బంగారును కూరగాయల్లా కొనే రోజులొస్తాయా? : అంతా నాసా చేతిలో ఉంది…

ముక్తి కావాలని అంతా ఆకాశం వైపు తలెత్తి చూసి వేడుకుంటుంటారు. అయితే, ముక్తి సంగతేమో కాని ఆకాశం నుంచి సమస్త మానవులకు సంపద వూడిపడే సమయం ఆసన్నమవుతూ ఉంది.
అది అంతా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) చేతిలో ఉంది.
అయితే, అదే సమయంలో నాసా  ప్రయోగం విజయవంతమయితే …
బంగారం ధర ఉల్లిగడ్డల ధర కంటే తక్కువకు పడిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు, భూమ్మీద ప్రతిమనిషి బిలియనీర్ అయ్యేంత సంపద వస్తుంది.
ఈ సంపదతో పాటు  గ్లోబల్ ఎకానమీ కుప్పకూలిపోయే ప్రమాదమూ ఉంది.
అయినా సరే, ఇలాంటి సంపదను ఆకాశంలో నుంచి కొల్లగొట్టే వీలుందేమో చూసేందుకు  2022 ఆగస్టులో నాసా ఒక బంగారు ఉల్క (asteroid) మీదకు అంతరిక్షనౌకను పంపిస్తూ ఉంది.
ఇది కూడా చదవండి:  భారత జట్టు ఓడిపోయేందుకు కారణమెవరు?
ఈ ఉల్క పేరు 16 సైకీ (16 Psyche). సాధారణంగా ఉల్కలన్నీ రాళ్లతో  లేదా ఐస్ తో గడ్డ కట్టుకు పోయి ఉంటాయి. అయితే, 16 సైకీ మాత్రం లోహంతో తయారయింది. దీన్నిండా ఇనుము,నికెల్, బంగారం ఉన్నాయి. ఇందులో ఉన్న బంగారం  విలువ … ఎవరూ వూహించలేనంత. ఎంతంటే #700 క్వింటిలియన్లు (quitillion).
ఒక క్వింటిలియన్ అంటే 1 పక్కన 18 సున్నాలు. దీనిని తెలుగులో లెక్కించడం చాలా కష్టం. ఇపుడు గ్లోబల్ ఎకానమీ విలువ కేవలం $ 75.5 ట్రిలియన్లు మాత్రమే. ప్రపంచ జనాభా 7.6 బిలియన్లు అనుకుంటే, 16 సైకీ నుంచి తెచ్చే సంపద అందరికీ పంచినా ఒక్కొక్కరికి 92 బిలియన్ డాలర్లు లభిస్తాయి.
ఇదే జరిగితే ఏమవుతుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. బంగారం ధర బహుశా కూరగాయలకంటే తక్కువయిపోతుంది…
ఇలాంటి సంపద ఉన్న గోల్డెన్ ఉల్క మీదికి నాసా అంతరిక్ష వాహనాన్ని పంపిస్తూ ఉంది.
నాసా 16సైకీ యాత్ర
ఈ యాత్ర 2022 ఆగస్టులో మొదలవుతుంది. సైకీ వాహనం ఉల్క మీద 2026లో దిగుతుంది. 2023 కల్లా అంగారక గ్రహం ఆకర్షణ పరిధిలోకి చేరుకుని 21 నెలలు అర్బిట్ లో తిరిగిన తర్వాత ఉల్క మీద దిగుతుంది.ఈ అర్బిట్ లో ఉన్నపుడు అన్ని రకాల ప్రయోగాలు చేస్తుంది.
ఇంతవరకు శాస్త్రవేత్తలు రాతి, మంచు ఉల్కలను మాత్రమే పరిశీలించారు. లోహ ఉల్కలను పరిశీలించలేదు. అందుకే సైకీ యాత్రకు చాలా ప్రాముఖ్యం ఉంది.
