుకుని అదే రోజు రాత్రి సుభాని ఇంటి తాళాలు దొంగిలించి ఇంట్లోకి ప్రవేశించాడు.
అందుబాటులో ఉన్న స్క్రూడ్రైవర్ సహాయంతో బీరువా తలుపులు తెరిచి పది లక్షల రూపాయల నగదుతో పరారయ్యాడు.
క్రికెట్ అకాడమీలో చేరేందుకు ఐదు లక్షలు ఖర్చవుతుంది అని తెలుసుకున్న సుభాని క్రికెట్ పై ఉన్న మక్కువ కారణంగా ఎలాగైనా క్రికెట్ అకాడమీ లో చేరాలని దొంగతనానికి పాల్పడ్డాడని పోలీసు విచారణలో తేలింది.
దొంగిలించిన 10 లక్షల సొమ్ములో తనకు ఇష్టమైన లక్షా 30 వేల రూపాయల విలువైన ఐఫోన్, క్రికెట్ అకాడమీలో చేరేందుకు 25 వేల రూపాయల క్రికెట్ కిట్ కొనుగోలు చేశాడు.
మిగిలిన డబ్బుతో అకాడమీలో జాయిన్ అయ్యేందుకు వెళుతుండగా కంచికచర్ల బస్టాండ్ వద్ద నందిగామ రూరల్ సీఐ సతీష్ మరియు కంచికచర్ల ఎస్ ఐ శ్రీ హరి బాబు అదుపులోకి తీసుకున్నారు.
సుభాని వద్ద నుండి 8 లక్షల ఏడు వేల రూపాయల నగదు మరియు ఐఫోన్, క్రికెట్ స్వాధీనం చేసుకుని ఈరోజు మీడియా ముందు హాజరు పరిచారు…