చెన్నై గొంతెండేందుకు కారణమెవరు? కిరణ్ బేడీ ఏమన్నారో చూడండి

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ  చేసిన ఈ ట్వీట్ తమిళనాడులో వివాదాన్ని సృష్టిస్తూ ఉంది. ఇది తమిళప్రలను అవమానించడమే నంటూ అసెంబ్లీలో మంత్రి షణ్ముగం, ప్రతిపక్షనాయకుడు స్టాలిన్ నిరసన తెలిపారు. తమిళనాడులో మంచి పాలన లేకపోవడం వల్లే  దేశంలో ఆరో పెద్ద నగరమయిన చెన్నై నీళ్లు లేక ఎండిపోయిందని ఆమెట్వీట్ చేశారు. ఇలా మహానగరాలలో మొదటి నీళ్లు లేక ఎండిపోయిన నగరమే చెన్నే నే అంటూ దీనికి సమస్య ఎక్కుడందని ఆమె ప్రశ్న వేశారు. సమాధానం కూడా చెప్పారు.

సమాధానం: చచ్చు పరిపాలన, రాజకీయ అవినీతి, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికార యంత్రాాంగం అని తానే జవాబిచ్చారు.

నిజానికి గవవర్నర్ హోదా లో ఉన్న వారు మరొక రాష్ట్ర ప్రభుత్వం మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయరు.  ఎందుకంటే ఇది చాలా పదునైన రాజకీయ వ్యాఖ్య.  మూడు ముక్కల్లో ఆమె తమిళనాడులో ఇపుడు ప్రభుత్వాన్ని గతంలో పాలించిన ప్రభుత్వాలను, అక్కడి రాజకీయ సంస్కృతిని, చేతకానిఅధికారులను అభిశంషించారు. దీనికి చాలా ధైర్యం ఉండాలి.

ఇలాంటి మొండి ధైర్యానికి కిరణ్ బేడీ పెట్టింది పేరు. అందుకే తమిళనాడు ప్రభుత్వాన్ని  లెక్క చేయకుండా, అక్కడి అధికార యంత్రంగాన్ని రాజకీయనాయకులను ఏమాాత్రం ఖాతరు చేయకుండా ఆమె కట్టగట్టి అందరిని ఒక గాట కట్టారు. వారి వల్ల చెన్నైనగరంలో ప్రజలునీళ్లు లేక అల్లాడిపోతున్నారని అన్నారు.

తమిళనాడు ప్రభుత్వం  కిరణ్ బేడీ  ట్వీట్ మీద స్పందించలేదు. అయితే, మంత్రి సివి షణ్ముగం నిరసన తెలిపారు. తర్వాత   స్టాలిన్ కూడా కిరణ్ బేడీ ట్వీట్ పట్ల అభ్యంతరం తెలిపారు. అయితే,ఇద్దరి వ్యాఖ్యాలను స్పీకర్ రికార్డులనుంచి తొలగించారు.  దీనితో స్టాలిన్  అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.