అక్టోబర్ నుంచి ఆంధ్రా బెల్ట్ షాపులు బంద్, జగన్ ఆదేశం

మద్యపానాన్ని నిషేధిస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్మమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు మొదలు పెట్టారు.
అక్టోబరు 1 నాటికి రాష్ట్రంలో  బెల్టుషాపులు పూర్తిగా ఎత్తివేయాల్సిందే నని చెప్పారు.
ఏ మేరకు  అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల ఎస్ పిల  సమావేశంలో ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలను సీఎం ఆదేశిించారు.
సమాజానికి మంచే చేసే నిర్ణయాల అమల్లో అడుగులు ముందుకు పడాల్సిందేనని ఖరాకండిగా చెప్పారు.
జాతీయ రహదారుల వెంబడి మద్యం షాపులు వద్దనికూడా చెప్పారు.
దాబాల్లో లిక్కర్‌ అమ్మకుండా చూడాలని కూడా సీఎం ఆదేశాలిచ్చారు.
ఇలాగే ఆయన గంజాయి, కాల్ మనీ రాకెట్  మీద కఠినంగా వ్యవహారించాలని ఆదేశాలిచ్చారు.
గంజాయి సాగు
గంజాయి ఏరివేతకు ఆగస్టులో భారీ అపరేషన్‌ నిర్వహించి, గంజాయి సాగు చేయకుండా గిరిజనుల్లో అవగాహన కల్పించి వారి పునరావాసం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పారు. వారిపై కఠినంగా వ్యవహరించే బదులు, వారి జీవనోపాధికి మార్గాలు చూపుదామని, ఇంటెలిజెన్స్, గ్రేహౌండ్స్‌లతో సమన్వయం చేసుకుని ఒక ప్రణాళికతో రావాలన్న సీఎం అధికారులను ఆదేశించారు. మళ్లీ గంజాయి సాగులోకి రాకుండా ఉండాలంటే మంచి జీవనోపాధి పరిష్కారాలు చూడాలని ఆయన సూచించారు.
కాల్ మనీ రాకెట్
విజయవాడ వంటి నగరంలో ప్రముఖల అండతో కాల్ మనీ  ఘటనలు జరగడం దారుణమని  ముఖ్మమంత్రి వ్యాఖ్యానించారు. కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ అంశంపై సీఎం సీరియస్‌ అయ్యారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదని చెప్పారు. ఈ ర్యాకెట్ వెనక  ఏ పార్టీవారు ఉన్నా విడిచిపెట్టొద్దని పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారు. పోలీసు వ్యవస్థను క్లీన్‌చేయాల్సిన అవసరం నొక్కిచెబుతూ ఎవరికైనా ఫిర్యాదుతో వస్తే వెంటనే దానిని స్వీకరించి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.