భద్రాచలాన్ని ఆంధ్రాకిచ్చేది లేదు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

తెలంగాాణలోని భద్రాచల క్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చేదిలేదని  ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి  ఆల్లోల ఇంద్రకరణ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
ఈ రోజు ఆయన తిరుమల శ్రీవారిని సందర్శించకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  శ్రీరాముడి క్షేత్రమయిన  భద్రాచలం ను ఏపికి కేటాయించే ప్రతిపాదన లేదని చెప్పారు.
కొద్ది రోజులుగా మీడియాలో ఈ ప్రతిపాదన పచార్లు కొడుతూ ఉంది. హైదరాాబాద్ సెక్రటేరియట్ లో ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన భవనాలను తెలంగాణకు తిరిగి ఇవ్వాలని ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. దీని మీద గవర్నర్ ఆదేశాలు కూడా వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో దీనికి బదులుగా తెలంగాణ ప్రభుత్వం భద్రాచాలన్ని ఆంధ్రకు బదలాయిస్తారనే వార్త వచ్చింది. దీని మీద తెగ చర్చ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక భద్రాచలం మీద కెసిఆర్ దృష్టి పడలేదెందుకో. ఆయన చిన్న జీయర్ స్వామీజీ సలహామేరకు యాదగిరి గుట్టును యాదాద్రి సంస్కృతీకరించి తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు. ఇంత శ్రద్ధ భద్రాచలం మీద లేదు. బహాశా దీనితో బాధపడ్డ ఏవో శక్తులు భద్రాచాలాన్ని ఆంధ్రకు పంపిస్తే సరి అని  ప్రతిపాదన చేసినట్లు అర్థమవుతుంది. ఏమయినా ఈ ప్రతిపాదన గురించి సరైన సమాచారంలేదు. ఈ నేపథ్యంలో  మంత్రి  స్పష్టీకరణ వెలువడింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ముఖ్యమంత్రులు అభివృద్ధి కోసం కలసి పనిచేస్తూన్నారు. 5 సంవత్సరాలుగా హైద్రాబాద్ లో నిరుపయోగంగా ఉన్న ఏపీ భవనాలను తెలంగాణకు అప్పగించడం అభినందనీయం.  అని అంటూ భద్రాచాలన్ని ఆంధ్రకు బదిలీ చేసే ప్రతిపాదన లేదనిఆయన చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తో పాటు మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ లను సీఎం కేసీఆర్ ఆహ్వానించనున్నారని మంత్రి అల్లోలఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.