74 మందితో చంద్రబాబుకు రక్షణ, ఇంకేం కావాలా?: హోం మంత్రి సుచరిత

ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి సెక్యూరిటీ  చాలా  ఎక్కువగా ఉందని, తగ్గించారనడం రాజకీయప్రకటన మాత్రమేనని ఆంధ్రా హోం మంత్రి మేకతోటి సూచరిత అన్నారు.
 ఈ రోజు ఆమె చంద్రబాబు సెక్యూరిటీ  తగ్గించారని వస్తున్న విమర్శల మీద వివరణ ఇచ్చారు.
 నిజానికి ఆయన సెక్యూరిటీని రివ్యూ చేసిన  కమిటీ సూచించిన దానికంటే ఎక్కువ చేశామని  సుచరిత అన్నారు.
‘కేవలం 58 మందితో మాజీ ముఖ్యమంత్రికి  భద్రత కల్పించాలని మాత్రమే సెక్యూరిటీ రివ్యూ కమిటీ సూచించింది. కానీ ఇప్పటికే 74 మంది భద్రతా సిబ్బంది వివిధ కేటగిరిల్లో చంద్రబాబునాయుడుకి రక్షణగా ఉన్నారు,’ అని ఆమె అన్నారు.
 బులెట్ ప్రూఫ్ కారు, ఎస్కార్ట్ కారు కూడా ఇచ్చామని, అయినా కూడా భద్రత తొలిగించామని ఆయన ఆరోపించడం సరికాదని మంత్రి అన్నారు.
ప్రతిపక్షనేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి భద్రత తగ్గింది అని అనవసర ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు.
మరింత భద్రత కావాలని చంద్రబాబునాయుడు కోరితే తప్పకుండా పరిశీలిస్తామని కూడా ఆమె తెలిపారు.
‘ఇంటివద్ద ఆర్మ్డ్ స్టాటిక్ గార్డు 2+8 కేటాయించాల్సి ఉండగా 4+16 కేటాయించాం. రౌండ్ ది క్లాక్ గా ఇద్దరు పీఎస్వోలు మూడు షిప్టులుగా పని చేయాల్సి ఉండగా ఆరుగురిని కేటాయించాం. రెండు ఎస్కార్ట్ గార్డులు 1+3 ని మూడు షిప్టులుగా 24 మందిని కేటాయించాల్సి ఉండగా 24 మందిని కేటాయించాం.  అదే విధంగా వాచర్స్ ను ఐదు మందికి ఐదు మందిని, ఒక రిజర్వ్ ఇన్ స్పెక్టర్ ని, 12 మంది తనిఖీ సిబ్బందిని, బుల్లెట్ ఫ్రూఫ్ కారు మరియు ఒక జామర్ వాహనాన్ని సమకూర్చాం  మూడు షిప్టులుగా షిప్ట్ కు ఇద్దరు డ్రైవర్ల చొప్పున ఆరుగురిని కేటాయించాం. ఈ మొత్తం సిబ్బంది కేటాయింపులు భద్రతలో భాగంగా కేటాయింపులు జరిపాం,’ ఆని మంత్రి తెలిపారు.
అయితే మరింత భద్రత కావాలని చంద్రబాబునాయుడు కోరితే తప్పకుండా పరిశీలిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆమె తెలిపారు. ఇంటివద్ద ఆర్మ్డ్ స్టాటిక్ గార్డు 2+8 కేటాయించాల్సి ఉండగా 4+16 కేటాయించామన్నారు. రౌండ్ ది క్లాక్ గా ఇద్దరు పీఎస్వోలు మూడు షిప్టులుగా పని చేయాల్సి ఉండగా ఆరుగురిని కేటాయించామన్నారు. రెండు ఎస్కార్ట్ గార్డులు 1+3 ని మూడు షిప్టులుగా 24 మందిని కేటాయించాల్సి ఉండగా 24 మందిని కేటాయించామని మంత్రి అన్నారు. అదే విధంగా వాచర్స్ ను ఐదు మందికి ఐదు మందిని, ఒక రిజర్వ్ ఇన్ స్పెక్టర్ ని, 12 మంది తనిఖీ సిబ్బందిని, బుల్లెట్ ఫ్రూఫ్ కారు మరియు ఒక జామర్ వాహనాన్ని సమకూర్చామని మంత్రి తెలిపారు. మూడు షిప్టులుగా షిప్ట్ కు ఇద్దరు డ్రైవర్ల చొప్పున ఆరుగురిని కేటాయించామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ఈ మొత్తం సిబ్బంది కేటాయింపులు భద్రతలో భాగంగా కేటాయింపులు జరిపినట్లు ఆమె తెలిపారు. ప్రతిపక్షనేత భద్రత విషయంలో రాజకీయాలు మానుకోవాలని మంత్రి సుచరిత కోరారు.