చెన్నై నీళ్ల సమస్య తీవ్రమయింది. చాలా ఐటి కంపెనీలు సిబ్బంది ఆపీసులకు రావద్దని, తమకు అనుకూలమయిన ప్రదేశం నుంచి పనిచేయవచ్చని చెబుతున్నాయి.
కార్యాలయాల్లో నీటిఅవసరాలు తీర్చడం కష్టం కావడంతో సిబ్బంది ఇక ఇళ్ల నుంచే పనిచేయవచ్చని చాలా కంపెనీలు చెప్పేశాయి. చెన్నైలో వర్షాలు వచ్చేందుకు ఇంకా మూడునెలల గడువు ఉంది. గత 200 రోజులుగా అక్కడ వానల్లేవు. వచ్చే మూడునెలల్లో నీళ్ల కొరత తీరేంత వర్షాలు వస్తాయన్ననమ్మకం లేదు.
దాదాపు 12 పెద్ద ఐటి కంపెనీలు దాదాపు 5000 మంది ని ఇళ్ల దగ్గిరనుంచే పనిచేయాలని పురమాయించినట్లు టైమ్స్ ఆప్ ఇండియారాసింది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎపుడూ రాలేదు. ఒక నాలుగేళ్ల కిందట కూడా ఐటి కంపెనీలు సిబ్బందిని ఇళ్ల దగ్గిర నుంచే పని చేయాలని చెప్పారు. అపుడు కారణం అపుడు ప్రయివేటు ట్యాంకర్స సమ్మె చేయడంతో నీళ్ల కొరత ఏర్పడిందని ఈ పత్రికరాసింది. తర్వాత ఇలా తీవ్రమయిన నీటి కొరత ఏర్పడటం ఇదే.
అవుటర్ మహాబలిపురం రోడ్ (OMR) లో ఉన్న కంపెనీలు తీవ్రమయిన నీటికొరత ఎదుర్కొంటున్నాయి. ఈప్రాంతంలో దాదాపు ఆరువందల కంపెనీలున్నాయి. వర్షాలు రాకపోవడంతో అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడుకునేందుకు ఐటి కంపెనీలు రకరకాల పద్దతులు అవలంభిస్తున్నాయి. ఉదాహరణకు ఫ షోలింగనల్లూర్ లోని ఫోర్డ్ బిజినెస్ సర్వీసెస్ సంస్థ మంచినీళ్లు స్వయంగా తెచ్చుకోవాలని ఉద్యోగులను కోరింది.