 ఈ స్టోరీ నచ్చితే అందరికీ షేర్ చేయండి. trendingtelugunews.comను ఫాలో కండి
భూగర్భంలో రకరకాల కరిగిన లోహాల ద్రవం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ద్రవరూపలోహాలను, అక్కడి పరిస్థితులను భూగర్భంలోకి వెళ్లి పరిశీలించడం సాధ్యం కాదు.  ఆస్టెరాయిడ్స్ అనేవి సౌరకుటుంబం పుట్టేటపుడు వివిధ దశలలో  బయటకు వచ్చిన  దుమ్ముధూళి లేదా ప్రిమిటివ్ పదార్థాలనుంచి ఏర్పడిన శకలాలు.వీటికి మినీ గ్రహాలనే పేరు వచ్చింది దీని వల్లే.
ఇలాంటి వాటిలో లోహపదార్ధాలతో ఏర్పడిన ఆస్టెరాయిడ్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి వాటికోవలోనిదే 16 సైకీ. ఇది భూమి కోర్ ను పోలి ఉంటుందని  శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
అందువల్ల సైకీని అధ్యయనం చేస్తే భూమి కోర్ ను అధ్యయనంచేసినట్లేనని నాసా ఈ 16 సైకీయాత్రకు సిద్ధమయింది.
సైకీని ఇటలీ దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త అనిబెల్ డి గాస్పెరిస్ 1862 మార్చి 17 న కనుగొన్నాడు.సైకీ అనేది ఒక వనదేవత పేరు. గ్రీక్ పురాణాల  ప్రకారం  మన మన్మథుడి వంటి క్యుపిడ్ (Cupid)ని పెళ్లిచేసుకుంది. అయితే, ఇది నచ్చక తల్లి   వీనస్ సైకీ ని చంపేసింది. అపుడు క్యూపిడ్ అభ్యర్థన మేరకు ఆకాశదేవుడు జూపిటర్ సైకీ కి అమరత్వం ప్రసాదిస్తాడు.
సుదూర అంతరిక్షంలో ఉన్న సైకీ 16 అనేది బంగారు ఉల్క (Goden Asteroid) అని కొనుగొన్నప్పటినుంచి లోహ ఉల్కల నుంచి లోహాన్ని ఎలా మైనింగ్ చేసి భూమ్మీదకు తీసుకురావాలనే చర్చ మొదలయింది.
ఈ ఉల్క మార్స్ కు జుపిటర్ ల మధ్య ఉన్న ఒక కక్షలో ఇది స్థిరంగా తిరుగూ ఉంది. అక్కడ ఉన్క అస్టెరాయిడ్ బెల్ట్ లో ఉన్న పది లోహపు ఉల్కల్లో ఇదొకటి. దీని వ్యాసార్థం 144 మైళ్లు. ఇంత పెద్ద లోహపు ఉల్క గతంలో ఎపుడూ కనిపించలేదు.
అయితే, ఉల్క నుంచి లోపు తవ్వి తీసుకురావడమనేది అంత సులువయిన పనికాదు. దొరికే దాని కంటే ఖర్చెక్కువుతూందని కొందరు వాదిస్తున్నారు.
మొత్తానికి సైకీ 16 విలువ #700 క్వింటిలియన్లని అంతా లెక్క కట్టారు.
భూమ్మీద వనరులు తగ్గిపోతున్నాయి కాబట్టి అంతరిక్షంలో మైనింగ్ చేసి తీసుకురావడమే మార్గం. ఆస్టెరాయిడ్ బెల్ట్ లో ఉన్న ఉల్కల్లో ఉన్న లోహాలను వెలికి తీసేందుకు ప్రపంచ దేశాల మధ్య పోటీ మొదలయింది.
బెన్ను అనే అస్టెరాయిడ్ చుట్టు ఇప్పటికే నాసా OSIRIS-REx అనే అంతరిక్ష వాహనం తిరుగుతూ ఉంది. దీని విలువ $700 మిలియన్ డాలర్లు అని అంచనావేశారు.
ఇలాగే జపాన్ ర్యూగు (Ryugu) అనే ఉల్క మీదకు ఒక అంతరిక్ష వాహానం పంపించింది. దీని విలువ $82.86 బిలియన్ లని అంచనా వేశారు. డీప్ స్పేసెస్ ఇండస్ట్రీస్, ప్లానెటరీ రీసోర్సెస్ అనే సంస్థలు 2011UW158 అనే ఉల్క మీద మైనింగ్ చేయాలనుకుంటున్నాయి. దీని విలువ $5.7 ట్రిలియన్లని అంచనా.