నియోజకవర్గానికి డూప్ ను పెట్టిన సన్నీ డియోల్…

చిక్కుల్లో పడ్డాడు సినిమా యాక్టర్  కమ్  ఎంపి సన్నీ డియోల్. సినిమా గ్లామర్ ఉపయోగించుని పంజాబ్ లో ఎన్నికల్లో గెలవాలనుకుని భారతీయ జనతా పార్టీ సన్నీడియోల్ ను పంజాబ్ లోని గురుదాస్ పూర్ నుంచి ఎన్నికల్లో నిలబెట్టింది గెల్చింది. క్యాంపెయిన్ లో ఉన్నపుడు బాలకోట్ అంటే ఏమిటో తెలుసాఅని అడిగితే, ఒ క్యాహై అంటూ ఎదురు ప్రశ్న వేసి సన్సేషన్ అయ్యాడు సన్నీ డియోల్.
మొత్తానికి మోదీ సునామీలో సన్నీడియోల్ గెల్చాడు.ఎంపి అయ్యాడు. తర్వాతే ఆయనకు ఏంచేయాలో అర్థం కాలేదు.
అయితెే గెల్చాక మొదట చేసిన నియోజకవర్గానికి డూప్ నియమించాడు.హీరోలు కష్టతరమయిన ఫైట్ సీన్లలో డూప్ లను పెట్టిలాగించేస్తుంటారు. అయితే, రాజకీయాలనేవి సన్నీడియోల్ లాంటి వాళ్లకు కష్టమే. అందుకే ఆయన తన లోక్ సభ నియోజకవర్గానికి ఒక  డూప్ ను అధికారికంగా నియమించి చిక్కుల్లో పడ్డాడు.
ఆయన పంజాబ్ గురుదాస్ పూర్ నుంచి లోక్ సభకు బిజెపి నుంచి  గెలిచి ఉండవచ్చుగాక, ఎంపిగా అపుడపుడు లోక్ సభకు వెళ్ల వచ్చుగాని, జిల్లాలో జరిగే చిన్న చిన్న మీటింగ్ లకు, రివ్యూ మీటింగ్ లకు, కౌన్సిల్ మీటింగ్ లకు, కార్యకర్తల మీటింగ్ లకు వెళ్లడం, వాళ్లకి వీళ్లకి ఫోన్ లు చేసి ఆ పని  చేయి, ఈ పని  చేయ్ అని సిఫార్సు చేయడం… హీరోలు చేసే పని కాదనుకున్నాడు.దీనికి డూప్ అవసరమనుకున్నాడు.
 అబ్బే..,  ఇలాంటివి చేయడం కష్టం అనుకున్నాడు. అందుకే తన తరఫున అన్ని అధికార కార్యక్రమాలకు హాజరయి,తదుపరి ఏంచేయాలో కూడా చేసేందుకు ఒక ప్రతినిధిని అప్పాయంట్ చేశాడు.
సినిమాల స్క్రిప్ట్ రైటర్ గుర్ ప్రీత్ సింగ్ పల్హేరి నియోజకవర్గం చూసుకుంటాడని చెప్పారు. . ఇది నియోజకవర్గానికి ద్రోహమే అంటున్నారు, కాంగ్రెస్ వాళ్లు… పెద్ద గొడవ అవుతూ ఉంది అక్కడ. ఎందుకంటే, కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాకడ్ మీద డియోల్ దాదాపు 90 వేల వోట్లతో గెలిచాడు.  నియోజకవర్గం లో  ఉంటూ ప్రజలకు అందుబాటులోఉంటూ వాళ్ల సాదకబాధకాలు చూస్తూఉంటాడని ప్రజలు గెలిపించింది సన్నీడియోల్ నుగాని, ఆయన ప్రతినిధిని కాదు అని కాంగ్రెస్ నాయకులు గొడవ చేస్తున్నారు.
ఆయన ఎంపి లెటర్ హెడ్ మీద చాలా స్పష్టంగా గుర్ ప్రీత్ సింగ్ పల్హేరి నియమిస్తూ విడుదల చేశారు. ఆయన ఏమి పనులు చేస్తారో కూడా వివరించారు. లెటర్ లో ఏమి రాశారంటే…
“I hereby appoint Gurpreet Singh Palheri, son of Supinder Singh, resident of village Palheri, district Mohali, Punjab, as my representative to attend meetings and follow important matters pertaining to my Parliamentary constituency, Gurdaspur (Punjab), with concerned authorities.”
ఇది నియోజకవర్గప్రజలను మోసిగించడమే నని పంజాబ్ కాంగ్రెస్ మంత్రి సుఖ్ జిందర్ సింగ్ రణధావా అంటున్నారు.